newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ

29-05-202029-05-2020 09:28:55 IST
Updated On 29-05-2020 09:39:05 ISTUpdated On 29-05-20202020-05-29T03:58:55.465Z29-05-2020 2020-05-29T03:58:34.493Z - 2020-05-29T04:09:05.726Z - 29-05-2020

కబ్జా రాయుళ్లకు కేరాఫ్‌గా మారిన ఉస్మానియా వర్శిటీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉస్మానియా యూనివర్సిటీ  ఎన్నో ఉద్యమాలకు కేంద్రం. ప్రపంచంలోని ఎన్నో సమస్యల పరిష్కారంకోసం నిలబడిన విద్యాసంస్థ. వంద సంవత్సరాలనుండి అనేక ప్రజాస్వామిక సమస్యలకు గొంతై నిలిచిన ఉస్మానియా నేడు సమస్యలో చిక్కుకుంది.అనేక సంస్థలకు బాధ్యత వహిస్తున్న జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి తాను చదువుకున్న యూనివర్సిటీ భూములను కబ్జా చేయడం పద్దతి కాదని, ఈ వ్యవహారంపై ఎవరైనా తనని విమర్శిస్తే పరువునష్టం దావా వేస్తానని బెదిరించడం తగదని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు మండిపడుతున్నారు.

ఎన్నో సమస్యల పరిష్కారంకోసం నిలబడిన విద్యాసంస్థ. వంద సంవత్సరాలనుండి అనేక ప్రజాస్వామిక సమస్యలకు గొంతై నిలిచిన ఉస్మానియా నేడు సమస్యలో చిక్కుకుంది. దేశంలోనే పురాతన యూనివర్సిటీల్లో ఒకటైన ఉస్మానియా యూనివర్సిటీ 1918లో పురుడుపోసుకుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఓయూ ఫౌండర్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ దాదాపు 4000 ఎకరాలను యూనివర్శిటీకి కేటాయించారు.

అయితే అప్పటినుంచి ఆక్రమణలు కొనసాగుతూనే వున్నాయి. వేలాది ఎకరాలు కబ్జాల్లో పోగా 1800 ఎకరాలు భూమి మిగిలిందని, ఆ భూమిని కూడా రోజుకు కొందరు కబ్జా చేస్తున్నారని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. తాజాగా మాజీ చీఫ్ జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి ఓయూ భూమిని ఆక్రమించుకోవాలని కుట్ర చేయడం దుర్మార్గమని విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నారు.  

అనేక సంస్థలకు బాధ్యత వహిస్తున్న జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి తాను చదువుకున్న యూనివర్సిటీ భూములను కబ్జా చేయడం పద్దతి కాదని, ఈ వ్యవహారంపై ఎవరైనా తనని విమర్శిస్తే పరువునష్టం దావా వేస్తానని బెదిరించడం తగదని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లు మండిపడుతున్నారు. అందరికీ ఆదర్శాల గురించి పాఠాలు చెప్పే ఉన్నత స్థానంలో వున్న వ్యక్తి కబ్జాలకు కారణం కావడంపై మండిపడ్డారు ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. 

ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఆ పార్టీ నాయకులతో ఓయూ అధికారులు కుమ్మక్కై ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని, అధికారుల బండారం కూడా బయటపెడతామని విద్యార్థులు చెపుతున్నారు. యూనివర్సిటీలో చదువుకుంతున్నందుకు యూనివర్సిటీపై బాధ్యత కూడా ఉంటుందని ఓయూ భూములను రక్షించుకోవడానికి త్వరలోనే    కార్యాచరణ ప్రకటిస్తామని విద్యార్థులు అంటున్నారు. ఓయూ విద్యార్ధినేత నసుగుల రంజిత్ యూనివర్శిటీలో విలువైన భూములు కబ్జాలకు గురికావడంపై మండిపడుతున్నారు. కాంగ్రెస్ నేతలు సైతం దీనిపై పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ బృందం యూనివర్శిటీలో పర్యటించింది. 

వారంరోజులుగా  ఈ విషయంపై అన్ని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు చేస్తున్న విమర్శలపై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు మాజీ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి కడుతున్న ఇంటిని కూల్చివేశారు. కట్టడం అక్రమమని కూల్చేశారు అధికారులు. ఇందుకోసం అక్రమ పర్మిషన్ ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకుంటారో, యూనివర్సిటీ భూమిలో ఆక్రమంగా నిర్మాణం చేసిన మాజీ చీఫ్ జస్టిస్ నరసింహరెడ్డిపై చర్యలు తీసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle