newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ఐఐటియన్లతోనే దేశ ప్రగతి.. నైపుణ్యం పెంచుకోండి

08-03-202008-03-2020 08:57:35 IST
2020-03-08T03:27:35.658Z08-03-2020 2020-03-08T03:27:24.262Z - - 26-05-2020

ఐఐటియన్లతోనే దేశ ప్రగతి.. నైపుణ్యం పెంచుకోండి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో ఐఐటీయన్లకు ప్రాధాన్యత పెరిగిందని, వారినుంచి దేశం ఎంతో ఆశిస్తోందన్నారు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ. సంగారెడ్డి జిల్లా కంది సమీపంలోని ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ ను సందర్శించిన ఆయన ఐఐటి స్టూడెంట్స్ తో ముచ్చటించారు దత్తాత్రేయ. ఐఐటియన్లు సమాజానికి ఉపయోగపడే ప్రయోగాలపై దృష్టి సారించండి అని పిలుపునిచ్చారు బండారు దత్తాత్రేయ. 

ఆర్టిఫిషియల్ ఇంటలిజిన్స్ కి ప్రాధాన్యత  పెరుగుతున్నందున్న ఐఐటి హైదరబాద్ దాని పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జపాన్ ప్రభుత్వ సంస్థతో ఒప్పందం చేసుకోవడం గర్వించ దగ్గ విషయం అని అన్నారు. గతంలో ఐఎయస్ అంటే గొప్పగా చూసేవారని, కానీ ఇప్పుడు ఐఐటి అంటేనే ప్రాధాన్యత పెరిగిందన్నారు.

టిబెటియన్స్ పై చైనా చేస్తున్న ఆకృత్యాలపై ఐఐటియన్స్ అడిగిన ప్రశ్నలకు గవర్నర్ గా సమాధానం చెప్పలేనన్నారు. ఐఐటి హైదరాబాద్ పదేళ్ళలోనే దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థగా ఎదిగిందని, దేశం ముందు తరువాతే కుటుంబం అని విద్యార్థులకు సూచించారు.

చైనా,జపాన్ లలో నైపుణ్య శిక్షణ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐఐటియన్లు తమ నైపుణ్యం పెంచుకోవాలన్నారు. ఐఐటియన్ లు కొంతమంది చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకోవడం బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఐఐటీ లో చదివిన ప్రతి విద్యార్థి ఇతరులకు ఆదర్శం అన్నారు. త్యా గం, సేవా గుణంతో దేశాభివృద్ధి కోసం పని చేసి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని బండారు దత్తాత్రేయ అన్నారు.రాబోయే రోజుల్లో టెక్నాలజీకీ ఎంతో ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో వాటిని మరింత స్థాయికి అభివృద్ధి చేయాలని విద్యార్థులకు సూచించారు.

2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల ఉద్యోగావకాశాల్లో అందులో సగం 1.50 కోట్ల భారత్‌కే దక్కనున్నాయన్నారు. 2030 నాటికి దేశంలో 65శాతం మంది యువత ఉండబోతున్నారని తెలియజేశారు. దేశాభివృద్ధి కోసం త్యాగ గుణం, సేవా గుణాన్ని ఈ స్థాయి నుంచే అలవర్చుకోవాలన్నారు.

శారీరకంగా,మానసికంగా దృఢంగా ఉండండి , యోగాతో మానసిక ప్రశాంతత వస్తుందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా సేవలు అందిస్తున్న దత్తాత్రేయ ధర్మశాల విషయంలో దలైలామాను కలిసానని అన్నారు.  ఉద్యోగాల కోసం చదవవద్దని, ఉద్యోగాలిచ్చేలా ఐఐటి నుండి బయటకు రండి అని సవాలు విసిరారు దత్తాత్రేయ.

అతి తక్కువకాలంలోనే ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో హైదరాబాద్ ఐఐటీ 4వ స్థానానికి చేరుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు.ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థులు నానో టెక్నాలజీని అభివృద్ధి చేసేలా పరిశోధనలు చేయాల్సి అవసరం ఉందని సూచించారు.  కార్యక్రమంలో ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి, ప్రొఫెసర్లు డాక్టర్‌ సుమొన, రాజాబెనర్జీ, రాజలక్ష్మి, విద్యార్థులు పాల్గొన్నారు. 

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   4 hours ago


బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

బాబోయ్ ఎండలు.. నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు!

   6 hours ago


వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

వైరల్ అవుతున్న కేటీయార్ చేనేత మాస్కులు

   9 hours ago


అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

అకస్మాత్తు నిర్ణయాలతో ప్రయాణికుల అయోమయం

   11 hours ago


తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

తెలంగాణ 66.. ఏపీలో 89.. పోటాపోటీగా పాజిటివ్ కేసులు

   12 hours ago


సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

సీరియల్ కిల్లర్ సంజయ్.. ఒక హత్య దాచేందుకు 10 హత్యలు

   12 hours ago


ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

ఈ కుర్రాడు చాలా బోల్డ్.. ఢిల్లీ నుంచి ఒంటరిగా బెంగళూరుకు

   13 hours ago


బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

బాబోయ్ కోడి @500.. ఇక కొని తినలేమా?

   13 hours ago


నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

నిద్రపోతున్న జగన్ సర్కారుకి హైకోర్టు మొట్టికాయలు

   13 hours ago


ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

ముదిరిన టీటీడీ భూవివాదం.. వెనక్కు తగ్గిన ప్రభుత్వం!

   14 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle