newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒకేరోజే 14 మంది మృతి.. కొత్త కేసులు 154.. తెలంగాణలో కరోనా బీభత్సం

08-06-202008-06-2020 10:21:47 IST
Updated On 08-06-2020 10:50:31 ISTUpdated On 08-06-20202020-06-08T04:51:47.657Z08-06-2020 2020-06-08T04:51:45.851Z - 2020-06-08T05:20:31.303Z - 08-06-2020

ఒకేరోజే 14 మంది మృతి.. కొత్త కేసులు 154.. తెలంగాణలో కరోనా బీభత్సం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆదివారం ఒక్కరోజే 14 మంది మరణాలు, 154 కొత్త కేసుల నమోదుతో తెలంగాణను కరోనా వణుకు పుట్టిస్తోంది. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులే భయపెడితే.. ఇప్పుడు పెరుగుతున్న మరణాల సంఖ్య కూడా బెంబేలెత్తిస్తోంది. వారం క్రితం వరకూ కూడా తక్కువగా ఉన్న ఈ సంఖ్య.. ఒక్కసారిగా పెరగడంపై తెలంగాణ వ్యాప్తంగా భయాందోళన వ్యక్తమవుతోంది. తాజాగా నమోదైన కేసులు.. పోయిన ప్రాణాల సంఖ్య తెలుసుకుంటే వణుకు పుడుతోంది. 

తెలంగాణలో ఆదివారం ఒక్క రోజే 154 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 14 మంది మృతి చెందారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 132, రంగారెడ్డి 12, మేడ్చల్‌ 3, యాదాద్రి 2, సిద్దిపేట, మహబూబాబాద్‌, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్‌, కరీంనగర్‌లో ఒక్కో కేసు నమోదు అయింది. ఇప్పటివరకూ 3,650 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కాగా మొత్తం 137 మంది మృతి చెందారు. ఇంకా 1,771 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 1,742 మంది డిశ్చార్జ్‌ అయ్యారని తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. 

పరీక్షలు చేయడంతోపాటు కాంటాక్ట్‌ ట్రేసింగ్‌లోనూ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ వెనకబడే ఉందని ఐసీఎంఆర్‌కు చెందిన జర్నల్‌ (ఐజేఎంఆర్‌) గణాంకాలతో సహా ఒక పత్రాన్ని ప్రచురించింది!! రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి చూస్తే.. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. చాలామంది.. ఆస్పత్రిలో చేరిన రెండు, మూడు రోజుల నుంచి వారంలోపే మరణిస్తున్నారు! సకాలంలో పరీక్షలు చేయకపోవడం వల్లనే ఇంత త్వరగా మరణాలు సంభవిస్తున్నాయనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది!

అధికారిక గణాంకాలను బట్టి చూస్తే.. రాష్ట్రంలో తొలి కొవిడ్‌-19 కేసు మార్చి 2న నమోదైంది. మార్చి 24 నాటికి 764 మందికి పరీక్షలు చేశారు. ఆ తర్వాత మళ్లీ ఏప్రిల్‌ 28న.. మంత్రి ఈటల రాజేందర్‌ కరోనా పరీక్షల లెక్కపై మీడియాతో మాట్లాడారు. ఆ రోజువరకూ రాష్ట్రంలో మొత్తం 19,063 టెస్టులు జరిపినట్టు వెల్లడించారు. అంటే మార్చి 2 నుంచి ఏప్రిల్‌ 28 వరకూ సగటున రోజుకు 334 పరీక్షలు చేసినట్టు. ఆ తర్వాత మళ్లీ మే 17న.. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా పరీక్షలపై ఒక ప్రకటన చేసింది. మే 16 నాటికి రాష్ట్రంలో 23,388 పరీక్షలు చేసినట్టు పేర్కొంది. అంటే.. 18 రోజులకు 4,325 పరీక్షలు. సగటున రోజుకు 240 పరీక్షలు. 

ఇక, వైద్య ఆరోగ్య శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జూన్‌ 6 నాటికి రాష్ట్రంలో 35,154 పరీక్షలు జరిపినట్టు తెలుస్తోంది. అంటే, ఈ 20 రోజుల్లో సగటున రోజుకు 588 పరీక్షలు జరిపినట్టు లెక్క. మొదటి కేసు బయటపడిన మార్చి 2 నుంచి జూన్‌ 6 దాకా లెక్కిస్తే (96 రోజుల్లో) సగటున రోజుకు 366 పరీక్షలు జరిపినట్టు!! అంటే ఏ కోణంలో చూసినా రాష్ట్రంలో జరుపుతున్న కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య చాలా తక్కువే.

మే 26 నుంచి జూన్‌ 1 వరకూ అన్ని రాష్ట్రాలూ నిర్వహించిన పరీక్షలు, పాజిటివ్‌ కేసుల సంఖ్యను విశ్లేషించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 20.2 శాతం పాజిటివిటీ ఉన్నట్లు తేల్చిందని పేర్కొంటూ ఎకనమిక్‌ టైమ్స్‌ ఒక వార్తాకథనాన్ని ప్రచురించింది. 25.7 శాతం పాజిటివ్‌ రేటుతో ఢిల్లీ అగ్రస్థానంలో ఉండగా.. తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఆ కథనంలో పేర్కొంది. 

ఆ వారం రోజుల్లో ఢిల్లీలో 37 వేల పరీక్షలు నిర్వహించగా (9600 మందికి పాజిటివ్‌ వచ్చింది).. తెలంగాణలో కేవలం 4300 పరీక్షలు చేసినట్టు అందులో వివరించింది. అలాగే.. హైదరాబాద్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని కేంద్రం భావిస్తున్నట్టు కూడా పేర్కొంది. కేంద్రం వద్ద ఉన్న సమాచారం ప్రకారం మే 22 నాటికి 8.3 శాతం పాజిటివిటీతో దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన టాప్‌-25 జిల్లాల్లో హైదరాబాద్‌ కూడా ఉందని వివరించింది. 

నాటి నుంచి ఇప్పటికి కూడా పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని అధికారులు అభిప్రాయపడినట్లు తెలిపింది. ఇలాగే తక్కువ పరీక్షలు చేస్తే వైరస్‌ మరింత విజృంభిస్తుందని.. ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారికి సోకితే మరణాల రేటు కూడా భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఎపిడమాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా తొలినాళ్లలో ఇదే సమస్య ఏర్పడిందని.. అక్కడ కూడా టెస్టులు సరిగ్గా చేయకపోవడంతో కేసులు బాగా పెరిగాయని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెంచాలని సూచిస్తున్నారు. 

అయితే.. దీనిపై రాష్ట్ర అధికారుల వాదన వేరేగా ఉంది. తాము అనవసర పరీక్షలను చేయట్లేదని.. నిజంగా వైరస్‌ సోకిన లక్షణాలున్నవారికి, వైరస్‌ సోకే ప్రమాదం ఉన్నవారికి మాత్రమే పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు చేస్తున్నామని.. అందుకే టెస్టుల సంఖ్య తక్కువగా ఉన్నా పాజిటివ్‌లు ఎక్కువగా ఉంటున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు.

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   12 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   19 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   20 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle