newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒక్క ట్వీట్‌.. స‌మ‌స్య ప‌రిష్కార‌మైన‌ట్లే..!

20-04-202020-04-2020 07:42:28 IST
Updated On 20-04-2020 10:40:21 ISTUpdated On 20-04-20202020-04-20T02:12:28.416Z20-04-2020 2020-04-20T02:12:25.452Z - 2020-04-20T05:10:21.052Z - 20-04-2020

ఒక్క ట్వీట్‌.. స‌మ‌స్య ప‌రిష్కార‌మైన‌ట్లే..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక‌వైపు క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. మ‌రోవైపు లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇటువంటి విప‌త్క‌ర స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం త‌ర‌పున ఆప‌ద‌లో ఉన్న వారికి అండ‌గా నిలుస్తున్నారు మంత్రి కేటీఆర్‌. పిలిస్తే ప‌లికే నాయ‌కుడు అనే వారి గురించి విన్నాం. చూడ‌టం అరుదు. కేటీఆర్ ఆ కోవ‌కే చెందిన వారు. ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్న తీరు, ఇబ్బందుల్లో ఉన్న వారికి అందిస్తున్న స‌హాయ‌స‌హకారాలు రాజ‌కీయాల‌తో సంబంధం లేకుండా అభినందించాల్సిందే.

మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. ప్ర‌త్యేకించి ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. సాధార‌ణ స‌మ‌యాల్లో ట్విట్ట‌ర్ ద్వారా త‌న దృష్టికి వ‌చ్చే స‌మ‌స్య‌ల‌కు ఆయ‌న స్పందించి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటుంటారు. దీంతో తెలంగాణ ప్ర‌జ‌ల్లో గ‌త కొంత‌కాలంగా స‌మ‌స్య‌లు ఉంటే కేటీఆర్‌కు ట్వీట్ చేస్తే ప‌రిష్కారం అవుతాయ‌నే భావ‌న పెరిగింది. ఈ న‌మ్మ‌కంతోనే గ్రామీణ ప్రాంతాల్లోనూ, ట్విట్ట‌ర్ ప‌ట్ల అవ‌గాహ‌న లేని వారు కూడా చ‌దువుకున్న వారితో కేటీఆర్‌కు ట్వీట్ చేయిస్తుంటారు.

ఇప్పుడు క‌రోనా స‌మ‌యంలో అయితే కేటీఆర్ రోజుకు ప‌దుల సంఖ్య‌లో ట్వీట్ల‌కు స్పందిస్తున్నారు. లాక్ డౌన్ కార‌ణంగా రాష్ట్రంలో ఆంక్ష‌లు కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో స్వంత ఊర్ల‌కు, ప‌క్క రాష్ట్రాల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితులు కొంద‌రికి త‌లెత్తుతున్నాయి. ఇటువంటి స‌మ‌యంలో 100కు డ‌య‌ల్ చేయాల్సిందిగా ప్ర‌భుత్వం ఇప్ప‌టికే చెప్పింది. అయినా కొంద‌రు కేటీఆర్‌కు ట్వీట్లు చేస్తున్నారు. అంత్య‌క్రియ‌ల‌కు హాజరుకావాల్సిన వారు, స్వ‌గ్రామాల్లో త‌ల్లిదండ్రుల‌ను చూసుకోవాల్సిన వారు వెళ్లేందుకు త‌మ‌కు అనుమ‌తి ఇవ్వాల్సిందిగా కేటీఆర్‌కు ట్వీట్ చేస్తున్నారు.

ఇలా వ‌చ్చిన ప్ర‌తీ ట్వీట్‌కు మాన‌వ‌తా దృక్ఫ‌థంలో కేటీఆర్ వెంట‌నే స్పందిస్తున్నారు. స‌ద‌రు ట్వీట్ చేసిన వారిని సంప్ర‌దించిన వారికి కావాల్సిన స‌హాయం అందించాల్సిందిగా ఆయ‌న త‌న కార్యాల‌య సిబ్బందికి వెంట‌నే ఆదేశాలు ఇస్తున్నారు.

కేవ‌లం ట్విట్ట‌ర్‌లో వ‌చ్చే కేటీఆర్ ఆదేశాల‌పై స్పందించి ప‌ని చేసేందుకే ప్ర‌త్యేకంగా కేటీఆర్ కార్యాల‌యంలో సిబ్బంది ఉన్నారు. ఇక‌, ఒక్కోసారి అవ‌స‌రాన్ని బ‌ట్టి పార్టీ నాయ‌కుల‌కు, ప్ర‌జాప్ర‌తినిధుల‌కు, సంబంధిత అధికారుల‌కు కూడా కేటీఆర్ ట్విట్ట‌ర్‌లోనే ఆదేశాలు జారీ చేస్తున్నారు.

ఇటీవ‌ల న‌గ‌రంలో అర్థ‌రాత్రి వేళ ఓ చిన్నపాప‌కు పాలు అందించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఇది విన‌డానికి చిన్న స‌మ‌స్య‌గా అనిపించినా ఓ చిన్నారి ఆకలిని కేటీఆర్ అర్థం చేసుకొని వెంట‌నే స్పందించారు. మ‌న రాష్ట్రానికి చెందిన వారు ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్నా ఆయా రాష్ట్రాల‌కు చెందిన మంత్రులు, అధికారుల‌ను కేటీఆర్ వెంట‌నే సంప్ర‌దించి వారికి త‌గు సౌక‌ర్యాలు అందేలా చూస్తున్నారు. తెలంగాణ‌లో ఉన్న ఇత‌ర రాష్ట్రాల వారికీ సౌక‌ర్యాలు అందిస్తున్నారు. ఈ మేర‌కు ఆయా రాష్ట్రాల మంత్రులు కూడా కేటీఆర్‌కే ట్వీట్ చేస్తున్నారు.

ఒక‌వైపు ట్విట్ట‌ర్ ద్వారా అందుబాటులో ఉంటూనే క‌రోనా క‌ట్ట‌డిలోనూ కేటీఆర్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. మున్సిప‌ల్ శాఖ మంత్రిగా పుర‌పాల‌క సంఘాలు, మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ల‌లో ఎప్ప‌టిక‌ప్పుడు అధికారుల‌కు త‌గు సూచ‌న‌లు అందిస్తూ ప‌టిష్ఠ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

లాక్‌డౌన్ కార‌ణంగా న‌గ‌రంలోని కొన్ని ఐటీ సంస్థ‌ల్లో ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నారు. దీనిపైనా ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ వెంట‌నే స్పందించి ఐటీ సంస్థ‌ల‌కు లేఖ‌లు రాశారు. ఎవరూ ఉద్యోగుల‌ను తొల‌గించ‌వ‌ద్ద‌ని కోరారు. హైద‌రాబాద్‌లో కంటైన్‌మెంట్ క్ల‌స్ట‌ర్ల‌లో పర్య‌టిస్తూ ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.

అయితే, త‌న‌కు సంబంధం లేని శాఖ‌ల్లోనూ కేటీఆర్ జోక్యం చేసుకుంటున్నార‌ని, అన్ని శాఖ‌ల అధికారుల‌కు ఆయ‌నే ఆదేశాలు ఇస్తూ ఆయా శాఖ‌ల మంత్రుల‌ను నామ‌మాత్రం చేస్తున్నార‌నేది కేటీఆర్‌పై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల ఆరోప‌ణ‌. ఈ ఆరోప‌ణ‌లను ప‌క్క‌న పెడితే క‌రోనా సృష్టించిన విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో కేటీఆర్ మాత్రం ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధిగా ప‌ని చేస్తున్నారు. కేటీఆర్‌కు ఒక్క ట్వీట్ చేస్తే త‌మ స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌నే న‌మ్మ‌కాన్ని ప్ర‌జ‌ల్లో క‌ల్పించారు.

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   12 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   16 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   19 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   20 hours ago


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle