ఒకవైపు కరోనా ఉధృతి.. జెఎన్టీయూ కీలక నిర్ణయం
13-08-202013-08-2020 17:37:48 IST
Updated On 13-08-2020 17:53:10 ISTUpdated On 13-08-20202020-08-13T12:07:48.315Z13-08-2020 2020-08-13T12:07:45.112Z - 2020-08-13T12:23:10.747Z - 13-08-2020

తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే వుంది. కరోనాతో విద్యార్ధులు ఇబ్బందులు పడకుండా వివిధ పరీక్షలను ప్రభుత్వం రద్దుచేసింది. అయితే, యూజీసీ నిబంధనల ప్రకారం అన్ని కోర్సులకు చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో జేఎన్టీయూహెచ్ కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్శిటీ పరిధిలో బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల ఫైనల్ ఇయర్ చివరి సెమిస్టర్ పరీక్షలను సెప్టెంబర్ 16 నుంచి వారం రోజుల పాటు నిర్వహించేందుకు ఇప్పటికే అధికారులు షెడ్యూల్ను సిద్దం చేశారు. గతంలో కాకుండా విద్యార్ధులు తమకు దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్లలోనే పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించనున్నారు. కరోనా కారణంగా విద్యార్ధులు ఇళ్ళలోనే వుంటున్నారు. దీంతో వారు తమకు దగ్గర్లోని సెంటర్ ని ఎంపిక చేసుకోవాల్సి వుంటుంది. అలాగే సుమారు 60 వేల మంది విద్యార్ధులు వివిధ అటానమస్ కాలేజీల ద్వారా బీటెక్ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాయనున్నారు మరోవైపు 17వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించేందుకు ఏఐసీటీఈ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చింది. జేఎన్టీయూ హైదరాబాద్ ఆగష్టు 24 నుంచి ఆన్లైన్ క్లాసులు నిర్వహించనుంది. రోజుకు నాలుగు పీరియడ్స్ బోధించేందుకు అనుమతి ఇచ్చింది. ప్రతీ పిరియడ్ గంట చొప్పున.. మార్నింగ్ మూడు.. లంచ్ తర్వాత ఒక పిరియడ్ జరగనున్నాయి. నెలరోజుల పాటు ఈ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాక పరిస్థితిని సమీక్షిస్తారు.

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత
12 hours ago

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్
13 hours ago

షర్మిల దీక్ష..రచ్చ ఫిక్స్..పర్మిషన్ ప్రాబ్లమ్
13 hours ago

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
17 hours ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
18 hours ago

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జగన్
16 hours ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
19 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
19 hours ago

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!
14 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
21 hours ago
ఇంకా