ఒకవైపు వారోత్సవాలు..మరో వైపు పోలీసుల కూంబింగ్‌లు
28-07-202028-07-2020 12:32:56 IST
Updated On 28-07-2020 12:46:18 ISTUpdated On 28-07-20202020-07-28T07:02:56.857Z28-07-2020 2020-07-28T07:02:30.151Z - 2020-07-28T07:16:18.888Z - 28-07-2020

మావోయిస్టులు మళ్ళీ తమ సత్తా చాటేందుకు, తమ అస్థిత్వం నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. అదును చూసి భద్రతాబలగాలపై దాడులకు దిగుతున్న మావోయిస్టుులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. ఛత్తీస్ ఘడ్ ఆర్మ్ డ్ ఫోర్స్ శిబిరంపై దాడి చేసి కాల్పులు జరిపారు. నారాయణ పూర్ లోని దూల్ వద్ద ఉన్న సీఏఎఫ్ మావోయిస్టులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒఖ క జవాన్ మృతి చెందాడు. భద్రతా సిబ్బంది తేరుకునేలోగా..మావోయిస్టులు పరారయ్యారు. కేవలం మెరుపుదాడి చేసి ఉనికి చాటుకునే ప్రయత్నంగా తెలుస్తోంది. దీని వెనుక ఇద్దరు ముగ్గురు వుంటారని భావిస్తున్నారు. ఆగస్టు 3 వ తేదీ వరకు మావోయిస్టుల అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు జరుగుతున్నాయి. ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జగన్ పిలుపునిచ్చారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ముందస్తుగా అప్రమత్తమైన పోలీసులు... తనిఖీలు ముమ్మరం చేసారు. తెలంగాణా- చత్తీస్ఘడ్, తెలంగాణా- మహారాష్ట్ర సరిహద్దు అటవీ ప్రాంతల్లో కూంబింగ్ ముమ్మరం చేసాయి పోలీసు బలగాలు. అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా వాహన తనిఖీలు చేస్తున్నారు. మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్న వేళ ఆంధ్ర-ఒరిస్సా బోర్డర్లో ఎదురుకాల్పులు సంఘటనలు ఎక్కువవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు దాడికి తెగబడటం కలవరం కలిగిస్తోంది. దీంతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణా పల్లెల్లో అలజడి మొదలయింది. ఊహించని విధంగా మావోయిస్టులకు సంబంధించి నిఘా వర్గాల సమాచారం అందిన నేపధ్యంలో... పోలీసు బలగాలు తెలంగాణా ఉమ్మడి జిల్లాలు వరంగల్, ఖమ్మం, అదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సరిహద్దుల్లో భారీగా మొహరించాయి. సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు. తెలంగాణా ఏజెన్సీలో యుద్ద మేఘాలు కమ్ముకుంటున్నాయి. తెలంగాణలో పోలీసులు అప్రమత్తం అవుతున్నారు. ఏజన్సీ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లు కు అదనపు భద్రత కల్పించారు. మావోయిస్టుల షెల్టర్ జోన్స్ పై నిఘా వర్గాలు... పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో మావోయిస్టు హిట్ లిస్ట్ లో ఉన్న నేతలను మైదాన ప్రాంతాలకు తరలివెళ్లాలని పోలీసులు ఆదేశాలిచ్చారు. ఏజెన్సీలకు వెళ్లేముందు తమకు సమాచారం ఇవ్వాలని మంత్రులు,ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు సూచించారు. తెలంగాణ ఏజన్సీ ప్రాంతాలన్నింటిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక పక్క పోలీసులు, మరో పక్క మావోల అలజడితో గిరిజన, ఆదివాసీ గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
6 hours ago

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!
9 hours ago

నిరాహార దీక్షలపై షర్మిలక్కయ్య నిర్ణయం
13 hours ago

మన గుంటూరులోనే.. జాగ్రత్త పడదామా వద్దా.. అంతా మనిష్టం
13 hours ago

ఏందయ్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే
13 hours ago

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మరి రాష్ట్రాల మాటేంటి
11 hours ago

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..
21-04-2021

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!
a day ago

కాంగ్రెస్ కి ఇంకా ఆశలు ఉన్నట్లున్నయ్
21-04-2021

తిరుపతి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ తప్పదా
21-04-2021
ఇంకా