newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

కంటైన్మెంట్లతో కరోనాకు చెక్... ఇక తెలంగాణ సేఫ్

16-04-202016-04-2020 16:56:55 IST
Updated On 17-04-2020 13:33:12 ISTUpdated On 17-04-20202020-04-16T11:26:55.187Z16-04-2020 2020-04-16T11:26:49.682Z - 2020-04-17T08:03:12.382Z - 17-04-2020

కంటైన్మెంట్లతో కరోనాకు చెక్... ఇక తెలంగాణ సేఫ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్రభుత్వం విస్తృత స్థాయిలో అమలు పరుస్తున్న కంటైన్మెంట్ల సాక్షిగా రాష్ట్రంలో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. ఒకవైపు మర్కజ్ కాంటాక్టులకు సంబందించి దాదాపు పరీక్షలు పూర్తి చేయడం, మరోపైవు అష్టదిగ్బంధంతో కరోనా వ్యాప్తిని సమర్థంగా అరికట్టడంతో కంటైన్మెంట్‌ ప్లాన్‌తో ఎక్కడికక్కడ వైరస్‌కు ముకుతాడు వేసినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. వైరస్ వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఎవరైనా ఈ కంటైన్మెంట్లను దాటి పోయే పరిస్థితి లేదు కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎంత సమర్థవంతంగా జల్లెడపడితే ఆ మేరకు ఫలితం ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా వైరస్ వ్యాపించే చైన్ తెగ్గొట్టడం కేరళను మినహాయిస్తే, తెలంగాణలో జరిగినంత సమర్థంగా మరే రాష్ట్రంలోనూ జరగలేదనిపిస్తుంది. మొత్తం మీద తెలంగాణలో ఇక కొత్తగా వైరస్ కేసులు పెరగవని, రెండో దఫా లాక్ డౌన్ ముగిసేనాటికి పరిస్థితి అందుపులోకి రావటం తథ్యమని వైద్యాధికారులు ఆశావహ దృక్పధంతో ఉంటున్నారు.

తెలంగాణలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు దాదాపుగా  ఫలితాలనిస్తున్నాయి. పరిస్థితి మొత్తం అదుపులోకి వచ్చినట్టేనని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కంటైన్మెంట్ల (హాట్‌స్పాట్లు)ను ఏర్పాటు చేయడం ఫలించింది. ఈ ప్రాంతాల పరిధిలోనే పాజిటివ్‌ కేసులు, వారి కాంటాక్టులు, కుటుంబసభ్యులుండటంతో ఇక వైరస్‌ ఆయా ప్రాంతాలను దాటి విస్తరించే పరిస్థితి ఉండదని వైద్యాధికారులు భావిస్తున్నారు. కంటైన్మెంట్లున్న ప్రాంతాల్లో ఎవరైనా బయటకు వెళ్లాలన్నా, లోనికి రావాలన్నా ఒకటే దారి ఏర్పాటు చేశారు. ఎందుకు బయటకు వెళ్తున్నారో, లోనికి వస్తున్నారో నమోదు చేస్తున్నారు. కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో కొన్నిచోట్ల డ్రోన్లతోనూ నిఘా ఉంచారు. 

పైగా ఉదయం, సాయంత్రం ప్రత్యేక బృందాలు ఇంటింటికీ వెళ్లి అక్కడి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తున్నాయి. మొన్నటి వరకు వైరస్‌ ఏ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందో స్పష్టంగా తెలియలేదు. కానీ ఇప్పుడు కేసుల సంఖ్య, కాంటాక్టు వివరాల ఆధారంగా ప్రత్యేకంగా కంటైన్మెంట్లను ఏర్పాటు చేయడంతో పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. అంతేకాక, కంటైన్మెంట్ల పరిధిలో ఉన్న క్వారంటైన్‌లోని బాధితులు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారందరి కదలికలపై ఆన్‌లైన్‌ నిఘా పెట్టడంతో ఎక్కడికి వెళ్లినా వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకునే వీలు కలిగింది. ఇలా అష్టదిగ్బంధం చేయడంతో వైరస్‌ వ్యాప్తికి అవకాశాల్లేవని ఓ అధికారి చెప్పారు.

కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యల ఫలితంగా ఇకపై కేసుల సంఖ్య తగ్గే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఓ కీలక ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఢిల్లీ మర్కజ్‌ వెళ్లిన వారిని గుర్తించామని, వారి కాంటాక్టులను, వారి ద్వారా ఇంకెవరైనా కాంటాక్టయ్యారా అనేదీ గుర్తించామని అంటున్నారు. కాబట్టి ఇకనుంచి కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను బట్టి ఒకట్రెండుసార్లు కేసుల సంఖ్య పెరిగినట్లు కనిపించినా మొత్తంగా కరోనా పూర్తి నియంత్రణలోకి వస్తుందని ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే నాటికి కరోనా కేసుల సంఖ్య ఇంకా తగ్గే అవకాశాలున్నాయని అంటున్నారు. 

‘ఇప్పుడు కరోనా వైరస్‌ ఎక్కడి వరకు వ్యాపించిందో స్పష్టత వచ్చింది. ఆ ప్రకారమే కంటైన్మెంట్‌ ప్రాంతాలు ఏర్పాటుచేశాం. పైగా ఇతర ప్రాంతాల్లోనూ లాక్‌డౌన్‌ అమలవుతోంది. కాబట్టి కేసుల సంఖ్య మునుముందు తగ్గుతుంది’అని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ జిల్లాలో అధిక కేసులు నమోదయ్యాయి. దీంతో జీహెచ్‌ఎంసీ ప్రాంతాల్లో కేసులు నమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 30 జీహెచ్‌ఎంసీ సర్కిళ్లకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టేందుకు సీనియర్‌ వైద్యాధికారులను నియమించారు. వైరస్‌ను నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కరోనాపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ సభ్యుడొకరు తెలిపారు.  

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉండటంతో ఒక సందర్భంలో అధికారులు నిరాశకు గురయ్యారు. కేసుల సంఖ్య 650కి చేరువకావడం, 18 మంది మృతి చెందడంతో పరిస్థితి అదుపు తప్పిందా అనే సందేహం నెలకొంది. మొదట్లో కేసులు విదేశాల నుంచి వచ్చిన వారితోనే రాగా, ఆపై నమోదైన ఎక్కువ కేసులు ప్రధానంగా మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారితోనే ముడిపడటంతో పరిస్థితి తీవ్రమైంది. మొత్తం 28 జిల్లాలకూ వైరస్‌ పాకింది. హైదరాబాద్, నిజామాబాద్, వికారాబాద్‌ జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా ఉంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో 259 కంటైన్మెంట్‌ ప్రాంతాలను ఏర్పాటుచేసింది.

ఇందులో మంగళవారం నాటికి 3.01 లక్షల ఇళ్లకు వెళ్లి వైద్యాధికారులు సర్వే చేశారు. మొత్తంగా 12.04 లక్షల మందిని కలిసి వివరాలు సేకరించారు. మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి కుటుంబసభ్యులు, వారి సెకండరీ కాంటాక్ట్‌ని ట్రేస్‌ చేసి పరీక్షలు చేస్తున్నారు. ఎలాంటి లక్షణాలు లేని, మర్కజ్‌తో సంబంధమున్న వారి నమూనాలను కూడా సేకరించారు. ఇప్పటికే మర్కజ్‌కు వెళ్లొచ్చిన వారి నమూనాల సేకరణ దాదాపు పూర్తయినట్లే. అక్కడక్కడ కొందరు దాక్కొన్నట్టు అంచనా. వారినీ పట్టుకొంటున్నారు. ఎవరైనా ఈ కంటైన్మెంట్లను దాటి పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఈ ప్రాంతాల్లో ఎంత సమర్థవంతంగా జల్లెడపడితే ఆ మేరకు ఫలితం ఉంటుందని అంటున్నారు.

భౌగోళికంగా క్వారంటైన్ చేయడం. వారిపై నిఘా పెట్టడం, అనుమానిత కేసులపై పరీక్షలు నిర్వహించడం, కాంటాక్టు కెరియర్లను క్వారంటైన్ చేయడం, రోగులను ఏకాంతంలో పెట్టడం వంటి చర్యలకు రాష్ట్ర వ్యాప్తంగా 3,067 టీములను ఏర్పాటు చేయడం అనూహ్యంగా సత్ఫలితాలను ఇచ్చిందని తెలంగాణ వైద్యాధికారి ఈ సందర్భంగా తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గత వారంరోజులుగా ఎదురుచూస్తున్న ఫలితం రానే వచ్చింది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ తుదిదశకు వచ్చిందన్న వార్తకంటే ఆయనకు సంతోషకరమైన ఘటన మరొకటి ఇప్పుడు ఏముంటుంది?

 

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   an hour ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   2 hours ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   2 hours ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   2 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   3 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   3 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   3 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   5 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   5 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle