newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఒకవైపు కోవిడ్.. మరోవైపు ఎంసెట్.. విద్యార్ధులకు ‘పరీక్షే’

07-09-202007-09-2020 07:34:03 IST
Updated On 07-09-2020 07:46:47 ISTUpdated On 07-09-20202020-09-07T02:04:03.193Z07-09-2020 2020-09-07T02:03:50.922Z - 2020-09-07T02:16:47.354Z - 07-09-2020

ఒకవైపు కోవిడ్.. మరోవైపు ఎంసెట్.. విద్యార్ధులకు ‘పరీక్షే’
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశవ్యాప్తంగా కరోనా కేసులు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. దేశంలో 41 లక్షలు కేసులు దాటిపోయాయి. కరోనా వైరస్ ఎప్పుడు అదుపులోకి వస్తుందో ఎవరికీ తెలీదు. తాజాగా వివిధ కామన్ ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. ఎంసెట్ పరీక్షలకు రంగం సిద్ధం అయింది.

కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఎంసెట్ పరీక్షలు ఎట్టకేలకు ఈ నెల అంటే సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మరో మూడు రోజుల్లోనే పరీక్షలు ప్రారంభం అవుతుండడంతో విద్యార్ధులు ఇప్పటికే ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ రాయడానికి సన్నద్దం అవుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో 102 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు.పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమకు దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలు లేవని ప్రతి విద్యార్ధి సెల్ఫ్‌ డిక్లరేషన్‌ తప్పనిసరి. గంటన్నర ముందే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారుజ. నిబంధనలు పాటించకపోతే ఫలితాలు విత్‌హెల్డ్‌ చేసే యోచనలో వుంది ప్రభుత్వం. అయితే పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్ధులు తప్పనిసరిగా మాస్క్‌లు తెచ్చుకోవాలని ఎంసెట్ కమిటీ సూచించింది.

సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ పరీక్ష ప్రారంభం కాబోతుంది. కరోనా నేపథ్యంలో తగిన నిర్వహణా ఏర్పాట్లకు ఎంసెట్‌ కమిటీ సమాయత్తమవుతోంది. సెప్టెంబర్‌ 9, 10, 11, 14 తేదీల్లో ఈ పరీక్షల నిర్వహణకు 102 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. అందులో తెలంగాణలో 89, ఆంధ్రప్రదేశ్‌లో 23 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా లక్షణాలు లేని విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేలా చర్యలు చేపట్టింది.

థర్మల్‌ స్క్రీనింగ్‌ ద్వారా వారిని గుర్తించాలని నిర్ణయించింది. కరోనా సంబంధ లక్షణాలున్న వారిని వెనక్కి పంపించి వేయాలని భావిస్తోంది. వీలైతే ఆ సెషన్‌లో ప్రత్యేక గదుల్లో పరీక్షలు రాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తోంది.అదే విధంగా వాటర్‌ బాటిల్‌, 50ఎంఎల్‌ శానిటైజర్‌ బాటిల్ ను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొంది. వేలి ముద్రలు తీసుకోవడం వల్ల కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నందున ఫేస్‌ రికగ్నేషన్‌‌ సిస్టం విధానాన్ని ఫాలో కానుంది.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   21 minutes ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   an hour ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   2 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   3 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   4 hours ago


కేటీఆర్ కి అంత సీన్ లేదులే

కేటీఆర్ కి అంత సీన్ లేదులే

   6 hours ago


పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!

   6 hours ago


కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ

   21 hours ago


వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!

   21 hours ago


ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle