facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

ఒక్కరు వెళ్లినా ... భట్టి పదవి గోవిందా?

15-03-201915-03-2019 07:53:07 IST
2019-03-15T02:23:07.154Z15-03-2019 2019-03-15T02:05:53.352Z - - 18-03-2019

ఒక్కరు వెళ్లినా ... భట్టి పదవి గోవిందా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణ కాంగ్రెస్ గులాబీ సునామీకి కకావికలం అవుతోందా? ఏరోజు ఏ ఎమ్మెల్యే పార్టీ వీడిపోతారో అర్థం కావడం లేదంటున్నారు ఆపార్టీ నేతలే. గులాబీ బాస్ ఆపరేషన్ ఆకర్ష్  దెబ్బలకి కాంగ్రెస్ నెంబరు టపాటపా పడిపోతోంది. కాంగ్రెస్ జెండా మీద గెలిచిన టీకాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కరివెంట ఒక్కరు రయ్ మని వెళ్లి కారెక్కేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ వచ్చినప్పటికీ గులాబీ దళం ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తుండటంతో టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు కాంగ్రెస్ నేతలు కూడా ప్రగతిభవన్ వైపు పరుగులు పెడుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చాయో లేదో.. చిరుమర్తి లింగయ్య, ఆత్రం సక్కు, రేగా కాంతారావు, సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియా నాయక్.. తదితర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ గ్రూపులో చేరిపోయారు. లోక్ సభ ఎన్నికల ముందు మరికొంత మంది గులాబీ కండువా కప్పుకోవడం గ్యారంటీ అంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కీలకనేత సబితా ఇంద్రారెడ్డి ఫ్యామిలీ మొత్తం టీఆర్ఎస్‌లో  రంగం రెడీ అయింది. 

ఇదిలా ఉంటే, పాలేరు నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావుపై గెలుపొందిన కందాళ ఉపేందర్‌ రెడ్డి కూడా కేటీఆర్‌ని కలిశారు. ఇది అటుతిరిగి ఇటుతిరిగి.. భట్టి విక్రమార్కుడి పదవికి ఎసరు తెచ్చేలా కనిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా ఏదో ప్రధాన ప్రతిపక్షహోదాతో నెట్టుకొస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ఆ హోదా కూడా దూరమై నామ్ కె వాస్తెగా మిగిలిపోనుంది. శాసనమండలిలో ఎలాగూ ఇదే పరిస్థితి. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మొత్తం 1‌9 స్థానాలొచ్చాయి. తాజా లెక్కల ప్రకారం కాంగ్రెస్ బలం 13కి పడిపోతోంది. ఒకరిద్దరు గోడ దూకితే  ప్రతిపక్ష హోదా కూడా పోవడం ఖాయం. అసెంబ్లీ స్థానాల్లో పదిశాతం అంటే (119+1) కి 12మంది సభ్యుల బలం ఉంటేనే కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ గేమ్‌  ప్లాన్ కాంగ్రెస్‌కి  జీవన్మరణ సమస్యగా మారనుంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle