newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఐటీ సంస్థల్లో మళ్ళీ సందడి..లాక్ డౌన్ రూల్స్ పాటించాల్సిందే!

11-05-202011-05-2020 10:54:18 IST
Updated On 11-05-2020 12:06:56 ISTUpdated On 11-05-20202020-05-11T05:24:18.714Z11-05-2020 2020-05-11T05:22:26.880Z - 2020-05-11T06:36:56.309Z - 11-05-2020

ఐటీ సంస్థల్లో మళ్ళీ సందడి..లాక్ డౌన్ రూల్స్ పాటించాల్సిందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హైదరాబాద్ పేరు చెప్పగానే ఐటెక్ సిటీ గుర్తుకువస్తుంది. నిత్యం ఐటీ ఉద్యోగులతో సందడిగా వుంటే నగరం లాక్ డౌన్ ఆంక్షలు కారణంగా నిశ్భబ్దంగా మారింది. మూడవ విడత లాక్ డౌన్లో భాగంగా ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. సుమారుగా 50 రోజుల తర్వాత తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవహారాలు చక్కబడుతున్నాయి. సోమవారం నుంచి అన్ని జోన్లలో ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నాయి. ఐటీ సంస్థలు కూడా తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.

ప్రభుత్వం కొన్ని కచ్చితమైన నిబంధనలు విధించింది. వీటిని తప్పకుండా పాటిస్తూ కార్యకలాపాలు నిర్వహించాలి. .గ్రీన్ జోన్ల పరిధిలో గ్రామాల నుంచి మండలాల వరకు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య వ్యవహారాలకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. తాజాగా అన్ని జోన్లలోనూ ప్రభుత్వ కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. అయితే రెడ్‌ జోన్లలో కేవలం 33 శాతం సిబ్బందితో మాత్రమే కార్యకలాపాలు కొనసాగించాల్సి వుంటుందని స్పష్టం చేసింది.

వీటిలో కొన్నింటికి మినహాయింపునిచ్చింది. వైద్య ఆరోగ్య శాఖలు, పోలీస్‌, ఎక్సైజ్‌, సివిల్‌ డిఫెన్స్‌, అగ్నిమాపక, అత్యవసర సేవలు, విపత్తుల నిర్వహణ,కమర్షియల్‌ టాక్సులు, స్టాంపులు రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ, రక్షణ, భద్రతా సర్వీసులు,జైళ్లు, హోంగార్డులు, అనుబంధ సేవలు, ఎన్‌ఐసీ, కస్టమ్స్‌,ఎఫ్‌సీఐ, ఎన్‌సీసీ, ఎన్‌వైకే, పంచాయతీరాజ్‌ వంటి శాఖలు ఎటువంటి ఆంక్షలు లేకుండా పనిచేస్తాయి. గ్రీన్‌, ఆరెంజ్ జోన్ల పరిధిలోని కార్యాలయాలు వంద శాతం ఉద్యోగులతో నడుస్తాయి.33 శాతం వర్క్ ఫోర్స్‌‌‌తో హైదరాబాద్‌‌లోని ఐటీ కంపెనీలను తిరిగి ప్రారంభించుకునేందుకు పోలీసులు అనుమతినివ్వడంతో హైదరాబాద్ లో సందడి మొదలైంది. 

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్‌‌‌‌ వివిధ పారిశ్రామిక సంస్థలు, ఇండస్ట్రీ బాడీల, హైకియా, నాస్కామ్‌‌, ఐటీ కంపెనీల ప్రతినిధులు సమావేశమై దీనిపై చర్చించారు. సమావేశం అనంతరం ఐటీ సంస్థల రీఓపెనింగ్‌పై స్పష్టమైన గైడ్ లైన్స్ జారీ చేశారు. పోలీసుల నిబంధనల ప్రకారం ప్రతీ షిఫ్టులో 33శాతం వర్క్ ఫోర్స్ పెరగకుండా చూసుకోవాలి.

అలాగే ఉదయం 7గంటలకు లాగిన్ అయ్యేవారు సాయంత్రం 3గంటలకు లాగౌట్ కావాలి. ఉదయం 10గంటలకు లాగిన్ అయ్యేవారు సాయంత్రం 6గంటలకు లాగౌట్ కావాలి. ప్రతీ ఐటీ ఎంప్లాయి కంపెనీ ఐడీ కార్డు,ఆఫీస్ అథారిటీ లెటర్‌ను వెంట తెచ్చుకోవాలి. రోడ్లపై వాహనాల రద్దీని తగ్గించేందుకు వీలైనంత ఉద్యోగులు కంపెనీ బస్సుల్లోనే ప్రయాణించాలి.ప్రతీ ఐటీ కంపెనీ ఎంట్రీ గేటు వద్ద స్క్రీనింగ్ టెస్టుల ద్వారా ఉద్యోగుల టెంపరేచర్‌ను పరీక్షించాలి. మాస్కులు,భౌతిక దూరం తప్పనిసరి. బ్రేక్ టైమ్‌లో లేదా ఆఫీస్ ముగిశాక ఉద్యోగులంతా ఒక్కచోట గుమిగూడకుండా ఎవరికి వారు భౌతిక దూరం పాటించాలని పోలీసులు పేర్కొన్నారు.

కంపెనీ క్యాబ్‌లో ప్రయాణించే ఉద్యోగులు ఎక్కువమంది కాకుండా డ్రైవర్‌తో పాటు ఇద్దరికే అనుమతి ఉంటుంది. 55 ఏళ్లు దాటినవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఫీసులకు అనుమతించకూడదని పేర్కొంది. అన్ని కంపెనీల్లోనూ క్యాంటీన్లు,కెఫేటేరియాలు మూసేయాలి. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని పోలీసులు తెలిపారు. ఐటీ కార్యకలాపాలు ప్రారంభం కావడంతో సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో వాహనాల కదలికలు పెరిగాయి. 

 

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   13 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   11 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   16 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   20 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle