newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏప్రిల్ 30 వరకూ లాక్ డౌన్.. కేబినెట్ ఓకె

12-04-202012-04-2020 08:31:27 IST
2020-04-12T03:01:27.676Z12-04-2020 2020-04-12T03:01:18.469Z - - 12-04-2021

ఏప్రిల్ 30 వరకూ లాక్ డౌన్.. కేబినెట్ ఓకె
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అంతా భావించినట్టే లాక్ డౌన్ పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నాం. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేస్తాం. ఇది సమాజం, మన పిల్లలు, భవిష్యత్తు సంక్షేమం కోసం కాబట్టి అందరూ సహకరించాలి. అన్ని మతాలు, కులాలు, వర్గాలు సామూహిక కార్యక్రమాలను మానుకోవాలి. మీరు నష్టపోయి, సమాజానికి నష్టం చేయొద్దు’అని సీఎం కె. చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలం కలిసొస్తే ఏప్రిల్‌ 30 తర్వాత దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ఆలోచిస్తామని సీఎం కేసీయార్ మీడియా సమావేశంలో తెలిపారు. 

ప్రగతి భవన్లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై కోవిడ్‌–19 వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకుముందు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన డిమాండ్లను కేసీఆర్‌ వివరించారు. లాక్‌డౌన్‌ సమయంలో వ్యవసాయానికి అనుమతి ఉంటుందన్నారు.

ధాన్యం వచ్చింది... కోతలు జరగాలె... పంటంతా చేతికి రావాలె... ఎఫ్‌సీఐకి పోవాలె. అదంతా జరగాలె. ధాన్యాన్ని ప్రాసెసింగ్‌ చేసే రైస్‌మిల్లులు నడుస్తాయి. వాటికి అనుమతిస్తాం. పిండిమరలకు అనుమతి ఉంటుంది. ఆయిల్‌ సీడ్స్‌ను నూనెగా చేసే మిల్లులుంటాయి. ఆహార సంబంధిత అనుమతి ఇస్తాం. కూర గాయలు రావాలన్నా వ్యవసాయం అవసరం. వ్యవసాయాన్ని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను అనుమతించాలె. అప్పుడే 135 కోట్ల పొట్టలు నింపుకోగలుగుతాం. అయితే ఈ విషయంలోనూ కొన్ని నియమాలు పాటిస్తూ ముందుకెళ్లాలి. అందరూ మాస్కులు ధరించాలి. ఎవరైనా వినకుండా బయటకు వస్తే పోలీసులు బడితె పూజ చేస్తారన్నారు.

లాక్‌డౌన్‌ను కనీసం రెండు వారాలు పొడిగించాలని అన్ని రాష్ట్రాల సీఎంలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశామన్నారు. ఇతర రాష్ట్రాల వారు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయాలని కొందరు సీఎంలు కోరారు. దీన్ని ససేమిరా అంగీకరించం. సీఎంఆర్‌ఎఫ్‌కు సీఎస్‌ఆర్, పన్నుల మినహాయింపు ఇవ్వాలి. పీఎం కేర్స్‌ తరహాలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళాలు ఇచ్చే వారికి సీఎస్‌ఆర్, ట్యాక్సుల నుంచి మినహాయించే నిబంధనలు వర్తింపజేయాలన్నారు.

రాష్ట్రాల్లోనూ విరాళాలు ఇచ్చేందుకు విరివిగా ముందుకొస్తున్న వారికి ఈ వెసులుబాటు కల్పించాలని ప్రధానిని కోరా. వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన అంశాలను మళ్లీ లేఖ రూపంలో ప్రధానికి పంపించాం. ఆస్పత్రుల్లో ప్రస్తుతం 393 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిజాముద్దిన్‌ ఘటన తర్వాత మొత్తంగా 1,200 మంది అనుమానితులకు వైద్య పరీక్షలు చేశాం. ప్రస్తుతం 1,654 మంది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా 234 చోట్ల కంటెయిన్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 123 ప్రాంతాలు, ఇతర చోట్ల 120 ప్రాంతాలు ఉన్నాయి. కంటెయిన్‌మెంట్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయి. అదృష్టవశాత్తూ చికిత్స పొందుతున్న వారు, క్వారంటైన్, కంటెయిన్‌మెంట్‌ ఏరియాలో ఉన్న వారిలో ఏ ఒక్కరూ సీరియస్‌గా లేరు.  ఏప్రిల్‌ 24 వరకు దాదాపు కోవిడ్‌ బాధితులు ఎవరూ ఉండరు. మహారాష్ట్ర సరిహద్దును వంద శాతం మూసేస్తాం. అక్కడి నుంచి వచ్చే నిత్యావసరాలను కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కోవిడ్ 19 నివారణ కోసం కఠిన నిబంధనలు అవసరం అన్నారు సీఎం కేసీయార్. 

కరోనా నియంత్రణలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మంచి స్థితిలో ఉందని,  ప్రధాని కూడా లాక్‌డౌన్‌ విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారన్నారు. రాజకీయాలను పక్కనపెట్టి అత్యవసర పరిస్థితిలో చికిత్స కోసం వచ్చే రోగులను ప్రైవేటు ఆస్పత్రులు చేర్చుకోవాలన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రాష్ట్రంలో మద్యం షాపులను తెరిచే ప్రసక్తే లేదు. మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిన నేపథ్యంలో మార్కెట్లో మాస్కులు లభించకపోతే ఇంట్లోనే కుట్టుకోవాలి.  1నుంచి 9వ తరగతి వరకూ వార్షిక పరీక్షలను ఇప్పట్లో నిర్వహించే అవకాశం లేకపోవడంతో సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒకటి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులంతా పాసైనట్లేనని ప్రకటించారు. మధ్యలోనే ఆగిన పదవ తరగతి పరీక్షలపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తామన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle