newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏమిటీ కర్కశత్వం.. కోతులను హింసించి చంపిన మృగాడు

29-06-202029-06-2020 08:44:24 IST
Updated On 29-06-2020 11:40:39 ISTUpdated On 29-06-20202020-06-29T03:14:24.030Z29-06-2020 2020-06-29T03:14:18.291Z - 2020-06-29T06:10:39.351Z - 29-06-2020

ఏమిటీ కర్కశత్వం.. కోతులను హింసించి చంపిన మృగాడు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మానవత్వం మంటగలిసిపోతోంది. కరోనా వైరస్ మానవాళికి సవాలుగా మారుతున్నా.. ప్రకృతి పట్ల వారిలో కరుణ కనిపించడం లేదు. ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక సంఘటన మానవత్వానికి మచ్చ కలిగించేలా వుంది. కోతుల పట్ల ఓ వ్యక్తి చేసిన అపరాథం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం అమ్మ‌పాలెం గ్రామంలో సాదు వేంకటేశ్వరరావు అనే వ్యక్తి కోతుల పట్ల పాశవికంగా ప్రవర్తించాడు. 

తన ఇంటి దగ్గర నీటి తొట్టిలో పడిపోయింది ఓ కోతి. అందులో పడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ మర్కటాన్ని మాన‌వ‌తా దృక్పథంతో కాపాడాల్సింది పోయి… ఆ కోతిని కర్రలతో కొట్టి చంపేశాడు. అంతేకాదు మరోకోతిని ఉరి తీసి చంపేశాడు. నీటితొట్టెలో పడ్డ కోతిని కర్రతో కొట్టి చంపడమే కాదు దానిని అక్కడే పడేయ్యటంతో వందలాదిగా కోతులు ఆ ప్రదేశానికి చేరుకున్నాయి. దీంతో చుట్టుపక్కల వారు బతికి ఉన్న కోతిని చంపితే మిగతా కోతులు పారిపోతాయని చెప్పటంతో అక్కడే ఉండే మరో వ్యక్తి జోసెఫ్ రాజ్ సహకారంతో మరో కోతిని పట్టుకున్నారు. 

ఆ కోతిని సమీపంలోని ఖాళీ ప్రదేశంలో చెట్ల దగ్గరికి తీసికెళ్ళి దానిని కూడా ఉరి వేసి కుక్కలతో‌ కరిపించుకుంటూ కర్రలతో కొట్టుతూ అతి దారుణంగా చంపి కుక్కలకు ఆహారంగా వేశాడు వెంకటేశ్వరరావు. ఈ ఘటన పై కొందరు ఫారెస్ట్ ఉన్నతాధికారి కి ఫోన్ లో సమాచారం ఇచ్చిన పెద్దగా పట్టించుకోలేదని స్థానికులు చెప్పారు. కోతిని ఉరివేసిన ఘటన ఎలాంటి పాషాణ హృదయాలనైనా కదిలించేలా వుంది.ఆ కోతి ఆ వ్యక్తికి ఏ హానీ చేయలేదు. ఒకటి కాదు ఏకంగా రెండు కోతుల పట్ల వ్యవహరించిన తీరుపై జంతుప్రేమికులు మండిపడుతున్నారు. అతి క్రూరాతి క్రూరంగా వ్యవహరించిని వ్యక్తుల పై అటవీ జంతువుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

అడవి లో ఆహారం లేక రోడ్లపైకి వస్తున్న మూగజీవాల పట్ల ఆహారం అందించాలి తప్ప ఈ విధంగా కర్కశంగా ప్రవర్తించడం మానవత్వం అనిపించుకోదంటున్నారు. ఈమధ్యే కేరళలో ఏనుగుని చంపిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆకలితో వున్న ఏనుగుకు పేలుడు పదార్ధాలున్న కొబ్బరికాయను అందించడం, అది తిని తీవ్రంగా గాయపడి ఏనుగును మరణించడం తెలిసిందే. దీనిపై తీవ్రంగా స్పందించిన కేరళ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేరళలో ఓ శునకం మూతికి టేప్ చుట్టి హింసించిన ఘటన అందరినీ కలిచివేసింది. ఖమ్మం ఘటనపై కూడా సోషల్ మీడియాలో నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అటవీ శాఖ అధికారులు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. 

మానవత్వానికి మచ్చ.. ఏనుగు పట్ల అమానుషం

ఏనుగుపై అమానుషం .. ఎందరినో కదిలించింది

కోవిడ్  వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

కోవిడ్ వ్యాక్సిన్ వేసుకుంటున్నారా దయచేసి ఆగండి.. మమత

   3 hours ago


మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్..!

   4 hours ago


ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

   38 minutes ago


గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

గ‌చ్చిబౌలి టిమ్స్ లో రోజుకి 20 క‌రోనా చావులు.. లెక్క చేయ‌ని హైద‌రాబాదీలు

   3 hours ago


ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

ఇద్ద‌రూ ఇద్ద‌రే స‌రిపోయారు

   5 hours ago


క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా

   6 hours ago


క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

క‌రోనా హాట్ స్పాట్ గా శ్రీకాకుళం.. కార‌ణం తెలుసా

   6 hours ago


 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   a day ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   22-04-2021


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   22-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle