newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కన్నబిడ్డ ఎదుటే తండ్రిని చితకబాదిన పోలీసులు.. ఎస్పీ క్షమాపణ

03-04-202003-04-2020 11:29:42 IST
Updated On 03-04-2020 11:41:14 ISTUpdated On 03-04-20202020-04-03T05:59:42.913Z03-04-2020 2020-04-03T05:59:39.590Z - 2020-04-03T06:11:14.160Z - 03-04-2020

కన్నబిడ్డ ఎదుటే తండ్రిని చితకబాదిన పోలీసులు.. ఎస్పీ క్షమాపణ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో అసాధారణ అధికారాలను దక్కించుకున్న పోలీసు శాఖ సామాన్య ప్రజల పట్ల ఎలా వ్యవహరించాలో మర్చిపోయి పాశవిక చర్యలకు దిగుతుండటం యావత్ సమాజాన్ని దిగ్బ్రాంతి పరుస్తోంది. యావద్దేశం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ.. నిబంధనలను తుంగలో తొక్కి రోడ్లపైకి వస్తున్న వారిపై పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. కొన్ని చోట్ల ఖాకీలు ఎవరినీ నొప్పించకుండా కరోనాపై అవగాహన కల్పిస్తుంటే.. మరికొన్ని చోట్ల ప్రజల్ని ఇష్టానురీతిలో హింసిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. 

పోలీసుల ధాష్టీకానికి పరాకాష్టగా నిలుస్తున్న ఒక అమానుష ఘటన తెలంగాణలోని వనపర్తిలో చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ నిబంధనలను పక్కన పెట్టి రోడ్డుపైకి వచ్చిన ఓ వ్యక్తిని అతడి కుమారుడి ముందే విచక్షణా రహితంగా చితకబాదారు పోలీసులు. తన తండ్రిని ఏమీ చేయోద్దంటూ పిల్లాడు మొత్తుకుని ఏడుస్తున్నా కనికరించకుండా అమానుషంగా ప్రవర్తించారు. ‘‘ డాడీ! వద్దు డాడీ.. వద్దు అంకుల్’ ’’  అంటూ ఒకవైపు తండ్రిని, మరోవైపు తండ్రిపైకి దూకుతున్న పోలీసులను పిల్లాడు బ్రతిమలాడుతూ కన్నీరుమున్నీరయ్యాడు.  

ఆఖరికి చెప్పులు వేసుకోవటానికి కూడా అంగీకరించని పోలీసులు పిల్లాడిని, అతడి తండ్రిని జీపులో కుక్కి తీసుకెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. సదరు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ ఇలాంటి పోలీసుల ప్రవర్తనను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించం. హోమ్‌ మినిష్టర్‌ మహమూద్‌ అలీ, తెలంగాణ డీజీపీలు దయజేసి ఇటువంటి సంఘటనలపై కఠిన చర్యలు తీసుకోండి. కొద్దిమంది పోలీసుల తిక్క చేష్టల వల్ల వేలాది మంది పోలీసులకు అపఖ్యాతి వస్తోంద’ని పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆదేశాలను తీవ్రంగా పరిగణించిన వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వ రావు  వీడియో సాక్షిగా జరిగన ఈ క్రూరహింసాత్మక చర్యకు బాధ్యుడైన కానిస్టేబుల్ అశోక్‌ని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్ చేసినప్పటికీ ఆ ఘటనను వీడియోలో చూస్తున్న వేలాదిమంది ప్రజలు ఆగ్రహంతో పోలీసుల అతి చర్యపై మండిపడ్డారు. కొంతమంది పోలీసులు కలిసి నిస్సహాయుడైన వ్యక్తిని అతడి కన్నబిడ్డ ఎదురుగానే చితకబాదుతూ పోలీసు జీపులోకి విసిరేసిన దృశ్యాలు చూస్తూ జనం తట్టుకోలేకపోయారు. ఈ దారణానికి ప్రధాన పాత్ర వహించిన కానిస్టేబుల్ అశోక్‌‌ను కేవలం సస్పెండ్ చేయడం కాకుండా అత్యంత కఠిన దండన విధించాలని జనం డిమాండ్ చేశారు.

ఈ ఒక్కసంఘటనే కాదు కరోనా నేపథ్యంలో ప్రజలపై ధాష్టీకం చలాయించడంలో వనపర్తి పోలీసులు, అధికారులు రాటుదేలిపోయారు. కొద్ది రోజులక్రితం వనపర్తి డీఎస్పీ ఆంక్షలను ఉల్లంఘించి రోడ్లమీదికి వచ్చేవారికి తమ పోలీసులు స్పెషల్ కరోనా ట్రీట్‌మెంట్ ఇస్తారని ప్రకటించాడు. కరోనా స్పెషల్ ట్రీట్‌మెంట్ అంటే ఏమిటో కాదు లాఠీకి మేకులు గుచ్చి దాంతో ఉల్లంఘనులను బాదిపడేస్తారన్నమాట. అలాంటి ప్రకటన చేసినందుకే ఆ డీఎస్పీని ఉద్యోగంలోంచి ఊడగొట్టాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోవడం పోలీసులు మరీ రెచ్చిపోయేలా చేస్తోంది.

తాజా ఘటన విషయానికి వస్తే మల్కాజిగిరికి చెందిన మురళీ కృష్ణ మోతీలాల్ ఓస్వాల్ అనే స్టాక్ బ్రోకరేజి సంస్థలో ప్రాదేశిక మేనేజరుగా పనిచేస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించినప్పుడు తన స్వస్థలమైన వనపర్తికి వచ్చాడు. బుధవారం సాయంత్రం 5.15 గంటలకు మురళీకృష్ణ, తన కుమారుడైన ఎనిమిదో తరగతి అబ్బాయిని మోటార్ సైకిల్‌లో ఎక్కించుకుని వెళుతుండగా వైట్ టీషర్టు ధరించిన వ్యక్తి వారిని అడ్డగించి పిల్లాడితో బయటకు ఎందుకు వచ్చావని నిలదీశారుడు. దానికి క్షమాపణ చెప్పిన మురళి మళ్లీ ఇలాంటి పనిచేయనని హామీ కూడా ఇచ్చాడు. 

ఫైన్ కట్టాలని లేకుండే బండి సీజ్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు చెప్పడంతో ఈ ఒక్కసారికి తనను వదిలేయాలని మురళి ప్రాధేయపడ్డాడు. కానీ పోలీసులు బండి తాళం చెవిని లాక్కోవాలని ప్రయత్నించగా తాను అడ్డుకున్నానని, ఆ మాత్రం దానికే అశోక్ అనే టీషర్టు పోలీసు కానిస్టేబుల్ తనపై దాడిచేశాడని, దెబ్బలను కాచుకుంటుంటే రెచ్చిపోయి మీరీ కొట్టారని మురళి చెప్పారు. ఈలోపు తన కుమారుడు జరిగిందంతా చూస్తూ భయంతో ఏడుస్తూ నాన్నను వదిలేయమని అరుస్తున్నా పోలీసులు వినకుండా తనను తను బిడ్డను కూడా బలవంతంగా జీపులోకి ఎక్కించతారని. తానేదో పోలీసులపై దాడి చేస్తున్నట్లుగా వీడియో తీశారని మురళి ఆరోపించారు.

పోలీసు జీపులో కుక్కి స్టేషన్కి తీసుకెళుతూ కూడా చితకబాదిన పోలీసులు స్టేషన్‌లో ఎస్సైతో సహా అయిదుగురు చేరి అక్కడా తనను చిత్రహింసలకు గురిచేశారని మురళి చెప్పారు. 

ఘటన జరిగిన ప్రాంతంలోనే కాస్త ముందుగా మరో వాహనంలో వెళుతున్న మురళి భార్య సావిత్రి తన భర్తను అరెస్టు చేశారని వినగానే తక్షణం పోలీసు స్టేషనుకు వెళ్లి విచారిస్తే మహిళా కానిస్టేబుల్ ఆమెను స్టేషన్ బయటకు తోసివేయడమే కాకుండా తన ఫోను సైతం లాక్కున్నారని సావిత్రి ఆరోపించారు.

ప్రజలు గుంపులుగా తిరగ్గూడదని మాకు తెలుసు, అందుకే రెండు బైకుల్లో విడివిడిగా ప్రయాణించాం. కాని పోలీసులు నా భర్తను పట్టుకుని రూ. 2400లు ఫైన్ కట్టాలని ఆదేశిించారు. అనంతరం ఆయనపై జరిగిన దాడి క్రమంలో బంగారు చైన్ లాకెట్ కూడా పోగొట్టుకున్నారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు. నన్ను స్టేషన్‌లోకి కూడా రానివ్వకుండా అడ్డుకున్న పోలీసులు లోపల తన భర్తను దారుణంగా హింసించారని, చట్టబద్ధంగా చర్య తీసుకోవాలన్నా శక్తి లేనివాళ్లం. మాకు వచ్చిన కష్టం మరెవ్వరికీ రాకూడదని కోరడం తప్ప మరేమీ చేయలేని పరిస్థితిమాది అది సావిత్రి విలపించారు.

ఈ విషయం వీడియో రూపంలో వైరల్ అవడంతో మంత్రి కేటీఆర్ హోమంత్రి మహమ్మద్ ఆలీని హెచ్చరించారు. ఏ పరిస్థితుల్లో అయినా సరే పోలీసుల ఇలాంటి వైఖరి ఆమోదనీయం కాదని, ఘటనకు బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని  కేటీఆర్ ట్వీట్ చేస్తూ హోంమంత్రికి టాగ్ చేశారు.

జిల్లా ఎస్పీ మహిళాధికారి అయిన అపూర్వ రావు డ్యూటీలో ఉన్న పోలీసుల ప్రవర్తనకు గాను ప్రజలకు క్షమాపణ చెప్పారు. కన్నబిడ్డ ఎదుటే తండ్రిని క్రూరంగా హింసించిన కానిస్టేబుల్ అశోక్‌ వైఖరిని ఖండిస్తూ తక్షణం అతడిని విధులనుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాంటి హేయమైన ఘటన మరోసారి జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు కూడా.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle