newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐదురోజుల్లో పదవీ విరమణ... ఆ ఫ్యామిలీలో అనుకోని విషాదం

27-08-202027-08-2020 08:22:12 IST
Updated On 27-08-2020 15:43:30 ISTUpdated On 27-08-20202020-08-27T02:52:12.809Z27-08-2020 2020-08-27T02:52:06.497Z - 2020-08-27T10:13:30.676Z - 27-08-2020

ఐదురోజుల్లో పదవీ విరమణ... ఆ ఫ్యామిలీలో అనుకోని విషాదం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సుదీర్ఘకాలం ఉద్యోగం నిర్వహించడం, వివిధ పదవులు పొందడం మామూలే. అప్పటివరకూ అంతా బాగానే వుంది. మరో ఐదు రోజుల్లో ఆయన పదవి విరమణ చేయాల్సి ఉంది. అయితే  ఆ అధికారి ఇంట్లో అనుకోని విషాదం వెంటాడింది. దీంతో కుటుంబం శోకసంద్రమయింది. ఈ ఆకస్మిక మరణంతో విషాదం నెలకొంది. జగిత్యాల అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయాల్సి వుంది. 

కానీ అనారోగ్యం ఆమెను వెంటాడింది. దీంతో ఆయన కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం ఆయనకు కరోనా సోకగా.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి గుండెపోటు కూడా వచ్చింది. దీంతో ఆయన బుధవారం ఉదయం మరణించారు. ఈ సంఘటన అతని కుటుంబంలో, పోలీసుశాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.

దక్షిణామూర్తి స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని అలుగునూరు. ఆయన 1989 బ్యాచ్‌లో ఎస్సైగా ఎంపికయ్యారు. ఆ తర్వాత వరంగల్, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ఆ తర్వాత జగిత్యాల ఏఎస్పీగా పదోన్నతి పొందారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా దక్షిణామూర్తి ఆకస్మిక మరణానికి తీవ్ర సంతాపం తెలిపారు. 

దక్షిణామూర్తి మృతి బాధాకరం.. మంత్రి ఎర్రబెల్లి

జగిత్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి మృతికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధిక కాలం విధులు నిర్వహించి అందరి మన్ననలు పొందిన వ్యక్తి దక్షిణామూర్తి అన్నారు. కరోనాతో అతడు చనిపోవడం చాలా బాధాకరమని మంత్రి ఎర్రబెల్లి విచారం వ్యక్తం చేశారు.

మేడారం జాతర స్పెషల్ ఆఫీసర్ గా మంచి అనుభవం ఉన్నపోలీస్ అధికారిగా గుర్తింపు ఉన్న విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి గుర్తు చేసుకున్నారు.  వరంగల్ ప్రాంతంలో ఎక్కువ కాలం పని చేయడం ద్వారా ఆయనతో తనకు మంచి అనుబంధం ఏర్పడిందన్నారు. ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరి సీఐ, డీఎస్పీ, ప్రస్తుతం అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందారు అంటే వారు ఎంత బాధ్యతగా పని చేసేవారో అర్థమవుతుందన్నారు. దక్షిణామూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.విధి నిర్వహణలో దక్షిణామూర్తి మరణించడంతో పోలీసు శాఖలో విషాదఛాయలు అలముకున్నాయి. 

 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   6 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   2 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   4 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   9 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   11 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   12 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   a day ago


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle