newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏప్రిల్‌ 30 తర్వాతే దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేత: కేసీఆర్

12-04-202012-04-2020 12:27:54 IST
Updated On 12-04-2020 12:54:44 ISTUpdated On 12-04-20202020-04-12T06:57:54.746Z12-04-2020 2020-04-12T06:57:50.617Z - 2020-04-12T07:24:44.993Z - 12-04-2020

ఏప్రిల్‌ 30 తర్వాతే దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేత: కేసీఆర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో పరిస్థితి పూర్తిగా కుదుటపడేంతవరకు తెలంగాణలో లాక్ డౌన్ విషయంలో యధాతథ స్థితి కొనసాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.  ‘రాష్ట్రంలో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తున్నాం. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేస్తాం. ఇది సమాజం, మన పిల్లలు, భవిష్యత్తు సంక్షేమం కోసం కాబట్టి అందరూ సహకరించాలి. అన్ని మతాలు, కులాలు, వర్గాలు సామూహిక కార్యక్రమాలను మానుకోవాలి. మీరు నష్టపోయి, సమాజానికి నష్టం చేయొద్దు’అని సీఎం కె. చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాలం కలిసొస్తే ఏప్రిల్‌ 30 తర్వాత దశలవారీగా లాక్‌డౌన్‌ ఎత్తివేతపై ఆలోచిస్తామని తెలిపారు.

సీఎం కేసీఆర్‌ సారథ్యంలో శనివారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై కోవిడ్‌–19 వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. అలాగే అంతకుముందు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేసిన డిమాండ్లను కేసీఆర్‌ వివరించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు మాత్రమే లాక్ డౌన్ విషయంలో ఆంక్షలతో కూడిన సడలింపు ఉంటుందని సీఎం చెప్పారు.

ఇటీవలి మానవ చరిత్రలో కరోనా వైరస్ ఉత్పాతం  వంటి ఘటన జరగలేదని. 1918లో స్పానిష్‌ ఫ్లూ, 2008లో అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తలెత్తిన సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక పద్ధతిని అవలంబించారని కేసీఆర్ మీడియా సమావేశంలో వివరించారు. ఇటువంటి సంక్షోభాల సమయంలో కేంద్ర రాష్ట్రాల రెవెన్యూ పడిపోయినందున వ్యవస్థను నడిపేందుకు ప్రపంచవ్యాప్తంగా క్వాంటిటేటివ్‌ ఈజింగ్‌ (క్యూఈ) అనే పద్ధతిని పాటిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థను కాపాడుకుంటూ విపత్కర పరిస్థితి నుంచి దేశాన్ని కాపాడుకునేందుకు అమెరికా ఫెడరల్‌ బ్యాంకు తమ జీడీపీలో 10 శాతం అంటే 2 ట్రిలియన్‌ డాలర్లను సమాజంలోకి పంప్‌ చేసింది. బ్రిటిష్‌ బ్యాంక్‌ ఆఫ్‌ లండన్‌ కూడా ఆ దేశ జీడీపీలో 15 శాతం పంప్‌ చేసిందని కేసీఆర్ తెలిపారు. 

మన దేశంలోనూ కేంద్ర, రాష్ట్రాల వద్ద డబ్బు లేనందున, రెవెన్యూ, ట్యాక్సులు వచ్చే పరిస్థితి లేనందున, ఆర్‌బీఐ నుంచి క్యూఈ విధానంలో డబ్బు తీసుకోవడం మినహా గత్యంతరం లేదు. 2019–20కిగాను జీడీపీని 203.85 లక్షల కోట్లుగా నిర్ధారించారు. ఇందులో ఐదు శాతం అంటే రూ. 10.15 లక్షల కోట్లను ఆర్‌బీఐ విడుదల చేసినా అవి కేంద్ర, రాష్ట్రాలకు అందుబాటులోకి వస్తాయని ఈ మొత్తంతో రాష్ట్రాలు ఒక మేరకు కోలుకుంటాయని కేసీఆర్ తెలిపారు.

అలాగే లాక్‌డౌన్‌ సమయంలో వ్యవసాయానికి అనుమతి ఉంటుందని, లేకపోతే మనకు బువ్వ దొరకదని కేసీఆర్ చెప్పారు. ధాన్యం వచ్చింది... కోతలు జరగాలె... పంటంతా చేతికి రావాలె... ఎఫ్‌సీఐకి పోవాలె. అదంతా జరగాలె. ధాన్యాన్ని ప్రాసెసింగ్‌ చేసే రైస్‌మిల్లులు నడుస్తాయి. వాటికి అనుమతిస్తాం. పిండిమరలకు అనుమతి ఉంటుంది. ఆయిల్‌ సీడ్స్‌ను నూనెగా చేసే మిల్లులుంటాయి. ఆహార సంబంధిత అనుమతి ఇస్తాం. కూర గాయలు రావాలన్నా వ్యవసాయం అవసరం అని సీఎం స్పష్టం చేశారు.. 

మన దేశ జనాభా దాదాపు 135 కోట్లు. ప్రపంచంలోనే భారత్‌కు అన్నంపెట్టే శక్తి ఏ దేశానికీ లేదు. మన దేశాన్ని ఎవరూ సాకలేరు. ఎందుకంటే తెలంగాణ కంటే 100 దేశాలు చిన్నగా ఉన్నాయి. ఏ దేశం మనకు అన్నం పెడుతుంది విశాల భారతానికి ఎవరూ అన్నం పెట్టలేరు. ఆహారంలో స్వావలంబన సాధించిన దేశం మనది. మోదీకి కూడా అదే చెప్పినం. ఎట్టి పరిస్థితుల్లో మనం మన స్థాయిని కోల్పోవద్దు. మన ఆహారాన్ని మనమే సాధించుకోవాలె. వ్యవసాయాన్ని, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను అనుమతించాలె. అప్పుడే 135 కోట్ల పొట్టలు నింపుకోగలుగుతాం. అయితే ఈ విషయంలోనూ కొన్ని నియమాలు పాటిస్తూ ముందుకెళ్లాలి. అందరూ మాస్కులు ధరించాలి అని కేసీఆర్ హితవు పలికారు.

కరోనా వ్యాధి ప్రబలకుండా ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఎక్కడా రాజీపడకుండా 234 చోట్ల కంటెయిన్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 123 ప్రాంతాలు, ఇతర చోట్ల 120 ప్రాంతాలు ఉన్నాయి. కంటెయిన్‌మెంట్‌తో మంచి ఫలితాలు వస్తున్నాయి. అదృష్టవశాత్తూ చికిత్స పొందుతున్న వారు, క్వారంటైన్, కంటెయిన్‌మెంట్‌ ఏరియాలో ఉన్న వారిలో ఏ ఒక్కరూ సీరియస్‌ పరిస్థితుల్లో లేరు. భగవంతుడి దయతో ఎవరికీ ఆక్సిజన్, వెంటిలేటర్‌ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ దశ నుంచి సంక్రమణ తగ్గిపోతే ఏప్రిల్‌ 24 వరకు దాదాపు కోవిడ్‌ బాధితులు ఎవరూ ఉండరు. కొత్త ఉత్పాతం, ఉప్పెన రాకపోతే మనం బయట పడతాం అని కేసీఆర్ ప్రజలకు భరోసా ఇచ్చారు.

తొలి దశలో విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో వైరస్‌ సంక్రమించిన వారిని వంద శాతం డిశ్చార్జి చేశాం. తొలి దశలో క్వారంటైన్‌లో పెట్టిన 25,937 మంది కూడా డిశ్చార్జి అయ్యారు. తాజాగా నమోదైన కేసులను కూడా కలుపుకొని మొత్తంగా శనివారం వరకు 503 పాజిటివ్‌ కేసులు రాగా ఇందులో 14 మంది మరణించారు. ఇండోనేషియన్లు సహా విదేశాల నుంచి వచ్చిన 96 మందిని డిశ్చార్జి చేశాం. ఆస్పత్రుల్లో ప్రస్తుతం 393 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. నిజాముద్దిన్‌ ఘటన తర్వాత మొత్తంగా 1,200 మంది అనుమానితులకు వైద్య పరీక్షలు చేశాం. ప్రస్తుతం 1,654 మంది ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్నారు. ఆస్పత్రికి రెఫర్‌ అవుతున్న కేసుల సంఖ్య కూడా తగ్గింది. రిస్క్‌ తీసుకోకూడదు అనే ఉద్దేశంతో గతంలో ఆచూకీ లభించని వారిని కూడా గుర్తించి పరీక్షలు చేస్తున్నామని కేసీఆర్ తెలిపారు.

మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 11 మంది మరణించిన నేపథ్యంలో మహరాష్ట్రతో ఐదారు వందల కిలోమీటర్ల సరిహద్దు ఉన్న తెలంగాణకు ప్రమాద పరిస్థితులు పొంచి ఉన్నందున మహారాష్ట్ర సరిహద్దును వంద శాతం మూసేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. కాళేశ్వరం మొదలుకొని నిజామాబాద్, ధర్మాబాద్, నాందేడ్, నారాయణఖేడ్‌ వరకు సరిహద్దు ఉండటంతో బంధుత్వాలు, వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. కఠినంగా వ్యవహరిస్తే తప్ప రాష్ట్రాన్ని కాపాడుకోలేమని,  అక్కడి నుంచి వచ్చే నిత్యావసరాలను కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో సమకూర్చుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వివరించారు

కరోనా నియంత్రణలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ మంచి స్థితిలో ఉంది. ప్రధాని కూడా లాక్‌డౌన్‌ విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలను పక్కనపెట్టి యావత్‌ దేశం ఒకే మూసలో పనిచేసింది కాబట్టి కరోనా నియంత్రణలో ఉంది. ఇంకో 10–15 రోజులు రాజకీయాలను పక్కనపెట్టి మనం ముందుకెళ్తే కచ్చితంగా బయటపడే ఆస్కారం ఉందని కేసీఆర్ నమ్మబలికారు.

ఏపీలో స్కూల్స్ బంద్

ఏపీలో స్కూల్స్ బంద్

   13 hours ago


వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

వరంగల్ MGMలో మినిస్టర్ ఈటల ఆకస్మిక తనిఖీ.. డేంజర్ లో ఉందా?

   13 hours ago


జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

జడ్జి రామ కృష్ణకు కరోనా పాజిటివ్.. అనుమానం వ్యక్తం చేస్తున్న కుమారుడు

   17 hours ago


తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

తెలంగాణలో పెరిగిపోతున్న కరోనా కేసులు.. ప్రభుత్వంపై రాములమ్మ ఆగ్రహం

   19 hours ago


అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

అయ్ బాబోయ్ బీజేపీ పై బెట్టింగ్.. అదీ తిరుప‌తిలో

   14 hours ago


“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

“బెంగాల్ లో నా సభలు రద్దు”.. రాహుల్ ప్రకటన

   21 hours ago


ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

ఈ టైంలో అవ‌స‌ర‌మా మేడ‌మ్

   21 hours ago


వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

వేంకటేశ్వరస్వామి నేత్రదర్శనం రోజున వచ్చి రిగ్గింగ్‌పై ప్రమాణం చేయగలరా

   14 hours ago


ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

ఏంది సార్.. మ‌రీ ఇంత దిగజారిపోయారా

   16 hours ago


తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

తిరుపతి ఉప ఎన్నిక రీపోలింగ్ పై వెనక్కు తగ్గని టీడీపీ

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle