ఐపీఎస్‌ల బదిలీలలు.. లాబీయింగ్‌లతో పోస్టింగులు
07-02-202007-02-2020 09:29:26 IST
Updated On 07-02-2020 09:29:23 ISTUpdated On 07-02-20202020-02-07T03:59:26.527Z07-02-2020 2020-02-07T03:59:04.005Z - 2020-02-07T03:59:23.503Z - 07-02-2020

తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలపై అధికార పార్టీ మంత్రుల లాబీయిoగ్ బాగా పనిచేసిందని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఐపీఎస్ బదిలీలపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ పలువురికి స్థానచలనం కలిగించారు. ఇప్పటికే ఐఏఎస్ బదిలీలు సాఫీగా జరిగినప్పటికీ, ఐపీఎస్ బదిలీల్లో మాత్రం అధికారుల మల్లగుల్లాలు పడ్డారు. బదిలీల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు పలువురు ఐపీఎస్ అందుబాటులో వున్న నేతలతో లాబీయింగ్ చేయించారు. రెండు మూడు రోజుల నుండి ఐపీఎస్ బదిలీల పేరుతో వాట్సాప్ గ్రూప్ ల్లో తిరుగుతోంది పోస్టింగ్ లిస్ట్. ఐపీఎస్ ల బదిలీల పై జోక్యం చేసుకున్నారు అధికార పార్టీ మంత్రులు. మేడారం జాతర తర్వాత బదిలీలు వుంటాయని భావించినా పలువురు ఐపీఎస్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఎస్పీలకు డీఐజీలుగా, డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. 2002 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాజేష్ కుమార్, ఎన్.శివశంకర రెడ్డి, డాక్టర్.వి.రవీంద్రకు ఐజీలుగా, 2006 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన కార్తికేయ,కె.రమేష్ నాయుడు, వి.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు,ఏ.వెంకటేశ్వరరావుకు డీఐజీలుగా ప్రమోట్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఐజీలుగా రాజేష్ కుమార్, ఎన్.శివశంకర రెడ్డి, డాక్టర్.వి.రవీంద్ర, డీఐజీలుగా కార్తికేయ, కె.రమేష్ నాయుడు, వి.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఎ.వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి 50మంది ఐఏఎస్ లను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. అప్పుడే ఐపీఎస్ ల బదిలీ వుండవచ్చని సంకేతాలు వచ్చినా ఆలస్యం జరిగింది. పలువురు ఐపీఎస్‌ల బదిలీలు, పదోన్నతులు 2018లోనే జరగాలి. అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల కారణంగా అవి వాయిదాపడ్డాయి. 2019 ఏప్రిల్‌లో రాష్ట్ర హోంశాఖ కేంద్రం అనుమతితో 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పించింది. వాస్తవానికి పదోన్నతితోపాటు బదిలీ తప్పనిసరి. కానీ, వీరికి పదోన్నతి దక్కినా.. పాత కుర్చీల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. దాదాపు 10 నెలలుగా తమకు కొత్త పోస్టింగ్‌లు వస్తాయని ఎదురు చూశారు. వివిధ జిల్లాల్లో వివిధ పనిచేస్తున్న దాదాపు 12 మంది ఐపీఎస్ అధికారులను నగరానికి తీసుకురానున్నారు.

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
a day ago
ఇంకా