newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కన్నీళ్లు తెప్పిస్తున్న శ్రీశైలం మృతుల చివరి సంభాషణ

24-08-202024-08-2020 08:08:13 IST
Updated On 24-08-2020 13:27:19 ISTUpdated On 24-08-20202020-08-24T02:38:13.745Z24-08-2020 2020-08-24T02:38:08.587Z - 2020-08-24T07:57:19.002Z - 24-08-2020

కన్నీళ్లు తెప్పిస్తున్న శ్రీశైలం మృతుల చివరి సంభాషణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రాణాలు పోతాయని తెలిసి కూడా శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అసిస్టెంట్ ఇంజనీర్లు చివరి క్షణాల్లో ఏం మాట్లాడారో తెలిపే అరుదైన వీడియో బయటపడింది. శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్‌ కేంద్రంలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో తొమ్మిది మంది సిబ్బంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అగ్ని ప్రమాదంపై సీఐడీ విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రమాదంలో మృతి చెందిన ఏఈలు సుందర్‌, మోహన్‌ల చివరి సంభాషణ వెలుగులోకి వచ్చింది. 

చనిపోయే ముందు మోహన్‌ అగ్ని ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాలను వీడియో తీశాడు. శనివారం మోహన్ ఫోన్‌కు ఛార్జింగ్‌ పెట్టిన అతడి భార్య ప్రమీల అందులోని వీడియో దృశ్యాలు, సంభాషణలను చూసి కన్నీటి పర్యంతమైంది. ఆ వివరాలను ఆమె షేర్ చేయడంతో ప్రపంచానకి ఆ వీడియో వెల్లడయింది.

ఆ వీడియో 30 సెకన్లకు మించి లేదు కానీ భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో చిక్కుకున్న వారు చివరి ఆశలను కూడా వదిలేసుకున్న వైనాన్ని అది బీభత్సంగా చూపించింది. ఎమర్జెన్సీ అలారంలు భీకరంగా మోగుతుండగా సుందర్ నాయక్ భీతిల్లిన గొంతుతో వణుకుతూ మన పనయిపోయింది అంటూ మాట్లాడిన వైనం వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలను పిండేస్తోంది. పెద్దగా కొనసాగని ఆ సంభాషణ ఇక ఆశలు వదిలేసుకుందాం అనే మాటలో ముగిసిపోయింది.

మృతులు సుందర్‌, మోహన్‌ల మధ్య సంభాషణ 

సుందర్‌ : ఇక కష్టం! మన పని అయిపోయింది. ఆశలు వదులుకో.

మోహన్‌ : ఇప్పుడేం చేద్దాం... కొద్దిసేపు ఆలోచించుకుని తర్వాత వెళదాం.

సుందర్‌ : మనం ఆలోచిస్తూంటే, ఇక బతకం. పొగ అలుముకుంటోంది.

మోహన్‌ : లేదు తమ్ముడూ, మనం కాస్త ఆశగా ఉండాలె.. 

సుందర్‌ : కష్టమే... మన పనయిపోయింది.

అంతకు క్రితం సుందర్‌ తన భార్యతో జరిపిన ఫోన్‌ సంభాషణ సైతం వైరల్‌గా మారింది. ‘ నువ్వు, పిల్లలు జాగ్రత్త. 15 నిమిషాల్లో మమ్మల్ని కాపాడకపోతే బ్రతికే పరిస్థితి లేదు’ అన్న సుందర్‌ చివరి మాటలు పలువురిని కదిలించాయి.  కాగా, మోహన్‌ అనే మరో ఏఈ తోటి వారిని కాపాడటానికి సహకరించాడు. ఈ ఘటనలో 17 మంది విధుల్లో ఉండగా, ఎనిమిది మంది బయటపడ్డారు. మిగతా తొమ్మిది మంది ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు.

రాత్రంతా ప్రయత్నించాం కానీ.. ప్రాణాలు కాపాడలేకపోయాం.. ట్రాన్స్‌కో సీఎండీ

శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రంలో చోటుచుకున్న ప్రమాదం చాలా దురదృష్టకరమని ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్‌ రావు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో  ఏడుగురు ఇంజనీర్లుతో పాటు ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, తాము ఎంతో చింతిస్తున్నామని అన్నారు. సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే అక్కడకు చేరుకున్నామని, సిబ్బందిని కాపాడడం కోసం అనేక ప్రయత్నాలు చేశామని తెలిపారు. విద్యుత్‌ శాఖ మంత్రితో కలిసి ఆ రోజు రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించామని కానీ తమ వల్లకాలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ప్రభాకర్‌రావు ప్రమాద వివరాలను వెల్లడించారు.

‘ప్రమాదం అనంతరం విద్యుత్‌ కేంద్రంలో కరెంట్‌ పోయింది. దీనితో లోపల అంధకారమయ్యింది. పొగతో ఆక్సిజన్ లభించలేదు. పొగను బయటకు పంపించేందుకు చాలా కష్టపడ్డాం. అయినా దురదృష్టవశాత్తు వారు చనిపోయారు. విద్యుత్‌ కేంద్రలో ప్రమాదం జరిగితే వెంటనే ఆటోమేటిక్ ట్రిప్ కావాలి. కానీ కాలేదు ఎందుకు ట్రిప్ కాలేదు అనేదానిపై కమిటీ వేశాం. ఇలాంటి సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. పవర్ పోవడంతో వెంటిలేషన్ ఆగిపోయింది, దీనితో ఎమర్జెన్సీ వే కూడా తెరుచుకోలేదు. గత 30 రోజుల నుండి చాలా చక్కగా జరుగుతున్నాయి. రోజుకు 128 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది.

గతంలో కూడా ఎన్టీపీసీ లో బాయిలర్ బ్లాస్ట్ అయింది. ఆ ప్రమాదంలో దాదాపు 30 చనిపోయారు. తమిళనాడులో కూడా గతంలో ఇలాంటి సంఘటన  జరిగింది. దురదృష్టవశాత్తు మన దగ్గర కూడా జరిగింది దీనిపై కమిటీ వేశాం. కమిటీ త్వరలోనే నివేదిక ఇస్తారు. ప్రభుత్వం నుండి ఇప్పటికే వాళ్లకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటాం. త్వరలోనే వాళ్ళ కుటుంబాలకు జెన్కో నుంచీ సహాయం అందజేస్తాం. ఇలాంటి సంఘటనలు జరిగిన రాష్ట్రాల్లో ఇంత మొత్తంలో ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదు’అని పేర్కొన్నారు. 

ప్రమాద ఘటనపై త్వరలోనే కమిటీ పూర్తి నివేదికను అందిస్తుందని ప్రభాకర్‌రావు తెలిపారు. కాగా మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle