newssting
BITING NEWS :
ఎన్డీయేతో బంధం తెంచుకున్న అకాలీదళ్. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులకు వ్యతిరేకంగా అకాలీదళ్ నిర్ణయం. ఈ బిల్లుల ప్రభావం రైతులు, దళితులు, రైతు కూలీల అందరిపై పడిందని తెలిపిన అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రకటన. శనివారం పార్టీ నిర్వహించిన మూడు గంటల ఎమర్జెన్సీ కోర్ కమిటీ సమావేశం అనంతరం నిర్ణయం. 23 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెగతెంపులు చేసుకున్న అకాలీదళ్ * బాలీవుడ్‌ వివాదాస్పద నటి కంగనా రనౌత్‌పై కర్ణాటకలోని తుమకూరు కోర్టులో కేసు దాఖలు. కేంద్ర ప్రభుత్వ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చుతూ ట్వీట్‌ చేయడాన్ని తప్పుబడుతూ తుమకూరు జేఎంఎఫ్సీ కోర్టులో రమేశ్‌ నాయక్‌ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు * అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఎన్‌ఎల్‌యూ వైస్‌ చాన్సలర్‌గా వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రొఫెసర్‌ పి.శ్రీకృష్ణదేవరావు నియామకం. ప్రస్తుత వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రణబీర్‌ సింగ్‌ పదవీ విరమణ చేయడంతో శ్రీకృష్ణదేవరావు నియామకం. దేశంలోని పలు విశ్వవిద్యాలయాలలో కీలక బాధ్యతలు నిర్వహించిన శ్రీకృష్ణదేవరావు న్యాయ విద్యలో మార్పులు తీసుకువచ్చేందుకు యూజీసీ నియమించిన నిపుణుల కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా కూడా పనిచేశారు * శివసేన నేత, లోక్ సభ సభ్యుడు సంజయ్‌ రౌత్‌, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఓ స్టార్ హోటల్ లో రహస్యంగా భేటీ అయినట్టు గుప్పుమన్న వార్తలు. ఓ లగ్జరీ హోటల్‌ లో సుమారు గంటన్నర పాటు వీరిమధ్య చర్చలు జరిగినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన ఈ సమావేశం వార్తలు. ఈ సమావేశం నిజమేనని, దీని వెనుక రాజకీయ కారణాలు లేవని స్పష్టం చేసిన బీజేపీ * అమెరికాలోని హిందూఆధ్యాత్మిక గురువు స్వామి ప్రత్యాగ్‌బోధానంద కన్నుమూత. పెన్సిల్వేనియాలో అర్ష విద్యా గురుకులానికి ఉపాధ్యక్షులుగా ఉన్న ప్రత్యాగ్‌బోధానంద వయసు 69 సంవత్సరాలు. గురుకులం 34వ వార్షిక ఉత్సవాల్లో పాల్గొన్న తర్వాత తీవ్రమైన గుండెపోటు రావడంతో ఈనెల 20తేదీన తుదిశ్వాస విడిచినట్టు తెలిపిన ఆయన శిష్యులు. ప్రత్యాగ్‌బోధానంద పార్థివదేహాన్ని భారత్‌కు తరలింపుకు ప్రయత్నాలు * పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకి వ్యతిరేకంగా పంజాబ్‌లో కొనసాగుతున్న రైల్‌ రోకో ఆందోళన. గత మూడు రోజులుగా రైతులు రైలు పట్టాలపై కూర్చొని నిర్వహిస్తున్న రైల్‌ రోకో. తొలుత కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్ కమిటీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే, ఆ తర్వాత మద్దతు ప్రకటించిన వివిధ సంఘాలు * బాలీవుడ్‌ పరిశ్రమలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్‌ వ్యవహారం. దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్‌, సారా అలీఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో ఎదుట శనివారం హాజరు. వేర్వేరుగా ఐదు గంటలకు పైగా కొనసాగిన విచారణ. నటీమణుల వాగ్మూలాన్ని రికార్డు చేసిన ఎన్సీబీ * ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రలలో పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో అక్కడక్కడా నిలిచిన రాకపోకలు. పలుచోట్ల నీటమునిగిన పంట పొలాలు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నందిగామలో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు * అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్లు తెరిచేందుకు అనుమతినిచ్చిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పరిస్థితులను గాడిలో పెట్టేందుకు అక్టోబరు 1 నుంచి సినిమా థియేటర్ల తెరిచేందుకు అనుమతినిస్తున్నామని, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యాజిక్ షోలు నిర్వహించేందుకు కూడా అనుమతినిస్తున్నామని ట్వీట్ * నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన రౌడీషీటర్ దారుణ హత్య మరువక ముందే చోటు చేసుకున్న మరో ఘటన. చిల్లకూరు మండలం కలవకకొండలో చేజర్ల సుబ్రహ్మణ్యం(38) అనే వ్యక్తి దారుణ హత్య. ఆదివారం ఉదయం అతి కిరాతకంగా చంపేసిన గుర్తు తెలియని వ్యక్తులు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు * సంగారెడ్డిలో వాగు దాటుతున్న వ్యక్తి వరద నీటిలో గల్లంతు. భారీ వర్షాలకు వాగు దాటుతున్న ముగ్గరు వ్యక్తులు గల్లంతవ్వగా ఇద్దరు వ్యక్తులను ఒడ్డుకు చేర్చిన స్థానికులు. కంగ్టి మండలం జంగి బికి చెందిన 55 ఏళ్ల మంగలి మారుతి కాకి వాగు వరద ఉధృతిలో గల్లంతు. మారుతి ఆచూకీ కోసం మండల రెవెన్యూ అధికారుల గాలింపు చర్యలు.

ఏపీ మద్యనిషేధంతో తెలంగాణకు కాసుల వర్షం

16-10-201916-10-2019 14:15:05 IST
Updated On 16-10-2019 17:15:02 ISTUpdated On 16-10-20192019-10-16T08:45:05.360Z16-10-2019 2019-10-16T08:44:57.089Z - 2019-10-16T11:45:02.151Z - 16-10-2019

ఏపీ మద్యనిషేధంతో తెలంగాణకు కాసుల వర్షం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన మద్యం విధానం ద్వారా అమలు చేస్తున్న సంపూర్ణ మద్యనిషేధం తెలంగాణకు ప్రభుత్పానికి కూడా కాసుల వర్షం కురిపించనుంది. ఏపీ ప్రభుత్వం ప్రేరణతో తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్తగా మద్యం షాపులను ప్రారంభించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తూ కొత్త మద్యవిదానాన్ని ప్రారంభించింది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంపూర్ణ మద్యనిషేధం వైపుగా మద్యం అమ్మకాలపై పలు ఆంక్షలను విధించింది. దీంతో మద్యం వ్యాపారులు గంపగుత్తగా తెలంగాణకు వెళ్లిపోయారు.  దీంతో ఆంధ్రా తెలంగాణ సరిహద్దు గ్రామాలు తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మారాయి. ఎందుకంటే తెలంగాణ ఎక్సైజ్ శాఖ లిక్కర్ షాపులకోసం భారీ సంఖ్యలో దరఖాస్తులను అందుకుంది.

ఏపీకి సరిహద్దుల్లో ఉన్న తెలంగాణ మండల ప్రధాన కార్యాలయాలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి నూతన లక్ష్యాలుగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు మద్యం లభ్యతపై ఆంక్షలున్నాయి. ఏపీలో ప్రభుత్వ మద్యం షాపులు రాత్రి 8 గంటలు కాగానే షాపులను బంద్ చేయాలని కొత్త మద్య విధానం ఆదేశించింది. 

రాత్రి 8 గంటల తర్వాత బార్లలో తప్పితే ఏపీలో మద్యం దొరకదు. తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న ఆంధ్ర గ్రామాల్లో బార్లు లేవు. దీంతో మద్యం దొరక్క అల్లాడిపోయే ఏపీ జనాలకు సరిహద్దు గ్రామాల్లో మరిన్ని లిక్కర్ షాపులు ప్రారంభించడం ద్వారా కోరినంత మద్యం సరఫరాకు తెలంగాణ ప్రభుత్వం పూనుకుంటోంది.

ఎంకి పెళ్లి సుబ్బడి చావు కొచ్చిందంటే ఇదేనేమో.. లేదా ఎంకి చావు సుబ్బడి పెళ్లి కొచ్చింది అని సామెతను తిరగరాసుకోవాలేమో. సదుద్దేశంతో ఏపీ ప్రభుత్వం మద్యం  సరపరా సమయాలపై విధించిన ఆంక్షలను తెలంగాణ ప్రభుత్వం ఇలా సొమ్ము చేసుకుంటుందన్నమాట. 

ప్రతిమండలంలోనూ రెండు లేక మూడూ లిక్కర్ షాపులను తెరవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మద్యం షాపు తెరవాలంటే కనీనం 30 వేల జనాభా ఉండాలన్ని నియమాన్ని కూడా తగ్గించి 15 లేక 20 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో కూడా లిక్కర షాపులను తెరుచుకోవచ్చని నియమాలను సడలించే ఆలోచన చేస్తున్నట్లుంది. 

అంటే ఆంధ్రప్రదేశ్‌లో మద్యనిషేధంద్వారా తగ్గిపోనున్న మద్యం ఆదాయంపై తెలంగాణ కన్నేసిందన్నమాట. ఇరురాష్ట్రాల సీఎంల మధ్య స్నేహాలు, ఆప్యాయతలు మధ్యం అమ్మకాల విషయంలో గాలికి ఎగిరిపోతున్నాయన్న మాట. ఏడన్నా బావ కానీ వంగతోట కాడ కాదు అనే సామెత ఊరికినే పుట్టలేదు కదా మరి.

 

చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు..  కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు.. కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

   11 hours ago


గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

గ్రేటర్ వరద ప్రాంతాలలో రేవంత్ పర్యటన.. కారుని ఢీ కొడతారా?

   12 hours ago


ఏపీకి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాలో కొత్త పుంత‌లు

ఏపీకి మ‌ద్యం అక్ర‌మ ర‌వాణాలో కొత్త పుంత‌లు

   13 hours ago


యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన 'రవికిషన్'

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన 'రవికిషన్'

   13 hours ago


బీజేపీలో పురందేశ్వ‌రికి కీల‌క ప‌ద‌వి... సామాజిక స‌మీక‌ర‌ణే ఎజెండా

బీజేపీలో పురందేశ్వ‌రికి కీల‌క ప‌ద‌వి... సామాజిక స‌మీక‌ర‌ణే ఎజెండా

   14 hours ago


అంబటి భూకబ్జా లీకులు.. సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా?

అంబటి భూకబ్జా లీకులు.. సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా?

   14 hours ago


ఎన్‌డీఏకు అకాలీదళ్‌ గుడ్‌బై.. రైతు వ్యతిరేక బిల్లులపై విభేదం

ఎన్‌డీఏకు అకాలీదళ్‌ గుడ్‌బై.. రైతు వ్యతిరేక బిల్లులపై విభేదం

   15 hours ago


డీకే అరుణకి జాతీయ పదవి.. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్?

డీకే అరుణకి జాతీయ పదవి.. రెడ్డి సామాజికవర్గంపై బీజేపీ టార్గెట్?

   15 hours ago


ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పంటనష్టం

ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. పంటనష్టం

   17 hours ago


తెలంగాణలో ఆడపిల్లను లక్ష్మిలా కొలుస్తున్నారు.. మంత్రి హరీష్ రావు

తెలంగాణలో ఆడపిల్లను లక్ష్మిలా కొలుస్తున్నారు.. మంత్రి హరీష్ రావు

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle