newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

కడియం వర్సెస్ రాజయ్య... గులాబీ నేతల ఆధిపత్యపోరు

20-02-202020-02-2020 09:20:41 IST
Updated On 20-02-2020 09:21:15 ISTUpdated On 20-02-20202020-02-20T03:50:41.769Z20-02-2020 2020-02-20T03:50:38.558Z - 2020-02-20T03:51:15.325Z - 20-02-2020

కడియం వర్సెస్ రాజయ్య... గులాబీ నేతల ఆధిపత్యపోరు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ ఉపముఖ్యమంత్రులు నువ్వా నేనా అని కయ్యానికి కలుదువ్వుతున్నారు. ఇద్దరూ ఒకే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అయితే ఒకరు గతంలో ఎమ్మెల్యే గా కొనసాగగా... మరొకరు నాలుగు పర్యాయాలు సిట్టింగ్ ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. గతంలో ఎమ్మెల్యే గా కొనసాగిన నేత కు నియోజకవర్గం లేకపోవడంతో పాత నియోజకవర్గం మీద దృష్టి సారించారు. 

సిట్టింగ్ ఎమ్మెల్యేతో ఢీ అంటే ఢీ అంటున్నారు. వారే కడియం శ్రీహరి.. తాటికొండ రాజయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం వర్గపోరుకు కేంద్రంగా మారింది. పార్టీ పరువు పోయినా ఫర్వాలేదు కానీ. నువ్వు... నేనా అంటూ రాజకీయాలకు తెరలేపుతున్నారు కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య. గతంలో  కాంగ్రెస్ పార్టీలో తాటికొండ రాజయ్య. టీడీపీ లో కడియం శ్రీహరి కొనసాగుతున్న సమయంలో వచ్చిన 2009  ఎన్నికలలో ఇద్దరు ఆయపార్టీల నుండి పోటీ చేయగా కడియం పై రాజయ్య గెలిచారు. కొద్దిరోజులకే రాజయ్య ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీ ఆర్ ఎస్ లో చేరారు.  తిరిగి అదే నియజకవర్గం నుండి టి ఆర్ ఎస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుండి 2009, 2012, 2014, 2019 లో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించి సిట్టింగ్ ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు.

అయితే తెలంగాణ ఉద్యమంలో తప్పని పరిస్థితుల్లో కడియం సైతం టీ ఆర్ ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో కడియం వరంగల్ ఎంపీ గా ఎన్నికయ్యారు. అయితే  రాజయ్య ను ఉపముఖ్యమంత్రి నుండి తప్పించిన కొద్దిరోజులు మాజీ మంత్రి, సీనియర్ నేత, ఎంపీ అయిన కడియం ను ఎంపీ పదవికి రాజీనామా చేయించి ఉపముఖ్యమంత్రి ని చేశారు. టీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్. వెంటనే ఎమ్మెల్సీ ని కట్టబెట్టారు. కడియం ఉపముఖ్యమంత్రి గా కొనసాగుతూనే 2019లో రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘన్ పూర్ నుండి ఎమ్మెల్యేగా గెలవడం కోసం గట్టిపట్టు తో టిక్కెట్ పై కోటి ఆశ లు పెట్టుకున్నారు.

కానీ అధినేత కేసీఆర్ 2019లో  సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య కు టిక్కెట్ ఇవ్వడంతో కడియం ఆశల మీద నీళ్ళు చల్లినట్లయింది. 2019లో మంత్రి పదవి కూడా రాకపోవడంతో కడియం ఎమ్మెల్సీ గా కొనసాగుతూ నా స్థాయి ఏమిటని మధనపడుతూ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం పై పట్టు సాధించడంతో పాటు రాజయ్యను దెబ్బతీసేందుకు రాజకీయం చేస్తున్నారు. ఈ క్రమంలో మొన్న జరిగిన సహకార ఎన్నికలను పావుగా వాడుకున్నారు కడియం.

జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యకు ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి చేదు అనుభవం ఎదురయింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్పంచులను, ఎంపీటీసీ లను , ఎంపీపిలను అత్యధికంగా గెలిపించడమే కాకుండా, వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత కూడా ఈయనకే ఉంది.

ఇంతవరకు ఎదురులేని మనిషి గా ఉన్న డాక్టర్ రాజయ్య కు సహకార సంఘాల ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైంది. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ పరిధిలోని ఏడు సొసైటీలకు గాను 6 సొసైటీలో 4 టిఆర్ఎస్, 2 కాంగ్రెస్ చైర్మన్ లను కైవసం చేసుకున్నాయి. 

స్టేషన్ ఘనపూర్ సొసైటీలోని 13 డైరెక్టర్లకు  8 టిఆర్ఎస్, 5 కాంగ్రెస్ కైవసం గెలుచుకున్నాయి. చైర్మన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు చెందిన ఇద్దరు డైరెక్టర్లు క్రాస్ ఓటింగ్ చేయడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ గా దక్కించుకుంది.టీఆర్ఎస్ పార్టీకి చెందిన  నాయకుడు బెలిదే వెంకన్న కారణమంటూ స్థానిక జెడ్ పి టి సి, కూడా డైరెక్టర్, ఎంపీటీసీల తో పాటు పలువురు నాయకులు అతని ఇంటి ముందు ధర్నా నిర్వహించి, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న వ్యక్తిని సస్పెండ్ చేయాలంటూ ధర్నా నిర్వహించారు. అయితే రాజయ్యను దెబ్బతీయడం కోసం కడియం చక్రం తిప్పారని నియోయకవర్గం లో టీ ఆర్ ఎస్ నేతల తో పాటు ఇతర పార్టీ నేతలు చెవులు కోరుకుంటున్నారు.

ప్రాథమిక సహకార సంఘం ఎన్నికల్లో కో-ఆర్డినేషన్ కమిటీ నిర్లక్ష్యం వల్ల ,చేతగానితనం వల్ల ఇక్కడ కాంగ్రెస్ గెలుచుకుందని దీనికి  తనను బాధ్యుడిని చేస్తూ ఇంటి ముందు ధర్నా చేయడం సరైంది కాదని, వారి పై పోలీస్ కేస్ పెట్టి చట్టపరంగా చర్య తీసుకుంటామని ఆయన అన్నారు. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో పార్టీ పరువును పక్కన పెట్టి కడియం, రాజయ్య లు డీ అంటే ఢీ అంటున్నారు. ఈ పరిణామాలు ఎవరికి లాభం... ఎవరికి నష్టం అనేది అధిష్టానం నిర్ణయం మీద ఆధారపడి ఉంది. కేసీయార్, కేటీయార్ వీరిమధ్య ఎలాంటి సయోధ్య కుదురుస్తారో చూడాలి. 

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   4 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   6 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   9 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   11 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   12 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   12 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   13 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   13 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   13 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   13 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle