newssting
BITING NEWS :
* నేడు తెలంగాణ కేబినెట్‌ సమావేశం*మాజీ ప్రధాని చంద్రశేఖర్‌ కుమారుడు, సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు నీరజ్‌ శేఖర్‌ బీజేపీలో చేరిక *నీటి ప్రాజెక్టులను నిలిపేసేందుకు జగన్ ప్రయత్నం- చంద్రబాబు*ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ *ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు *తెలంగాణలో నేటి నుంచి రెండో విడత వైద్య విద్య ప్రవేశాలు*అనంతపురంలో భారీవర్షం

కమలం గూటికి కీలక నేతలు,.. కోమటిరెడ్డి హాట్ కామెంట్స్

25-06-201925-06-2019 12:22:31 IST
Updated On 25-06-2019 12:27:56 ISTUpdated On 25-06-20192019-06-25T06:52:31.727Z25-06-2019 2019-06-25T06:52:28.768Z - 2019-06-25T06:57:56.795Z - 25-06-2019

కమలం గూటికి కీలక నేతలు,.. కోమటిరెడ్డి హాట్ కామెంట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పుడు బీజేపీకి ఏలా చేపట్టిందో ఇప్పుడు బీజేపీ ఆలాంటి పనిలోనే నిమగ్నమయి ఉంది. బీజేపీ నేత జితేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణలో బీజేపీ ఆ ఆకర్ష్‌కు శ్రీకారం చుట్టింది. రోజుకో నేతను ఆకర్షిస్తూ తన వలలో పడేలా చేసుకుంటోంది. ఏపీలో టీడీపీ అంతం మా పంతం అంటున్న బీజేపీ నేతలు.. తెలంగాణలో టీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేస్తోంది పనిలో పనిగా కాంగ్రెస్ నేతలకు వల వేసింది. బీజేపీ పై తీవ్ర  విమర్శలు చేసే వారిని పార్టీలోకి లాగేందుకు సిద్ధమవుతోంది.

ఒక్క టీఆర్ఎస్ పార్టీ నేతలే కాకుండా కాంగ్రెస్, టీడీపీ నేతలకోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తెలంగాణలో టీడీపీ చివరి దశకు చేరుకుంది. టీడీపీలో మిగిలిన ఒకరిద్దరు నేతల్ని టీఆర్ఎస్ లాగేందుకు ప్రయత్నించడంతో బీజేపీ నేతలు కళ్ళు తెరిచారు. పెద్దిరెడ్డి లాంటి టీడీపీ నేతల్ని ఎలాగైనా తమ పార్టీలోని చేర్చుకునే పనిలో పడింది బీజేపీ. గతంలో బీజేపీ ఎంపీగా పనిచేసి, కొంతకాలం టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న జితేందర్‌రెడ్డి 2019 లోక్ సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఇతర పార్టీ నేతల్ని లాగే ప్రయత్నంలో ఉంది బీజేపీ. 

ఆయనకు త్వరలో బీజేపీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో క్షేత్రస్థాయిలో బలపడేందుకు బీజేపీ నాయకత్వం ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలకు గాలం వేస్తోంది. ఎందుకంటే వారి వల్ల క్యాడర్ తక్కువగా ఉన్న బీజేపీ బలపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందులో భాగంగానే జితేందర్ రెడ్డి పక్కా స్కె్చ్చేశారు. ఈ నెల 27న మాజీ ఎంపీ చాడ సురేశ్‌రెడ్డి, మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బోడ జనార్దన్‌తో పాటు వందలాది మంది బీజేపీలో చేరనున్నట్లు జితేందర్ రెడ్డి చెబుతున్నారు. 

అలాగే వివిధ అసంత‌ృప్తులతో ఉన్న టీఆర్‌ఎస్‌ నుంచి కూడా వలసలు ప్రారంభమవుతాయంటున్నారు. కేసీఆర్‌ అవమానించిన టీఆర్‌ఎస్‌ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని జితేందర్ రెడ్డి చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఇలాంటి కామెంట్లు సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తుంటాయి. కానీ బీజేపీలో చేరితో భవిష్యత్తులో తానే సీఎం అవుతానంటూ ఆ కార్యకర్తను బుజ్జగించడం చర్చనీయాంశంగా మారింది. 

రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ గెలుస్తోందని తానే సీఎం అవుతానని ఘంటాపథంగా చెబుతున్నారు రాజగోపాల్ రెడ్డి.  మునుగోడు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఫోన్ చేయగా ఆ వ్యక్తితో కోమటిరెడ్డి రాజగోపాల్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలను తట్టుకోలేక రాహుల్ గాంధీయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారని ఆయన చెప్పుకొచ్చారు.

తెలంగాణలో ఎమ్మెల్యేలు వీడుతున్నా పట్టించుకోవడంలో ఉత్తమ్, కుంతియా ఫెయిల్ అయ్యారని తెలిపారు. అందుకే తాను బీజేపీ వైపు చూస్తున్నానని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి చేరికతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీజేపీ పటిష్టం అవుతుందని ఆపార్టీనేతలే చెబుతున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle