newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ఒకే బావిలో 9 మృతదేహాలు.. వరంగల్ డెత్ మిస్టరీ వీడేదెలా?

23-05-202023-05-2020 09:26:59 IST
Updated On 23-05-2020 11:06:43 ISTUpdated On 23-05-20202020-05-23T03:56:59.891Z23-05-2020 2020-05-23T03:56:57.876Z - 2020-05-23T05:36:43.738Z - 23-05-2020

ఒకే బావిలో 9 మృతదేహాలు.. వరంగల్ డెత్ మిస్టరీ వీడేదెలా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అదో పాడుబడ్డ బావి.. నీటిపై తేలుతున్న నాలుగు మృతదేహాలు.. పోలీసులకు సమాచారంతో మృతదేేహాలు వెలికితీత.. అంతలోనే మరికొందరు మిస్సింగ్.. అనుమానంతో బావిలో నీటిని తోడడంతో మరో ఐదు మృతదేహాలు బయటపడడం. అందులో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. ఇద్దరు వలస కూలీలు. మరి వీరి మరణం ఎలా జరిగింది?

తొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారా? ఎవరైనా అందులోకి తోసేసి చంపేశారా? లేక చంపేసి అందులో పడేశారా? అసలు వీరిది మర్డరా.. సూసైడా? మర్డర్ అయితే ఎవరు చేశారు? సూసైడ్ అయితే ఎందుకు చేసుకున్నారు? వలస కూలీలను చంపేంత పగ ఎవరికి ఉంటుంది? లాక్ డౌన్ ఉన్నా ఉపాధి దొరుకుతున్న కూలీలకు చనిపోయేంత కష్టం ఏమొచ్చింది? ఇలా ఎన్నో ప్రశ్నలు ఈ డెత్ మిస్టరీని వెంటాడుతున్నాయి.

వ‌రంగ‌ల్ జిల్లా గీసుకొండ బావిలో బయటపడ్డ తొమ్మిది మృత‌దేహాల మిస్టరీపై ఇలా ఎన్నో ప్రశ్నలు వెంటాడుతున్నాయి. బావి ప‌క్క‌నే ఉన్న ఇంట్లో నివాసముండే మక్సూద్ కుటుంబంతో పాటు బెంగాల్, త్రిపుర‌ల‌కు చెందిన వారి మృత‌దేహాలుగా పోలీసులు గుర్తించారు. కానీ మరణం వెనుక కారణాలను మాత్రం ఆ పోలీసులు ఇంకా తేల్చలేకపోతున్నారు. ముందుగా ఆత్మహత్యలేనని భావించినా క్రమేపి అది మిస్టరీగా మారింది.

పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలస వచ్చి కుటుంబంతో సహా కరీమాబాద్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉంటూ ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ నుండి గోదాం పక్కనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌తో పాటు, భార్య, ఇద్దరు కుమారులు, భర్తతో విడిపోయిన కుమార్తె, తన మూడేళ్ల కుమారుడు ఉంటున్నారు. ఇక గొదాం పక్కనే ఉన్నపై భవనంలో బిహార్‌కు చెందిన శ్రీరాం, శ్యాంలు నివాసముంటూ అదే గోదాంలో పనిచేస్తున్నారు.

అయితే గోదాం పరిశ్రమ యజమాని ఉదయం వచ్చి చూసేసరికి ఎవరూ కనిపించక వెతుకులాట ప్రారంభించాడు. అయితే బావిలో మృతదేహాలతో పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు వెలికితీయగా ముందుగా మక్సూద్ తో పాటు భార్య, కుమార్తె, ఆమె కుమారుడు మృతదేహాలు బయటపడ్డాయి. అనంతరం మిగతా వారి ఆచూకీ కోసం అనుమానంతో బావిలో నీటిని తొడగా మరో ఐదు మృతదేహాలు బయటపడ్డాయి.

వారిలో మక్సూద్ ఇద్దరు కుమారులతో పాటు ఇద్దరు బీహార్ కుర్రాళ్ళు, అదే పరిశ్రమ వద్దకు వాహనాలు నడిపే డ్రైవర్ కూడా శవమై తేలాడు. దీంతో ఇది మిస్టరీగా తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు. సెల్ ఫోన్ ట్రాకింగ్ నుండి.. కుటుంబంలో సంబంధాలు ఉన్నవారి వరకు అన్ని కోణాల్లో దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఇందులో వివాహేతర సంబంధం ఉన్నట్లుగా పోలీసులు ప్రాధమికంగా అనుమానిస్తున్నారు.

మక్సూద్ కూతురు బుస్రాకు ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కారణంగా కొద్దిికాలంగా మక్సూద్ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని.. ఈమధ్యనే ఈ గొడవలో బీహార్ కూలీలు తలదూర్చడం.. బుస్రా ప్రియుడు పుట్టినరోజు పార్టీ ఇచ్చాడనే అనుమానాలు.. కుటుంబంతో గొడవపడి.. బీహార్ కూలీలే కుంటుంబాన్ని చంపేసి తర్వాత వారు కూడా ఆత్మహత్య చేసుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కాగా బుస్రా ప్రియుడే విషప్రయోగం చేసి అందరినీ చంపేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతుండగా ముందుగా మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తే కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాగా ఒకేసారి తొమ్మిది మంది మృతదేహాలతో వరంగల్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ సహాయంతో పోలీసులు మృతదేహాలను వెలికితీయగా నగరపాలక సంస్థ, నగర మేయర్, కమిషనర్, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, వివిధ పార్టీల రాజకీయ నేతలు ఇలా అంతా ఘటనాస్థలానికి దిగిపోయారు. అయితే పోస్ట్ మార్టం నివేదిక, పోలీస్ విచారణ అనంతరం కానీ ఈ మిస్టరీ వీడే అవకాశంలేదు.

 

 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   6 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   8 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   11 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   12 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   13 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   14 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   14 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   14 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   15 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle