newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏ ఒక్క పేషంట్‌ను కూడా వెనక్కి పంపించొద్దు.. మంత్రి ఈటల ఆదేశాలు

19-07-202019-07-2020 09:12:02 IST
Updated On 19-07-2020 11:07:07 ISTUpdated On 19-07-20202020-07-19T03:42:02.271Z19-07-2020 2020-07-19T03:41:59.161Z - 2020-07-19T05:37:07.709Z - 19-07-2020

ఏ ఒక్క పేషంట్‌ను కూడా వెనక్కి పంపించొద్దు.. మంత్రి ఈటల ఆదేశాలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ప్రజల ప్రాణాలే తమ ప్రభుత్వానికి ముఖ్యమని, కరోనా వైరస్ బారినపడి ఆసుపత్రులకు వచ్చిన ఏ ఒక్క రోగిని కూడా వెనక్కు తిరిగి పంపకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. తెలంగాణలో కోవిడ్-19 కట్టడి ప్రక్రియలో ఆసుపత్రుల వారీగా నెలకొన్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోందని మంత్రి ఈటల పేర్కొన్నారు. శనివారం కోఠిలోని వైద్యశాఖ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఆస్పత్రుల్లో అవసరమైన సిబ్బందిని నియమించుకునే అవకాశాన్ని సూపరింటెండెంట్లకు ఇస్తున్నట్లు వెల్లడించారు. సిబ్బంది, పరికరాలు అడిగిన 24 గంటల్లోనే ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. టీం వర్క్‌తో పనిచేసి ప్రజల ప్రాణాలు పోకుండా చూడాలని వైద్యశాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

హాస్పిటల్‌కి వచ్చిన ఏ ఒక్క పేషంట్‌ను కూడా వెనక్కి తిరిగి పంపించ కూడదని.. ప్రాథమిక చికిత్స అందించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన హాస్పిటల్‌కి పంపించేలా ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రులు చుట్టూ పేషెంట్లు తిరుగుతున్నారని వస్తున్న వార్తలకు స్వస్తి పలకాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రిపై కూడా ఈటల సమీక్ష నిర్వహించారు. హైటెక్‌ యుగంలో పురాతన కట్టడాలతో ప్రజల ప్రాణాలు తీసే హక్కు ఎవరికీ లేదని, ప్రజలు ప్రాణాలు హరించే విధంగా ఉన్నా ఉస్మానియా ఆసుపత్రిని ఆధునీకరించాలని అనేక విజ్ఞప్తులు వస్తున్నాయని వాటికి అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకుంటారని మంత్రి అన్నారు.

కరోనా వైరస్‌ నిర్ధారణ, కోవిడ్‌–19 చికిత్సలు ఇకపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే నిర్వహిస్తామని ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ప్రాథమిక దశలోనే కరోనా వైరస్‌ను నిర్ధారించి చికిత్స అందిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, కరోనా వైరస్‌ నియంత్రణలోకి వచ్చే వరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని వెల్లడించారు. 

బీఆర్కే భవన్‌లో ఫార్మా కంపెనీలు, డీలర్లతో శనివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జ్వరం తదితర లక్షణాలు వచ్చిన వారిని ఉపకేంద్రాల స్థాయిలో గుర్తించి పీహెచ్‌సీకి తరలిస్తామని, అక్కడే కరోనా వైరస్‌ పరీక్షలు నిర్ధారణ చేసి ప్రాథమిక చికిత్స కూడా చేస్తామన్నారు. హోంఐసోలేషన్‌ అవసరమైన వారికి మందులు పంపిణీ చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తామన్నారు. అవసరమైన వారిని పెద్దాసుపత్రికి తరలిస్తామని వివరించారు. 

కోవిడ్‌–19 రోగులకు ఇచ్చే మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచుతామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో మందులకు కొరత లేదని, అవసరమైన మందులను ఎంత ఖర్చు అయినా కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు.  

మందులు బ్లాక్‌మార్కెట్‌కు తరలితే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రతి మందుల షాప్‌లో మందులు అందుబాటులో ఉండేలా చూడాలని, ప్రతి ప్రభుత్వ ఆసుపత్రికి విధిగా అవసరమైన మందులు సరఫరా చేయాలని కోరారు. ఎక్కువ ఖరీదు ఉన్న మందులు కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. 

కరోనా చికిత్సలో అవసరమైన అన్నిరకాల మందులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని డ్రగ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. వైరస్‌ లోడ్‌ను తగ్గించడానికి వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్‌ మందును తయారు చేస్తున్న హెటిరో కంపెనీ యాజమాన్యంతో ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా మాట్లాడారని, రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మందులను సరఫరా చేయాలని కోరారని, కాబట్టి త్వరలోనే ఆ మందు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. 

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   12 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   13 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   13 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   17 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   18 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   16 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   19 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   19 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   14 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle