newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒక్క పాజిటివ్ కేసు బయటపడితే వంద ఇళ్లు దిగ్బంధం: తెలంగాణలో కఠిన ఆంక్షలు

15-04-202015-04-2020 10:50:29 IST
Updated On 15-04-2020 10:57:47 ISTUpdated On 15-04-20202020-04-15T05:20:29.051Z15-04-2020 2020-04-15T05:20:26.841Z - 2020-04-15T05:27:47.802Z - 15-04-2020

ఒక్క పాజిటివ్ కేసు బయటపడితే వంద ఇళ్లు దిగ్బంధం: తెలంగాణలో కఠిన ఆంక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ ప్రభుత్వం కరోనా పాజిటివ్ కేసుల వ్యాప్తిపై కన్నెర్ర జేసింది. ఇకపై ఏ ఒక్క ఇంట్లోనైనా సరే..  పాజిటివ్ కేసు ఒక్కటి బయటపడితే చాలు.. ఆ ఇంటి చుట్టూ ఉన్న 100 ఇళ్లతో కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించి మొత్తం ఆ ప్రాంతాన్ని దిగ్బంధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ జోన్‌లోకి అన్ని మార్గాలు, రోడ్లు మూసేసి.. వెళ్లేందుకు, వచ్చేందుకు ఒకే దారి ఏర్పాటు చేయాలని పేర్కొంది. అక్కడ 24 గంటల పాటు పోలీసు బందోబస్తు ఉండాలని తెలిపింది. అపార్ట్‌ మెంట్‌ లేదా గేటెడ్‌ కమ్యూనిటీలో పాజిటివ్‌ కేసు బయటపడితే వాటి పరిధి వరకు మాత్రమే కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేయొచ్చని స్పష్టం చేసింది. కేసుల సంఖ్యను బట్టి 100 మీటర్లు, 200 మీటర్లు, 500 మీటర్ల పరిధిలో కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఒకటి కంటే ఎక్కువ కేసులుంటే కనీసం 250 మీటర్ల పరిధిలో జోన్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. జోన్లకు బారికేడ్లతో పకడ్బందీగా సరిహద్దులు ఏర్పాటు చేయాలని, తగినంత బఫర్‌ జోన్‌ కూడా ఉండాలని పేర్కొంది. 

కంటైన్మెంట్‌ జోన్‌కు వెళ్లే అన్ని మార్గాలను 8 అడుగుల ఎత్తున్న బారికేడ్లతో మూసేయాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సరైన కారణాలు లేకుంటే కంటైన్మెంట్‌ జోన్‌ లోపలికి, బయటకు వేళ్లేందుకు ఎవరినీ అనుమతించొద్దని ఆదేశించింది. ఈ మేరకు కంటైన్మెంట్‌ జోన్ల నిర్వహణకు మార్గదర్శకాలు జారీ చేస్తూ రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మార్గదర్శకాలను రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లోనూ అమలు చేయాలని ఆదేశిస్తూ పురపాలక శాఖ డైరెక్టర్‌ సత్యనారాయణ మరో ఉత్తర్వు జారీ చేశారు. 

పురపాలక శాఖ ఉత్తర్వుల ప్రకారం జోన్‌ పరిధిలోని ప్రజలు ఇల్లు దాటి బయటకు రావడానికి కూడా వీల్లేదు. తమ ఇంటిముందు ఉన్న ఫుట్‌పాత్‌లపై కూడా నడవొద్దు. కంటైన్మెంట్‌ జోన్లని తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరి రాకపోకలు రికార్డు చేస్తారు. వ్యాధినిరోధక చర్యల్లో భాగంగా నిర్ణీత వ్యవధుల్లో మాస్కులు అందజేస్తారు. వచ్చిపోయే వారి వివరాల రికార్డు చేసి నిర్వహిస్తారు.

Villagers close entry points across Telangana

ప్రజలకు అవసరమైన సరుకులు ఇళ్లకు చేర్చేందుకు వాటి విక్రేతలు, రైతుబజార్‌ వ్యాన్లు, సూపర్‌మార్కెట్లు, కిరాణా, పాల వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు, మెడికల్‌ స్టోర్స్‌ నిర్వాహకులతో నోడల్‌ అధికారి మాట్లాడి ఏర్పాట్లు చేస్తారు. రోజూ మద్యాహ్నం 12 గంటల లోగా నిత్యావసరాలను ఇళ్ల వద్దే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కూరగాయలు, పాలు అందుబాటులో ఉంచుతారు. ధరలు పెంచకుండా చర్యలు తీసుకుంటారు. నిత్యవసరాల సరఫరాకు బాధ్యుడైన నోడల్‌ అధికారి పేరు, ఫోన్‌ నంబర్‌ తో తెలుగు, ఉర్దూలో కరపత్రాలు పంచుతారు. ప్రజలు ఏం చేయొచ్చో, ఏం చేయరాదో రికార్డు మెసేజ్‌ ఆటో ద్వారా ప్రచారం చేస్తారు. కరోనా పాజిటివ్‌ వ్యక్తులు బయటపడిన ఇంటివారికి నిత్యావసరాలు పంపిణీ చేసే ప్రభుత్వ అధికారులు తప్పనిసరిగా వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ) ధరించాలి. 

కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలో నివాసముండే ప్రతి ఒక్కరి ఆరోగ్య స్థితిగతులను రోజూ అధికారులు అడిగి తెలుసుకుంటారు. ఎవరికైనా వ్యాధి లక్షణాలుంటే తక్షణమే ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేస్తారు. వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయితే ఆస్పత్రిలో చికిత్స అందిస్తారు. నెగెటివ్‌ రిపోర్టు వస్తే వారిని తప్పనిసరి హోం ఐసోలేషన్‌లో ఉంచుతారు. కొత్త పాజిటివ్‌ కేసులు గుర్తిస్తే ప్రైమరీ కాంటాక్ట్‌ వివరాలను రూపొందిస్తారు. కాంటాక్ట్‌ అయిన వారిని గుర్తించి ఆరోగ్య స్థితిని బట్టి క్వారంటైన్‌ లేదా ఐసొలేషన్‌కు తరలిస్తారు. 

కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలో ఇళ్లు లేని అనాథలను గుర్తించి షెల్టర్‌ హోమ్స్‌‌కు తరలిస్తారు. ఒక కుటుంబానికి చెందిన వారందరినీ ఒకే చోట చేర్చుతారు. వలంటీర్లు లేదా అన్నపూర్ణ పథకం ద్వారా వారికి ఉచిత భోజన సదుపాయం కల్పిస్తారు. వలస కార్మికులకు కూడా భోజన సదుపాయం కల్పిస్తారు. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle