newssting
BITING NEWS :
* శనివారం మధ్యాహ్నమే కేబినెట్ సమావేశం..ఈ నెల 20న జరగాల్సిన సమావేశాన్ని రేపటికి ప్రీ పోన్ చేసిన ఏపీ సర్కార్ *కాకినాడలో దారుణం..రేచర్లపేటలో నాలుగేళ్ల చిన్నారి మీద అత్యాచారం..చిన్నారి మీద అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరు మైనర్లు *నల్గొండ: హాజీపూర్ వరుస హత్య కేసుల్లో ముగిసిన వాదనలు.. తీర్పు రిజర్వ్.. ఈ నెల 27న తీర్పు వెల్లడించనున్న న్యాయస్థానం*ఢిల్లీ: నిర్భయ కేసులో నిందితుడు ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్*ఆస్తుల కేసులో హాజరుకాలేనని సీబీఐ కోర్టులో సీఎం వైఎస్ జగన్ పిటిషన్... విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు.. ఈ రోజు హాజరుపై సీఎం జగన్‌కు మినహాయింపు ఇచ్చిన సీబీఐ కోర్టు*అమరావతిలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ అమలుపై హైకోర్ట్ సీరియస్ *అమరావతిలో 31వ రోజుకు చేరిన ఆందోళన.. లోకేష్ బైక్ ర్యాలీ *ఏపీ గవర్నర్ ని కలిసిన అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు *నిర్బయ దోషులకు కొత్త డెత్ వారెంట్ జారీ.. ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం ఆరుగంటలకు ఉరిశిక్ష అమలు * టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

ఒక్క ఎన్‌కౌంట‌ర్‌... అనేక వాద‌న‌లు..!

07-12-201907-12-2019 09:03:23 IST
Updated On 11-12-2019 12:46:49 ISTUpdated On 11-12-20192019-12-07T03:33:23.887Z07-12-2019 2019-12-07T03:28:06.141Z - 2019-12-11T07:16:49.513Z - 11-12-2019

ఒక్క ఎన్‌కౌంట‌ర్‌... అనేక వాద‌న‌లు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక్క ఎన్‌కౌంట‌ర్‌... కోట్లాది మందిలోని ఆగ్ర‌హాన్ని చ‌ల్లార్చింది. సంబ‌రాలు చేసుకునేలా చేసింది. ప్ర‌భుత్వాన్ని,  పోలీసుల‌ను విమ‌ర్శించిన వారే ప్ర‌శంసించేలా చేసింది. పూల‌వ‌ర్షం కురిపించేలా చేసింది. శుక్ర‌వారం తెల్ల‌వారు జామున హైద‌రాబాద్ శివారులో జ‌రిగిన నలుగురు రాక్ష‌సుల ఎన్‌కౌంట‌ర్ వార్త‌తో దేశం నిద్ర‌లేచింది.

యావ‌త్ దేశ‌ ప్ర‌జానికానికి ఇది శుభ‌వార్త‌గా మారింది. కామాంధుల చేతిలో దారుణంగా హ‌త్యాచారానికి గురైన దిశ‌కు న్యాయం జ‌రిగింద‌ని, ఎన్‌కౌంట‌ర్ చేసిన పోలీసుల‌కు ప్ర‌జ‌లు సెల్యూట్ చేస్తున్నారు.

తెలంగాణ పోలీసులు, ప్ర‌భుత్వం ప‌ట్ల దేశ్యాప్తంగా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. రేపిస్టును కాల్చిపారేసినందుకు పొగ‌డ్త‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. మిగ‌తా రాష్ట్రాలూ తెలంగాణ‌ను చూసి నేర్చుకోవాల‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌, సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌నార్‌కు పాలాభిషేకాలు జ‌రుగుతున్నాయి. దిశ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించ‌లేద‌ని, క‌నీసం స్పందించ‌లేద‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై వ‌చ్చిన విమ‌ర్శ‌ల‌న్నీ ఈ ఒక్క ఎన్‌కౌంట‌ర్‌తో మాట‌ష్‌.

త‌మ కూతురు ఆప‌ద‌లో ఉంద‌ని వెళ్లిన దిశ త‌ల్లి, చెల్లిని అవ‌మానించేలా మాట్లాడిన పోలీసుల వైఖ‌రిని, దిశ చెల్లెలికి కాకుండా 100కు ఫోన్ ఎందుకు చేయ‌లేద‌నే హోంమంత్రి మాట‌ల‌ను ఈ ఎన్‌కౌంట‌ర్‌ మ‌రిచిపోయేలా చేసింది.

11 ఏళ్ల క్రితం వ‌రంగ‌ల్‌లో ఇద్ద‌రు విద్యార్థినుల‌పై యాసిడ్ దాడి జ‌రిగిన‌ప్పుడు అప్ప‌టి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌భుత్వం ముగ్గురు నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ చేసింది. ఇది ఇప్ప‌టికీ ప్ర‌జ‌లు మ‌రిచిపోలేదు.

దిశ ఉదంతం జ‌రిగిన‌ప్పుడు కేసీఆర్ కూడా వైఎస్సార్‌లా చేయాల‌ని, స‌జ్జ‌నార్ మ‌రోసారి వ‌రంగ‌ల్‌లో చేసిన‌ట్లు ఎన్‌కౌంట‌ర్ చేయాల‌నే విన‌తులు వ‌చ్చాయి. ఇప్పుడు కూడా ఈ ఎన్‌కౌంట‌ర్‌ను, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను, సీపీ స‌జ్జ‌నార్‌ను కొన్నేళ్ల వ‌ర‌కు ప్ర‌జ‌లు మ‌రిచిపోరు.

ఇంత‌మందిని సంతోషానికి గురి చేసిన ఈ ఎన్‌కౌంట‌ర్ వెనుక మ‌రో ర‌క‌మైన వాద‌న‌లు, ప్ర‌శ్న‌లు కూడా వినిపిస్తున్నాయి. ప్ర‌గ‌తిశీల‌, అభ్యుద‌య‌వాదులు ఈ ఎన్‌కౌంట‌ర్‌పై ప్రశ్న‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు.

నిందితులు చేసిన ఘోరానికి వారికి మ‌ర‌ణశిక్ష స‌రైన‌దే అని, అయితే అది న్యాయ‌ప‌రంగా ఉరిశిక్ష కావాలి కానీ పోలీసులు చ‌ట్టాన్ని చేతుల్లోకి తీసుకోవ‌డం ఏంట‌నే ప్ర‌శ్న‌లు వేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై జాతీయ మాన‌వ హ‌క్కు క‌మిష‌న్ కూడా స్పందించి తెలంగాణ ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది.

ఒక‌, నిందితుల బంధువులు, కుటుంబ‌స‌భ్యుల వాద‌న మ‌రోర‌కంగా ఉంది. వారి పిల్ల‌లు దిశ‌ను దారుణంగా హ‌త‌మార్చిన‌ప్పుడు చేసిన నేరానికి ఏ శిక్ష వేసినా స‌రే అని చెప్పారు. కానీ, ఎన్‌కౌంట‌ర్‌లో త‌మ పిల్ల‌లు మ‌ర‌ణించార‌నే వార్త తెలిసిన త‌ర్వాత వారి స్పంద‌న భిన్నంగా ఉంది. స‌మాజంలో ఎంతోమంది ఇటువంటి నేరాలు చేస్తున్నార‌ని, ఇందులో పెద్ద‌పెద్ద వాళ్లు కూడా ఉన్నార‌ని, మ‌రి వారంద‌రినీ జైళ్ల‌లో మేపుతూ.. త‌మ పిల్ల‌ల‌నే ఎందుకు ఎన్‌కౌంట‌ర్ చేశార‌నేది వారి ప్ర‌శ్న‌.

ఇక‌, అగ్ర‌వ‌ర్ణాల‌కు చెందిన బాధితుల‌కు ఒక న్యాయం, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల బాధితుల‌కు మ‌రో న్యాయం జ‌రుగుతుంద‌నేది మంద కృష్ణ వంటి వారి ఆరోప‌ణ‌. హ‌జీపూర్ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులు, హ‌త్యాచారాల‌కు గురైన‌ టేకు ల‌క్ష్మి, మాన‌స వంటి వారు బ‌డుగు, బ‌లహీన వ‌ర్గాల‌కు చెందిన వార‌ని, ఈ కేసుల్లో నిందితుల‌ను ఎన్‌కౌంట‌ర్ ఎందుకు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

మాన‌స కుటుంబ‌స‌భ్యులైతే నిన్న‌నే వ‌రంగ‌ల్‌లో త‌మ కూతురుకు కూడా ఆత్మ‌శాంతి క‌ల‌గాలంటే దిశను హ‌త్య‌చేసిన నిందితుల‌ను చేసిన‌ట్లే మాన‌స‌ను పొట్ట‌న‌పెట్టుకున్న వారిని ఎన్‌కౌంట‌ర్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

అయితే, తాము కావాల‌ని ఎన్‌కౌంట‌ర్ చేయ‌లేద‌ని, నిందితులు త‌మ‌కు ఎదురుతిరిగి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా కాల్పులు జ‌ర‌పాల్సి వ‌చ్చింద‌ని పోలీసులు సమాధానం ఇస్తున్నారు. ఏదేమైనా ఈ ఎన్‌కౌంట‌ర్ ఘ‌ట‌న ఇంకా చాలా చ‌ర్చ‌ల‌కు, కొత్త డిమాండ్ల‌కు, చ‌ట్టాల్లో మార్పుల‌కు, రేపిస్టుల‌పై క‌ఠిన వైఖ‌రికి కార‌ణం కానుంది. 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle