newssting
BITING NEWS :
*రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తోందన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు-కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ *ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ. 5 గంటల పాటు కొనసాగిన కేబినెట్ మీటింగ్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ *కొత్తకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ఢీ కొట్టి తుఫాన్ వాహనం బోల్తా. ఇద్దరు మృతి. 14 మందికి తీవ్రగాయాలు, హాస్పిటల్ కు తరలింపు * ఇవాళ కెసిఆర్ బర్త్ డే. కెసిఆర్ పుట్టినరోజును మొక్కల పండుగగా జరపాలని తెరాస పిలుపు. రేపు ఉదయం నుంచి మొక్కలు నాటడం... రక్తదాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపు *జనసేన కార్యకర్తలతో పవన్ సమావేశం. పనిచేసే కార్యకర్తలకే జనసేన పార్టీలో ప్రాధాన్యత. కార్యకర్తల సలహాలు, సూచనలు తీసుకున్నా-పవన్ *రాజధాని మార్పు, పీఏఏల రద్దు తొందరపాటు నిర్ణయాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ వల్ల కోర్టులకు వెళ్లే పరిస్థితి, శాసనమండలి రద్దు నిర్ణయం సరైంది కాదు-దగ్గుబాటి పురంధేశ్వరి*ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం... మూడోసారి సీఎంగా ప్రమాణం

ఐదు నెల‌లుగా ప‌ద‌వుల కోసం వెయిటింగ్..!

30-10-201930-10-2019 10:22:51 IST
2019-10-30T04:52:51.021Z30-10-2019 2019-10-30T04:52:49.136Z - - 17-02-2020

ఐదు నెల‌లుగా ప‌ద‌వుల కోసం వెయిటింగ్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పార్టీ మారిన వెంట‌నే ప‌ద‌వి ఖాయం అన్న ఆఫ‌ర్‌తో నాడు పార్టీ మారారు. కానీ ఐదు నెల‌లు గ‌డుస్తున్నా ఇంత వ‌ర‌కు ఏ ఒక్క‌రికీ ఎటువంటి ప‌ద‌వినీ కేటాయించ‌లేదు. కనీసం పిలుపు కూడా లేదు. దీంతో ఏదో ఒక ప‌ద‌వి ఇస్తే నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల మ‌ధ్య తిరుగుతామి అధిషానం వ‌ద్ద రిక్వ‌స్ట్‌లు పెట్టుకుంటున్నారు. ఇదీ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ టీఆర్ఎస్‌లో చేరిన గులాబీ నేత‌ల ప‌రిస్థితి.

ఇంత‌కీ ఆ నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారు..? ఆ నేత‌లు ఎక్క‌డ ఉన్నారు..?  అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సునీతా ల‌క్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్ర‌తాప్‌రెడ్డి, భిక్ష‌మ‌య్య‌గౌడ్, ఆరేప‌ల్లి మోహ‌న్‌లు టీఆర్ఎస్‌లో చేరారు. పార్టీ మారితే ప‌ద‌వులు వస్తాయి. అధికార పార్టీలో ఏదో ఒక నామినేటెడ్ ప‌ద‌వితో రాజ‌కీయ మ‌నుగ‌డ సాధించ‌వ‌చ్చని ఈ నేత‌లంతా ఆశ‌ప‌డ్డారు. కానీ ఇప్పుడు ప‌ద‌వుల కోసం ఈ నేత‌లంతా ప‌డిగాపులు కాస్తున్నారు. గులాబీబాస్ ఆశీర్వాదం ఎప్పుడు ద‌క్కుతుందా..? అని ఈ సీనియ‌ర్ నేతలు ఎదురుచూస్తున్నారు.

గ‌తంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు వివిధ ప‌ద‌వుల‌ను అనుభవించిన నేత‌లు టీఆర్ఎస్ స‌ర్కార్‌లో త‌మ‌కు క‌నీసం నామినేటెడ్ పోస్టులు వ‌స్తాయ‌ని గంపెడు ఆశ‌లు పెట్టుకున్నారు. ఇటీవ‌లే గ‌జ్వేల్ నేత వంటేరు ప్ర‌తాప్‌రెడ్డికి నామినేటెడ్ పోస్టు వ‌చ్చింది. దీంతో త‌మ‌కు కూడా ఏదో ఒక ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఈ నేత‌లు ఎదురుచూపు చూస్తున్నారు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌లు ముగిసి ఐదు నెల‌లైంది. కాంగ్రెస్ కండువా మార్చిన నేత‌ల‌కు మాత్రం ప‌ద‌వులు ద‌క్క‌లేదు. దీంతో గులాబీ పెద్ద‌ల చూట్టూ ప‌ద‌వుల కోసం చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఈ న‌లుగురి నేత‌ల ప‌రిస్థితి ఇలా ఉంటే.. గులాబీ క‌డువా క‌ప్పుకున్న మాజీ స్పీక‌ర్ సురేష్‌రెడ్డి, మాజీ మంత్రి మండ‌వ వెంక‌టేశ్వ‌ర‌రావుల భ‌విష్య‌త్‌పై కూడా క్లారిటీ లేకుండా పోయింది.

త‌మ‌కు సీటు లేకున్నా క‌నీసం నామినేటెడ్ ప‌ద‌వి ఇస్తే ప్ర‌జ‌ల్లో ఉండ‌వ‌చ్చ‌ని లేదంటే త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతామ‌ని నేతలు టెన్ష‌న్ ప‌డుతున్నారు. బ‌య‌టి పార్టీ నుంచి వ‌చ్చిన నేత‌ల ప‌రిస్థితి ఇలా ఉంటే సొంత పార్టీ నేత‌ల ప‌రిస్థితి విచిత్రంగా ఉంది. ప‌ద‌వుల కోసం కొంత‌మంది ఆరాట‌ప‌డుతుంటే.. ఉన్న ప‌ద‌వులు రెన్యువ‌ల్ లేక మ‌రికొంత మంది ఆలోచ‌న‌లో ఉన్నారు. 

 

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

చంద్రబాబుని కలిసిన మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ

   an hour ago


మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

మాయగాళ్ళకు కేంద్రంగా ఏపీ..!

   an hour ago


మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతారా.. సిద్ధమే: ఒవైసీ

   3 hours ago


కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

కేజ్రీవాల్ మాటలో మార్పు.. పోరాటం వదిలి సర్దుకుపోయే ధోరణి!

   3 hours ago


అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

అయ్య బాబోయ్.. గాంధీతో కేసీఆర్‌కు పోలికా?

   5 hours ago


రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

రాజధాని మాటేమో కానీ విశాఖలో రియల్ బూమ్‌..

   5 hours ago


కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

కేంద్రంతో సయోధ్యకు కేజ్రీవాల్ ప్రయత్నాలు

   7 hours ago


కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

కాశ్మీర్‌పై జోక్యం వద్దు.. ఐక్యరాజ్యసమితికి భారత్ ఘాటు జవాబు

   8 hours ago


అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

అక్షరాస్యత, పరిశుభ్రతలో ఆంధ్రా అమ్మాయిలదే అగ్రపీఠం

   8 hours ago


‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

‘‘తెలంగాణపై వివక్ష ప్రశ్నేలేదు.. మాకన్ని రాష్ట్రాలు సమానమే’’

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle