newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఓరుగల్లుకు మంత్రి కేటీఆర్.. వరదలపై సమీక్ష

18-08-202018-08-2020 09:40:12 IST
Updated On 18-08-2020 09:50:09 ISTUpdated On 18-08-20202020-08-18T04:10:12.457Z18-08-2020 2020-08-18T04:10:01.435Z - 2020-08-18T04:20:09.112Z - 18-08-2020

ఓరుగల్లుకు మంత్రి కేటీఆర్.. వరదలపై సమీక్ష
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో భారీవర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ వరద సహాయక చర్యల్ని చేపడుతోంది. ముఖ్యంగా వరంగల్ జిల్లాను వరదలు ముంచెత్తున్నాయి. మంత్రులు కేటీఆర్, ఈటల ఇవాళ వరంగల్‌లో పర్యటించనున్నారు. కేటీఆర్ హైదరాబాద్‌ నుంచి మంత్రి ఈటలతో కలిసి హెలికాప్టర్‌లో వరంగల్ చేరుకుంటారు. దీంతో వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. 

వరంగల్ నేతలతో కలిసి ముంపు ప్రాంతాల్లో రోడ్డు మార్గాన పర్యటించనున్నారు. వరద పరిస్థితులు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై వరంగల్ నిట్‌లో సమీక్ష నిరవహించనున్నారు.జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేస్తూ వరద ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 

మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే సూచనలు ఉండటంతో అప్రమత్తంగా ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. కేటీఆర్‌ సోమవారం సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే, అదనపు కలెక్టర్‌ అంజయ్యతో ఫోన్‌లో మాట్లాడారు.లోతట్టు ప్రాంతాల్లోని వారిని సమీపంలోని గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలకు తరలించి అన్ని వసతులు కల్పించాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ అంజయ్, ఎస్పీ రాహూల్ హెగ్డేలత ఆయన ఫోన్లో మాట్లాడారు.

మరోవైపు వరంగల్‌ నగరాన్ని వరదలు ముంచెత్తిన నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ సోమవారం సమీక్షించారు. చేపట్టిన సహాయకచర్యలపై అధికారులను ఆరా తీశారు.

వరంగల్‌ నగరంలో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌ మంగళవారం వరంగల్‌లో పర్యటించనున్నారు. మరోవైపు నీటి ప్రవాహం ఉన్న రోడ్లపై ప్రయాణించవద్దని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోతున్నాయని.. ఇప్పటికీ పలువురిని రక్షించామని పేర్కొన్నారు.

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   13 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   15 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   21 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle