newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏప్రిల్ 7 టార్గెట్... లాక్ డౌన్ పక్కా అమలుచేస్తాం

30-03-202030-03-2020 11:27:51 IST
2020-03-30T05:57:51.090Z30-03-2020 2020-03-30T05:30:38.370Z - - 16-04-2021

ఏప్రిల్ 7 టార్గెట్... లాక్ డౌన్ పక్కా అమలుచేస్తాం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏప్రిల్‌ 7 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 10 నుంచి 12 మంది తప్ప మిగిలిన కరోనా బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అవుతారని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త కేసులు నమోదయ్యే అవకాశం తక్కువగా ఉందని అన్నారు. తెలంగాణలో 70 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని.. ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపారు. డిశ్చార్జ్‌ అయిన వ్యక్తితో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. కరోనా పాజిటివ్‌ తేలి చికిత్స పొందుతున్నవారిలో 11 మందికి నెగిటివ్‌ వచ్చిందని.. వారిని రేపు(సోమవారం) డిశ్చార్జ్‌ చేయనున్నట్టు వెల్లడించారు. మిగిలిన 58 మంది వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 25,938 మంది క్వారంటైన్‌లో ఉన్నారని తెలిపారు. 

ఈ గండం నుంచి బయటపడేవరకు ప్రజలు ప్రభుత్వానికి హకరించాలని కేసీఆర్‌ కోరారు. కరోనాపై లాక్‌డౌన్‌ కు మించిన ఆయుధం లేదని చెప్పారు. లాక్‌డౌన్‌ పెట్టడం వల్లే భారత్‌కు మేలు జరిగిందని ప్రపంచ దేశాలన్నీ అంటున్నాయని చెప్పారు. దక్షిణ కొరియాలో ఒక వ్యక్తి ద్వారా కరోనా వైరస్‌ 59 మందికి సోకిందన్నారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారిని రోజుకు రెండుసార్లు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరిస్తే తక్కువ నష్టంతో బయటపడగలమని తెలిపారు. వలస కార్మికలు రేషన్‌ కార్డు లేకపోయినా ప్రతి వ్యక్తికి 12 కేజీల బియ్యం, రూ. 500 ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు.  

అవసరమైన చోట కల్యాణ మండపాల్లో వలస కార్మికులకు వసతి, భోజనం కల్పిస్తామని చెప్పారు. అవసరమైన దానికంటే 30 శాతం వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బందిని సమకూరుస్తున్నామని వివరించారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా వదంతులు, తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే శిక్షలు తప్పవన్నారు.  కరోనా తీవ్రతపై ప్రభుత్వం వాస్తవాలను వెల్లడిస్తుందన్నారు. అలాంటప్పుడు తప్పుడు ప్రచారం చేయాల్సి అవసరం ఏముందని ప్రశ్నించారు. అలాంటి వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. శవాలపై పేలాలు ఏరుకొనే చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు చెప్పారు. విపత్కర సమయంలో దేశమంతా ఏకమవుతుందన్నారు. 

 గాంధీ దవాఖానలో చికిత్స బాగా జరిగిందని, వైద్యులు, ఇతర సిబ్బంది బతుకడానికి ఆత్మైస్థెర్యం ఇచ్చారని కరోనా నుంచి బయటపడిన వ్యక్తి ప్రధానితో చెప్పారని, ఇది మరో శుభవార్త అన్పారు కేసీయార్. చికిత్సలో ఉన్నవారిలో 11 మందికి నెగెటివ్‌ వచ్చింది. అంటే బీమారీ పోయింది. గాంధీ దవాఖానలో వీరు కోలుకొన్నారు. ఫైనల్‌ రిపోర్డ్‌లో నెగెటివ్‌ వస్తేగానీ ఎవరినీ డిశ్చార్జి చేయరు. ఇందుకు కొన్ని విధివిధానాలుంటాయి. పాజిటివ్‌, నెగెటివ్‌ పరీక్షలు చేయాలి. శరీరంలో వైరస్‌ ఉన్నదా? లేదా? అని పరీక్షిస్తరు. తర్వాత ఛాతి ఎక్స్‌రే తీస్తరు. ఏమాత్రం రిస్క్‌ తీసుకోరు. అందుకే అన్ని పరీక్షలు చేసి జబ్బులేదని తేలితేనే డిశ్చార్జి చేస్తరు. ఇప్పుడు 11 మంది ఫైనల్‌ రిపోర్టులో నెగెటివ్‌ వచ్చింది. వీరు సోమవారం డిశ్చార్జి అవుతున్నారు. ఇంకా చికిత్సలో 58 మంది మిగులుతారు. వీరందరూ కూడా మంచిగా ఉన్నారు. 76 ఏండ్ల ఒక్క వ్యక్తికి మాత్రం కిడ్నీ, ఇతర ఆరోగ్యసమస్యలున్నాయి. ఇతనితోపాటు అందరూ కోలుకొని డిశ్చార్జి అవుతారని నమ్మకముందన్నారు సీఎం. 

రాష్ట్రంలోకి కొత్తకేసులు వచ్చి చేరే అవకాశం తక్కువేనని ...అంతర్జాతీయ విమానాలు బంద్‌ అయ్యాయని, ఎవరూ రాష్ట్రంలోకి ఎంటర్ కాలేరన్నారు. గతంలో ఇతర దేశాలనుంచి వచ్చినవారు పాజిటివ్‌ వచ్చినవాళ్లు స్థానికంగా అంటిస్తే తప్ప కొత్త కేసులు రావు. కరోనా అనుమానితులందర్నీ తీసుకొచ్చాం. కొత్తగూడెంలో దాదాపు 200 మందిని తెచ్చాం. కొందరు కొత్తగూడెం దవాఖానాలో ఉన్నారు. లాక్‌డౌన్‌ ప్రకటించి భారతదేశం వాళ్లు కొంత తెలివిగల్ల పనిచేసినరని అంతర్జాతీయ మ్యాగజైన్లలో మెచ్చుకొంటున్నారని,  ఎందుకంటే మనది పేదదేశం. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నది. ఉండాల్సినంత బలంగా వైద్యవసతులు లేవు. 

అయినా వ్యాధి వ్యా ప్తి నియంత్రణకు లాక్‌డౌన్‌ చేయడమే ఆయుధం. గుంపులుగా చేరకుండా చూడటమే సరైన అస్త్రం. ఆ ఆయుధాన్ని సరిగ్గా వినియోగించుకున్నందున అవుటాఫ్‌ డేంజర్‌గా ఉన్నదని మెచ్చుకొన్నరు. ముఖ్యంగా 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో సమస్య పెరుగనిస్తలేరు. తెలివిగల పనిచేస్తున్నరని అంతర్జాతీయంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు,  ఏప్రిల్‌ 1నుంచి ఏడో తేదీ వరకు వరుసగా 1461, 1887, 1476, 1453, 914, 454, 397 మందికి క్వారంటైన్‌ సమయం ముగిసిపోతుంది. ఏప్రిల్‌ ఏడు తర్వాత మన దగ్గర కరోనాకు సంబంధించిన వ్యక్తి ఉండడు. ఆ లోపు దవాఖానలో చికిత్స పొందుతున్నవాళ్లల్లో 30 నుంచి 35 మంది వరకు డిశ్చార్జి అవుతారు. పది నుంచి పన్నెండు మంది మాత్రమే   ఉంటరు. కొత్త కేసులు వచ్చి చేరకపోతే ఇదీ మన రాష్ట్ర పరిస్థితి అన్నారు. 

 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   a minute ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   9 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   14 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   18 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   19 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   21 hours ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle