కన్నతల్లిని ఎట్టకేలకు కలిసిన అమృత.. విలపించిన తల్లి
15-03-202015-03-2020 08:32:37 IST
2020-03-15T03:02:37.908Z15-03-2020 2020-03-15T03:02:34.392Z - - 18-04-2021

కన్నతండ్రి మారుతీరావు చివరి కోరికను ఆలస్యంగా అయినా మన్నించిన కుమార్తె అమృత ఎట్టకేలకు కన్నతల్లి గిరిజను ఆమె నివాసంలో కలిసింది. కన్నతండ్రి కులాహంకారానికి భర్త ప్రణయ్‌ను కోల్పోయిన అమృత దాదాపు ఒకటిన్నర సంవత్సరం తర్వాత పుట్టింటికి వెళ్లి తనలాగే భర్తను కోల్పోయిన కన్నతల్లి గిరిజను శనివారం సాయంత్రం కలుసుకుంది. దీంతో రాష్ట వ్యాప్తంగా సంచలన సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసు ఉదంతంలో అనుహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రణయ్ భార్య అమృత శనివారం సాయంత్రం తల్లి గిరిజను కలిశారు. ఇటీవల అమృత తండ్రి, ప్రణయ్ హత్య నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కాగా మారుతీరావు అంత్యక్రియల సందర్భంగా కడసారి తండ్రిని చూసేందుకు వచ్చిన అమృతను వారి కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకుని వెనక్కి పంపించారు. దీంతో తండ్రిని చివరిసారి కూడా చూడకుండానే అమృత వెనుదిరిగి వెళ్లిపోయారు. మారుతీరావు ఆత్మహత్య చేసుకునే ముందు అమృతను తల్లి గిరిజ వద్దకు వెళ్లమని లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తండ్రి మరణం అనంతరం తొలిసారి తల్లి గిరిజను చూసేందుకు పోలీసుల రక్షణ నడుమ అమృత తన నివాసానికి వచ్చి పరామర్శించారు. తండ్రి చివరి మాటను దృష్టిలో ఉంచుకుని అమృత గిరిజను కలిసినట్లు తెలుస్తోంది. కాగా గత ఏడాది ప్రణయ్‌ను వివాహమాడిన తరువాత తల్లిని కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. మారుతీరావు మరణం అనంతరం అమృత బాబాయ్ శ్రవణ్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. శ్రవణ్ వేధింపుల కారణంగానే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యకేసులోని ప్రధాన నిందితుడు మారుతీరావు కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తండ్రిని కడసారి చూడటానికి వెళ్లిన అమృతను కుటుంబ సభ్యులు, బంధువులు అడ్డుకోవడంతో వెనుదిరిగింది. శనివారం నాడు సాయంత్రం మీడియా కంట పడకుండా.. పోలీసుల రక్షణతో మిర్యాలగూడలోని తల్లి గిరిజ నివాసానికి అమృత వెళ్లింది. తన ఇంటి నుంచి కారులో తన కొడుకుతో కలిసి అమృత వెళ్లగా.. వెనుక పోలీసులు ఫాలో అవుతూ వచ్చారు.! అయితే తల్లిని కలుస్తున్నాన్న విషయాన్ని అమృత మీడియాకు చెప్పలేదు. అంతేకాదు.. తల్లిని కలిసిన తర్వాత మీడియాతో కూడా అమృత మాట్లాడలేదు. మీడియాను రానివ్వద్దని పోలీసులకు చెప్పి తల్లిని కలిసిందని సమాచారం. శనివారం 5.30 నిమిషాలకు అమృత తన కుమారుడ్ని తీసుకుని తల్లి వద్దకు వెళ్లింది. అమృతను చూసిన గిరిజ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యింది. సుమారు పావుగంట పాటు తల్లి-అమృత ఇద్దరు మాట్లాడుకున్నారు. తల్లిని పరామర్శించిన అనంతరం మారుతీరావు నివాసం నుంచి పోలీసుల రక్షణతో తిరిగి తన అత్తారింటికి అమృత వెళ్లిపోయింది. స్థానికులు చెప్పడంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. కాగా శుక్రవారం నాగార్జుననగర్ లో తన తండ్రి మారుతీరావుకు చెందిన ప్లాట్స్‌ను అమృత పరిశీలించింది. ఓ వ్యక్తి బైక్ పై అక్కడికి వచ్చిన అమృత ఆ ప్లాట్స్ ఫొటోస్ తీసుకున్నది. కొన్ని సెల్ఫీస్ కూడా తీసుకున్నది. స్థానికులు కొందరు అమృతను కెమెరాలతో ఫొటోలు తీయడంతో ఈ విషయం వెలుగుచూసింది. కాగా.. మారుతీరావు ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాశాడు. ‘గిరిజ క్షమించు.. తల్లి అమృతా దగ్గరికి వెళ్లిపో’ అని సూసైడ్ నోట్లో రాసి ఉంది. తండ్రి చివరిగా అమ్మదగ్గరికి వెళ్లమని చెప్పడంతో.. ఆ మాటను దృష్టిలో ఉంచుకుని గిరిజను అమృత కలిసినట్లు తెలుస్తోంది. అయితే.. తండ్రిని చూడటానికి వెళ్లగా.. బంధువులు అడ్డుకోవడంతో ఇవాళ పోలీసుల రక్షణతో తల్లిని అమృత కలిసింది. భర్త, కన్న తండ్రి మరణం తర్వాత అయినా అమృత కన్నతల్లిని కలిసి ఓదార్చడం విశేషం.

బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆరోగ్య పరిస్థితి విషమం
4 hours ago

చంద్రబాబుపై ఎదురుదాడి.. కుప్పం ప్రస్తావన తీసుకొచ్చారుగా..!
5 hours ago

షర్మిల ఆరోగ్య పరిస్థితి ఇది..!
2 hours ago

తిరుపతి పార్లమెంట్ ఎన్నికను రద్దు చేయాలి.. పెద్దిరెడ్డిపై విరుచుకుపడ్డ చంద్రబాబు
5 hours ago

జానారెడ్డి చేతిలో.. రేవంత్ రెడ్డి భవిష్యత్
6 hours ago

అబ్బో సమస్యలపై కూడా జగన్ ఫోకస్ చేస్తున్నారా
7 hours ago

కోవిడ్ ను ఎదుర్కోవడంలో మోడీ సర్కారు విఫలం.. సోనియా గాంధీ
20 hours ago

కోరలుచాస్తున్న కరోనా.. బెంగాల్ లో ఐదో దశ పోలింగ్ .. నిబంధనలు పట్టని పార్టీలు
a day ago

దొంగ ఓట్ల రచ్చ.. స్పందించిన పెద్దిరెడ్డి రామ చంద్రా రెడ్డి
a day ago

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు
17-04-2021
ఇంకా