newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

ఒక్కరోజే 22 పాజిటివ్‌ కేసులు.. తెలంగాణలో అంతుబట్టని కరోనా వ్యాప్తి

01-05-202001-05-2020 08:57:13 IST
Updated On 01-05-2020 09:16:07 ISTUpdated On 01-05-20202020-05-01T03:27:13.814Z01-05-2020 2020-05-01T03:27:11.873Z - 2020-05-01T03:46:07.937Z - 01-05-2020

ఒక్కరోజే 22 పాజిటివ్‌ కేసులు.. తెలంగాణలో అంతుబట్టని కరోనా వ్యాప్తి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈ గణాంకాలు చాలు.. తెలంగాణలో కరోనా వైరస్ అధికారులను ఎలా ముప్పు తిప్పలు పెడుతోందో తెలియడానికి. 2, 9, 22 గత మూడురోజులుగా తెలంగాణలో పెరుగుతూ వస్తున్న కరోనా రోగుల సంఖ్య ఇది. కొద్ది రోజులుగా తెలంగాణలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరగడం ప్రభుత్వానికి తల నొప్పి తీసుకొస్తోంది. గురువారం ఒక్కరోజే ఏకంగా 22 నమోదు కాగా, ముగ్గురు చనిపోయారు. దీంతో ఇప్పటివరకు కేసుల సంఖ్య 1,038కి చేరుకున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 28కి చేరింది.

హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌ గంజ్‌లో పనిచేస్తున్న పహాడీ షరీఫ్, జల్పల్లికి చెందిన ఇద్దరు వ్యక్తుల వల్ల మార్కెట్‌లో ముగ్గురు షాపుల యజమానులకు, వారి ద్వారా ఆయా కుటుంబసభ్యులకు కరోనా సోకింది. వీరి కుటుంబాలన్నిటినీ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచామని ఈటల తెలిపారు. గంజ్, పహాడీషరీఫ్‌ ప్రాంతాలను కంటైన్మెంట్‌ ప్రాంతాలుగా ప్రకటించి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గురువారం చనిపోయిన ముగ్గురు ఇతర అనారోగ్యాల వల్ల చనిపోయారని చెప్పారు. రామంతాపూర్‌కు చెందిన 48 ఏళ్ల వ్యక్తి గాంధీ ఆస్పత్రిలో చేరిన 12 గంటల్లోనే చనిపోయినట్లు వెల్లడించారు.

షుగర్, బీపీ, స్థూలకాయం, న్యుమోనియాతో బాధపడుతూ చనిపోయారని తెలిపారు. అలాగే వనస్థలిపురానికి చెందిన 76 ఏళ్ల వ్యక్తి గుండె, కిడ్నీ, న్యూమోనియాతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో చేరిన 24 గంటల్లోనే చనిపోయారని పేర్కొన్నారు. ఇక, దుర్గానగర్, జియాగూడకు చెందిన 44 ఏళ్ల మహిళ బుధవారం గాంధీ ఆస్పత్రికి వెంటిలేటర్‌ మీదే వచ్చారని, ఆ తర్వాత 6 గంటల్లోనే మరణించారని ఈటల వెల్లడించారు. ఈమె కూడా బీపీ, షుగర్, న్యుమోనియాతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. 

గురువారం తెలంగాణలో 33 మంది కరోనా పాజిటివ్ రోగులు డిశ్చార్జ్‌ అయ్యారని ఆరోగ్య మంత్రి తెలిపారు. 50 ఏళ్ల వయసున్న డాక్టర్‌ కూడా కోలుకొని డిశ్చార్జ్‌ అయినట్లు పేర్కొన్నారు. గాంధీలో 20 రోజుల కింద తీవ్రమైన వ్యాధి లక్షణాలతో అడ్మిట్‌ అయిన డాక్టర్‌కు హైడ్రోక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్‌ తదితర మందులు అందించి పూర్తిగా నయం చేశామన్నారు. ప్రస్తుతం 568 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. 

గత కొద్దిరోజులుగా కేసులు తగ్గుతున్న క్రమంలో గురువారం పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడంతో వైద్య, ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అప్రమత్తం చేశారు. ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కేసులు పెరగకుండా చూడాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితర శాఖల అధికారులతో మంత్రి ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు. సీఎం సూచనల మేరకు కంటైన్మెంట్‌ ప్రాంతాల్లో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వైద్య, ఆరోగ్య శాఖ, మున్సిపల్‌ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని సీఎంకు నివేదించినట్లు ఈటల తెలిపారు. 

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చికిత్స, పేషంట్లకు అందిస్తున్న సౌకర్యాల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రశంసించడం సంతోషకరమని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఇక్కడ పర్యటిస్తున్న బృందం జరుగుతున్న పరీక్షల తీరు మీద, ల్యాబ్‌లు పనిచేస్తున్న విధానం పట్ల, చికిత్స పట్ల వివరాలు తెలుసుకున్న హోం శాఖ జాయింట్‌ సెక్రటరీ సలీల శ్రీవాస్తవ ప్రశంసలు కురిపించారన్నారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నారని కేంద్ర బృందమే నివేదిక పంపిందని పేర్కొన్నారు. 

కుషాయిగూడ కంటోన్మెంట్‌ గ్రేటర్‌లో కరోనా వైరస్‌ ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా రెండు కుటుంబాల్లోని 12 మందికి కరోనా సోకడంతో ఆయా ప్రాంతాల్లో కలకలం చెలరేగింది. చర్లపలి డివిజన్‌ పరిధిలో ఓ హోల్‌సేల్‌ వ్యాపారి(65)కి మూడు రోజుల కింద పాజిటివ్‌ నిర్ధారణ కాగా, గురువారం ఆయన నుంచి ఆయన సోదరుడు (45), పెద్ద కోడలు (32), చిన్న కుమారుడు (30) ఇద్దరు మనవళ్ల (13, 20)కు పాజిటివ్‌ వచ్చింది. సరూర్‌నగర్‌లోని శారదానగర్‌కు చెందిన వ్యాపారి(50) నుంచి ఆయన తండ్రి, తల్లికి వైరస్‌ సోకింది. వీరితో పాటు వనస్థలిపురంలో ఉండే సోదరుడు (40), సోదరుడి భార్య(35), ఇద్దరు కుమార్తెలకు కూడా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో తండ్రి (76) గురువారం మృతి చెందడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఆ వ్యాపారి సోదరుడు స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. దీంతో ఆయన నుంచి మరెంత మందికి వైరస్‌ విస్తరించి ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

   2 hours ago


రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

   3 hours ago


చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

   15 hours ago


మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   17 hours ago


5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   18 hours ago


పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు

పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు

   21 hours ago


ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలలో వైసీపీ హవా

ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలలో వైసీపీ హవా

   20-09-2021


ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

   20-09-2021


హుజూరాబాద్‌ ఉప ఎన్నికకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

   20-09-2021


అక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా దక్కకపోవడం విశేషం

అక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా దక్కకపోవడం విశేషం

   20-09-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle