newssting
BITING NEWS :
మహారాష్ట్ర సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కలయికతో కూడిన మహావికాస్ ఆఘాదీ ప్రభుత్వం స్వయంగా కుప్పకూలిపోతుందన్న ఫడణవీస్. కూటమిని అధికారం నుంచి తొలగించడానికి బీజేపీ ఏం చేయనవసరం లేదని చెప్పిన ఫడణవీస్ * బీహార్ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు 30వేల మంది కేంద్ర బలగాలను పంపించాలని కేంద్ర హోంమంత్రిత్వశాఖ నిర్ణయం. ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా కొవిడ్ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించేందుకు వీలుగా 30వేల మంది కేంద్ర బలగాల జవాన్లతో ఏర్పాటు చేయనున్న బందోబస్తు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలలో కేంద్ర అదనపు బలగాలతో రక్షణ * చైనా ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల అగ్రరాజ్యంలోని దిగ్గజ కంపెనీల ఆగ్రహం. 30 వేల కోట్ల డాలర్ల విలువైన చైనా దిగుమతులపై సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్న డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ యూఎస్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌లో కేసులు వేసిన 3,500 కంపెనీలు * కర్ణాటక రాష్ట్రం కలబుర్గి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. సావళగి క్రాస్‌ అళంద రోడ్డుపై తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి. నెలలు నిండిన మహిళకు నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళుతుండగా ప్రమాదం * 286వ రోజుకు చేరుకున్న అమరావతి రాజధాని రైతుల ఉద్యమం. గ్రామాల్లోని శిబిరాల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు. రాజధానిగా అమరావతి కొనసాగుతుందని ప్రభుత్వం చెప్పే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రాజధాని రైతులు స్పష్టం. కరోనా సూచనలు పాటిస్తూ కొనసాగుతున్న అమరావతి ఉద్యమం * ఏపీ‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ. ఇటీవల తిరుమల బ్రహ్మోత్సవాల్లో సీఎం జగన్‌తో కలిసి స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి. బ్రహ్మోత్సవాల అనంతరం స్వల్పంగా కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న వెల్లంపల్లి * ప్రకాశం బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవహిస్తోన్న కృష్ణా నది. కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక. ప్రాజెక్టు వద్ద 6,65,925 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో. కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచన * తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామివారి నూతన రథం నిర్మాణ పనులు ఆదివారం ప్రారంభం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ * యాదాద్రి-భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం ప్రొద్దుటూరులో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాని కుప్పకూలిన పెంకుటిల్లు. అర్ధరాత్రి సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు. శబ్దాన్ని గమనించిన నలుగురు కుటుంబ సభ్యులు వెంటనే బయటకు రావడంతో తప్పిన ప్రాణాపాయం * నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం. 20 క్రస్టు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 4,19,454 క్యూసెక్కులుగా ఉన్న ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 312.0450 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 310.252 టీఎంసీలుగా నమోదు. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను.. ప్రస్తుత నీటిమట్టం 589.40 అడుగులు * రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు తెలంగాణ ఎంసెట్ పరీక్ష. ఉదయం, మధ్యాహ్నం రెండు షెషన్‌లలో పరీక్ష నిర్వహణ. తెలంగాణ, ఆంధ్రాలో కలిపి మొత్తం 84 సెంటర్లలో పరీక్షను నిర్వహణ. తెలంగాణలో 67, ఆంధ్రాలో 17 పరీక్షా కేంద్రాలు

ఐఏఎస్, ఐపీఎస్‌ల ఒత్తిడికి లొంగే సజ్జనార్ అలా చేశారా?

07-12-201907-12-2019 13:39:27 IST
Updated On 07-12-2019 17:56:37 ISTUpdated On 07-12-20192019-12-07T08:09:27.790Z07-12-2019 2019-12-07T08:09:25.870Z - 2019-12-07T12:26:37.413Z - 07-12-2019

ఐఏఎస్, ఐపీఎస్‌ల ఒత్తిడికి లొంగే సజ్జనార్ అలా చేశారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపు డాక్టర్ దిశపై హత్యాచార ఘటనలో నిందితులను ఘటనా స్థలానికి సమీపంలోనే ఎన్‌కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసులపై దేశవ్యాప్తంగా అభినందనల వర్షం కురుస్తుండగా జాతీయ మానవహక్కుల కమిషన్, పలు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఈ ఎన్‌కౌంటర్ బూటకం అంటూ విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. దిశపై ఆ దారుణ చర్య జరగడానికి ముందు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించి అభాసుపాలైన తెలంగాణ పోలీసులు పది రోజుల్లోపే నిందితులను కాల్చి చంపడం ద్వారా దేశం దృష్టిలో హీరోలైపోయారు. కానీ ఈ ఎన్‌కౌంటర్‌కు ఆద్యంతం వ్యూహ రచన చేసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్ తోటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి తీవ్రమైన ఒత్తిడికి లోనై ఇంత సత్వర నిర్ణయానికి వచ్చారా అనేది చర్చనీయాంశం అవుతోంది.

దిశ హంతకులపై తీవ్ర చర్య జరుగుతుందని తొలి నుంచి అనుమానించినవారు కూడా ఇంత త్వరగా ఆ నిర్ణయం తీసుకుంటారని ఊహించలేకపోయారు. గురువారం రాత్రి చివరి వార్తలు ప్రచురణకు సిద్దం చేస్తున్న మీడియా పాత్రికేయులు సైతం ఏదైనా సంచలనం జరుగుతుందని సూచనా ప్రాయంగా కూడా ఆలోచించలేకపోయారు. కేసు రీ కన్‌స్ట్రక్షన్ అనే అంశం చుట్టూనే శుక్రవారం నాటి దినపత్రికల కథనాలు తయారు కావడం తెలిసిందే. దానిపేరుతో మరో పథకానికి పోలీసులు పథకం పన్నారన్న అంశం ఎవరి ఆలోచనల్లోకి రాలేదు. ఇంత తీవ్రనిర్ణయానికి కారణం ఏముంటుందని ఎన్‌కౌంటర్ ఘటన తర్వాత పలువురు పలురకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. వాటిలో సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ ఎదుర్కొన్న తీవ్రమైన ఒత్తిడి విషయం ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది.

Image result for Disha Murder Case Sajjanar Received above 2500 Missed calls

దిశ హంతకుల ఎన్‌కౌంటర్‌ ఓ రకంగా సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌పై కొంత ఒత్తిడి తగ్గించిందనే చర్చ పోలీస్‌ వర్గాల్లో జరుగుతోంది. సజ్జనార్‌కు ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌గా పేరుండడం, ఇప్పుడు ఘటన జరిగిన పరిధికి కూడా ఆయనే పోలీస్‌ బాస్‌ కావడంతో నిందితుల ఎన్‌కౌంటర్‌ జరుగుతుందని కొందరు ఊహించారు. మరికొందరు ఏకంగా సీపీ సజ్జనార్‌కే ఫోన్‌ చేసి చెప్పేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. గత వారం రోజుల్లో సజ్జనార్‌ మొబైల్‌కు 2,500కు పైగా మిస్డ్‌ కాల్స్‌ వచ్చాయంటే ఈ ఘటన తర్వాత ఆయన ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవచ్చని పోలీస్‌ వర్గాలంటున్నాయి. 

ప్రతి నిమిషం ఆయన ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్‌ మెసేజ్‌లు వెల్లువెత్తాయి. సీపీ సజ్జనార్‌కే కాదు ఆయన సతీమణి ఫోన్‌కు కూడా వందల సంఖ్యలో మెసేజ్‌లు వచ్చాయని, నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయాలనే భావన ఆ మెసేజ్‌ల్లో వ్యక్తమైందని అంటున్నారు. అలా ఎస్‌ఎంఎస్‌‌లు, వాట్సాప్‌ మెసేజ్‌లు పంపిన వారిలో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారుల భార్యలు, కుటుంబ సభ్యులున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీపీ సజ్జనార్‌ ఎవరితో చర్చించకుండా రహస్యంగానే ఉంచి ఒత్తిడిని భరించారని పోలీస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఓవైపు కేసు విచారణ, దర్యాప్తు, ప్రభుత్వ వర్గాల నుంచి సహజంగా ఉండే ఒత్తిడికి తోడు పౌర సమాజం డిమాండ్లను తట్టుకున్న సజ్జనార్‌ నిందితులకు చట్టపరం గా శిక్ష పడాలనే దర్యాప్తు కొనసాగించారని అంటున్నారు. అనుకోకుండా ఎన్‌కౌంటర్‌ జరిగిందని, దీనిని పౌరసమాజం హర్షించడంతో  సజ్జనార్‌కు మానసికంగా ఊరట కలిగినట్టేననే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది.

మేం లేని ఎన్డీఏ ఇంకా ఎక్కడ.. పెదవి విరిచిన శివసేన

మేం లేని ఎన్డీఏ ఇంకా ఎక్కడ.. పెదవి విరిచిన శివసేన

   10 minutes ago


చంద్రబాబుకు నోటీసులు..!

చంద్రబాబుకు నోటీసులు..!

   28 minutes ago


ఇంటివద్దే వైద్య పరీక్షలు.. దేశంలోనే ఏపీలో మొదటగా ప్రారంభం

ఇంటివద్దే వైద్య పరీక్షలు.. దేశంలోనే ఏపీలో మొదటగా ప్రారంభం

   36 minutes ago


60 టీఎంసీల నీటి వరదతో కృష్ణమ్మ మహోగ్ర రూపం.. తెలంగాణకు జలసిరి

60 టీఎంసీల నీటి వరదతో కృష్ణమ్మ మహోగ్ర రూపం.. తెలంగాణకు జలసిరి

   an hour ago


అధికారమే లక్ష్యంగా పనిచేద్దాం.. కొత్త ఇన్‌చార్జ్ మాణిక్యం

అధికారమే లక్ష్యంగా పనిచేద్దాం.. కొత్త ఇన్‌చార్జ్ మాణిక్యం

   3 hours ago


ప్రైవేట్ విద్యపై సర్కారు బడి ఘనవిజయం.. కలకలలాడుతున్న ప్రభుత్వ బళ్లు

ప్రైవేట్ విద్యపై సర్కారు బడి ఘనవిజయం.. కలకలలాడుతున్న ప్రభుత్వ బళ్లు

   3 hours ago


చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు..  కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు.. కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

   18 hours ago


గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

   18 hours ago


ఏపీకి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాలో కొత్త పుంత‌లు

ఏపీకి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాలో కొత్త పుంత‌లు

   19 hours ago


యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన 'రవికిషన్'

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన 'రవికిషన్'

   20 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle