newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

ఔను.. వారంతా ఒక్కటయ్యారు..!

16-10-201916-10-2019 11:20:41 IST
Updated On 16-10-2019 17:23:52 ISTUpdated On 16-10-20192019-10-16T05:50:41.831Z16-10-2019 2019-10-16T05:50:39.258Z - 2019-10-16T11:53:52.165Z - 16-10-2019

ఔను.. వారంతా ఒక్కటయ్యారు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కాంగ్రెస్‌, వ‌ర్గ విబేధాలకు పెట్టింది పేరు. కానీ, హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్య‌ర్ధి గెలుపే ల‌క్ష్యంగా నేతలంతా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేస్తున్నారు. విబేధాల‌ను ప‌క్క‌నపెట్టి ఐక్య‌తా రాగాన్ని ఆల‌పిస్తున్నారు. పార్టీలోని కీల‌క నేత‌లంతా మండ‌లాలు, గ్రామాల‌వారీగా ప్ర‌చారం చేస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలోని ఏడు మండ‌లాల్లో కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు విస్తృత ప్ర‌చారం చేస్తున్నారు.

కాంగ్రెస్ రాజ‌కీయ ఉద్దండులు జానారెడ్డి, కోట‌మిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి, దామోద‌ర్‌రెడ్డి, భ‌ట్టి విక్ర‌మార్క‌, పొన్నం, వీహెచ్‌, జీవ‌న్‌రెడ్డి, శ్రీ‌ధ‌ర్‌బాబు, ష‌బ్బీర్ అలీ, కొండా సురేఖ‌, ఎమ్మెల్యే సీత‌క్క‌, మాజీ ఎమ్మెల్యే విజ‌య ర‌మ‌ణారావు ఇలా నేతలంతా విస్తృతంగా ప్ర‌చారంలో పాల్గొంటున్నారు.

ఈ నెల 19వ తేదీ వర‌కు హుజూర్‌న‌గ‌ర్‌లో ఇంటింటి ప్ర‌చారం చేసేందుకు వారంతా అక్క‌డే మ‌కాం వేశారు. త‌మ కీల‌క నేత‌లంతా భేషాజాలు వీడి కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ముందుకు సాగ‌డంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. ఇంత‌కు ముందు నేత‌లంతా ఒకే పార్టీలో ఉన్నా అంత స‌క్య‌త‌గా ఉండే వారు కాదు.

ఈ ఉప ఎన్నిక‌లో తామంతా ఐక్యంగా ఉన్నామ‌న్న సంకేతాలు ఇచ్చే విధంగా నేత‌లంతా ప‌నిచేస్తున్నారు. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్య‌ర్ధిగా ప‌ద్మావ‌తిని ఏక‌ప‌క్షంగా ప్ర‌క‌టించ‌డంపై తొలుత రేవంత్‌రెడ్డి అభ్యంత‌రం వ్య‌క్తంచేసి క‌ల‌క‌లం సృష్టించారు. ఆ స‌మ‌స్య‌ను అంత‌టికే ప‌రిమితం చేసిన రేవంత్ పద్మావ‌తి గెలుపు కోసం రెండు రోజుల‌ ప్ర‌చారానికి రానున్నారు.

ఈ నెల 18, 19 తేదీల్లో రేవంత్‌రెడ్ది రోడ్ షోల‌తో ప్ర‌చారం చేయ‌నున్నార‌ని కాంగ్రెస్ నేత‌లు చెబుతున్నారు. మొత్తానికి కాంగ్రెస్ నేత‌లు లైన్‌లో ప‌డ్డారు. హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌లో ఐక్య‌తా రాగం వినిపిస్తున్నారు. కానీ, హుజూర్ న‌గ‌ర్ ఉప ఎన్నిక త‌రువాత ఇదే ఐక్య‌ రాగం వినిపిస్తారా..? లేదా..? అన్న‌ది మిలియ‌న్ డార్ల ప్ర‌శ్న‌.

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   6 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   6 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   9 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   9 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   10 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   11 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   13 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   14 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   15 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle