newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

కంగనాకు వై కేటగిరీ కల్పించడంపై స్పందించిన కిషన్ రెడ్డి

12-09-202012-09-2020 22:18:50 IST
2020-09-12T16:48:50.959Z12-09-2020 2020-09-12T16:48:46.987Z - - 17-04-2021

కంగనాకు వై కేటగిరీ కల్పించడంపై స్పందించిన కిషన్ రెడ్డి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మహారాష్ట్ర వేదికగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు, శివసేన నేతలకు మధ్య గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరుగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై మాటల దాడి మొదలవ్వగా.. ఆ తర్వాత ముంబై మున్సిపాలిటీ అధికారులు ఆమె ఆఫీసును ధ్వంసం చేసే దాకా వెళ్ళింది. కంగనాను శివసేన నేతలు ఓపెన్ గా బెదిరించడం.. ముంబైలో ఎలా అడుగుపెడతావో అదీ చూద్దాం అని అనడం.. దమ్ముంటే ఆపుకోండి అంటూ సవాలు చేయడం లాంటి వన్నీ జరిగిపోయాయి.

మధ్యలో కేంద్ర ప్రభుత్వం కల్పించుకుని కంగనాకు వై కేటగిరీ సెక్యూరిటీని అందించింది. ఆమెకు కేంద్ర బలగాలతో సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. 24 గంటలూ 10 మంది ఆయుధాలు ధరించిన కమెండోలు రక్షణగా ఉంటారు. గతంలో ఎంతో మంది సినిమా నటులూ, ప్రముఖులను కూడా పలు పార్టీలు హెచ్చరించారని.. వారికి సెక్యూరిటీని అందించని ప్రభుత్వం.. ఇప్పుడు కంగనాకు ఏకంగా వై-సెక్యూరిటీ అందించడం వెనకగల కారణం ఏమిటో చెప్పాలని బీజేపీని పలువురు కోరారు.

ఈ వ్యవహారంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తన కుమార్తెకు ప్రమాదం ఉందని, అందువల్ల ఆమెకు భద్రత కల్పించాలంటూ కంగనా తండ్రి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరినందుకు భద్రతను కల్పించామని క్లారిటీ ఇచ్చారు. కొన్ని సామాజిక అంశాల పట్ల కంగనా మాట్లాడడంతో మహారాష్ట్రలోని కొందరు వ్యక్తులు ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. కంగనా తండ్రి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ ని కూడా కలిసి, తన కుమార్తెకు ముప్పు ఉందంటూ వినతిపత్రాన్ని ఇచ్చిన కారణంగానే ఆమెకు వై కేటగిరీ సెక్యూరిటీ కల్పించామని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

ముంబైను పాకిస్తాన్‌లో పోల్చుతూ శివసేనపై కంగనారనౌత్ తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ముంబై బంద్రాలోని కంగనా ఆఫీసు అక్రమం నిర్మాణమని బీఎంసీ ఆరోపించింది. అంతేకాదు ప్రొక్లెయినర్లతో అధికారులు కూల్చివేశారు. ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని పలువురు బీజేపీ నేతలు శివసేన మీద ఫైర్ అయ్యారు.   

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

Sagar By Poll: ప్రశాంతంగా సాగుతున్న సాగర్ ఉప ఎన్నికలు

   40 minutes ago


తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

తిరుపతి ఉప ఎన్నికను వెంటనే నిలిపేయాలి

   33 minutes ago


తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక: ఉదయం 11 గంటల వరకు 17.8 శాతం పోలింగ్

   2 hours ago


తిరుపతి పార్లమెంట్  ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో దొంగఓట్ల పంచాయతీ..!

   2 hours ago


తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

తిరుప‌తిలో కొన‌సాగుతోన్న పోలింగ్..ఓటుపై నోటు ఎఫెక్ట్

   5 hours ago


మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

మీదో పార్టీ.. ఆ పార్టీకో సెప‌రేట్ గుర్తు కూడానా.. ఇక గాజు గుర్తు లేన‌ట్లే

   3 hours ago


స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

స‌భ్య స‌మాజానికి ఏం మెస్సేజ్ ఇద్దామ‌ని అక్కా

   6 hours ago


టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలపై కరోనా ఎఫెక్ట్..!

   20 hours ago


ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

ఒక్క రోజు పోలీసు కమిషనర్ సాదిఖ్ ఇక లేడు

   16-04-2021


కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

కన్ను మూసిన నిమ్స్ మాజీ డైరక్టర్ కాకర్ల సుబ్బారావు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle