newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

ఒకవైపు కరోనా.. మరోవైపు జనం ... ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.

08-05-202008-05-2020 17:52:52 IST
Updated On 08-05-2020 19:01:34 ISTUpdated On 08-05-20202020-05-08T12:22:52.067Z08-05-2020 2020-05-08T12:22:45.492Z - 2020-05-08T13:31:34.426Z - 08-05-2020

ఒకవైపు కరోనా.. మరోవైపు జనం ... ఈ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం.
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది కరోనా వైరస్. ముఖ్యంగా కోటిమంది జనాభా కలిగిన హైదరాబాద్ పై పంజా విసిరింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో సగం జంటనగరాల్లోనే వున్నాయి.  ఈనేపథ్యంలో నిన్నామొన్నటివరకూ లాక్ డౌన్ పకడ్బందీగా అమలుచేశారు. వాహనాలు సీజ్, లాక్ డౌన్ ఉల్లంఘనల కేసులు బుక్ చేశారు. కానీ ఇప్పుడేమైంది.

లాక్‌డౌన్‌ ఎత్తేశారా? రెండు తెలుగు రాష్ట్రాలలో ఇవాళ రోడ్ల మీద ట్రాఫిక్ చూస్తే వచ్చే డౌట్ ఇది.. అటు ఏపీ, ఇటు తెలంగాణ రాష్ట్రాలలోని దాదాపు అన్ని ముఖ్య పట్టణాలు, నగరాలలో ఈ ఉదయం నుంచి రహదారులపై రాకపోకలు విపరీతంగా పెరిగిపోయాయి. లా డౌన్ కొనసాగుతున్నా జనం మాత్రం రోడ్ల మీదకు ప్రవాహంలా వచ్చేశారు. 

వీకెండ్ కు ఒకరోజు ముందు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు లాక్ డౌన్ కు ఎండ్ కార్డు ప్రకటించేశారు. ఉదయం 8 గంటల నుంచే జన ప్రవాహం మొదలయ్యింది. రోడ్ల మీద ఒక్కసారిగా వాహనాలు వెల్లువెత్తడంతో ట్రాఫిక్ ముందుకు కదలడం గగనమైపోయింది. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే లాక్ డౌన్ కు ముందు రోజులు గుర్తుకువచ్చాయి.

మద్యం అమ్మకాలు షురూ కావడంతో సడలిన పట్టు రెండు రోజుల తరువాత మరింత ప్రభావం చూపింది. హైదరాబాదులో అన్ని ప్రధాన రహదారులు వాహనాల రాకపోకలతో కిక్కిరిసాయి. చాలాచోట్ల ట్రాఫిక్ కొద్దిసేపు నిలిచిపోయింది. మధ్యాహ్నం వేళలో కూడా ట్రాఫిక్ నెమ్మదిగా ముందుకు సాగింది.

ఒకే ఒక్క నిర్ణయం లాక్ డౌన్ వాతావరణాన్నే మార్చేసిందని అంటున్నారు. లిక్కర్ అమ్మకాలు ఆరంభించాలన్న రెండు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో పరిస్థితి అదుపు తప్పినట్టు కనిపిస్తోంది. వైన్ షాపుల ముందు క్యూలను కంట్రోల్ చేయాల్సిన కొత్త బాధ్యతలతో పోలీసులు లాక్ డౌన్ చెక్ పోస్టుల దగ్గర ఇప్పటి వరకు నిర్వర్తించిన విధుల నుంచి తప్పుకున్నారు. దాంతో గేట్లు ఒక్కసారిగా తెరిచి ట్రాపిక్ మొత్తం ముందుకు ఉరికినట్టుగా అయ్యింది పరిస్థితి.  

ఇటు లిక్కర్ సేల్స్, అటు ఇతర సడలింపులతో మొత్తం మీద లాక్‌డౌన్‌ లక్ష్యాలకు తూట్లు పడుతున్నాయి. ఎవరూ కూడా కరోనాను లెక్క చేయడం లేదు. కరోనా భయం ఎవరిలోనూ కనిపించడం లేదు. కేవలం నోటికి అడ్డంగా కర్చీఫ్ లేదా మాస్కు కట్టుకుంటే సరిపోతుందనే భావన అందరిలో కనిపిస్తోంది. లాక్ డౌన్ ఆంక్షలను గాలికి వదిలేసి జనం రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు.

మద్యం దుకాణాలు తెరవడంతో పోటెత్తిన జనంలో భౌతికదూరం బలాదూరైంది. ఉదయం 11 నుంచీ రాత్రి 7 దాకా మద్యం అమ్మకాలకు ప్రభుత్వమే అనుమతి ఇవ్వడంతో జనం రోడ్ల మీదకు రాకుండా ఆపడం అసాధ్యమని తేలిపోయింది. పైగా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల విభజన పేరుతో ప్రకటించిన సడలింపులు నిబంధనలను పూర్తిగా నీరుగార్చేశాయి. పట్టణ ప్రాంతాలు జనసమ్మర్ధంగా మారిపోయాయి. బైకులు, కార్లు తెగ తిరిగేస్తున్నాయి. సడలింపు వేళకే పరిమితమైన వాతావరణం రోజంతా ఒకేలా ఉంటోంది.

రెడ్‌జోన్లలో కట్టడి ఉన్నా, ఆ ప్రాంతాల నుంచీ ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగుతూనే ఉన్నాయి. పోలీసులు కూడా మునుపటిలా కఠినంగా ఉండడం లేదు. అధికారులు కూడా చూసీచూడనట్టు ఉండడానికే అలవాటుపడినట్టుగా కనిపిస్తోంది. ఇటు రాజకీయ నేతలు కూడా వితరణల పేరు చెప్పి లాక్ డౌన్ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. 

మొత్తం మీద ఈ మూడు రోజులుగా రోడ్ల మీద మొదలైన సందడిని చూస్తే నెమ్మదించిన కరోనా వైరస్‌ వ్యాప్తి మళ్ళీ విజృంభిస్తుందేమో అనే ఆందోళన కలుగుతోంది. లాక్‌డౌన్‌ పట్టు సడలితే కరోనా పట్టు బిగుస్తుందనే వాస్తవాన్ని గ్రహించకపోతే మాత్రం చివరికి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది.


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle