newssting
BITING NEWS :
*గుజరాత్‌: సూరత్‌లో దారుణం.. కార్పొరేషన్ ట్రైనీ ఉద్యోగినులను గుంపులో నగ్నంగా నిలబెట్టి ఫిట్‌నెస్ పరీక్ష *నేడు తెలంగాణలో డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల... ఈ నెల 25న డైరెక్టర్ పదవులకు నామినేషన్లు, 29న ఛైర్మన్, ఉపాధ్యక్ష ఎన్నికలు *అమరావతి: వైఎస్ జగన్‌ సర్కార్‌ మరో కీలక నిర్ణయం.. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణకు సిట్ ఏర్పాటు.. ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి నేతృత్వంలో 10 మంది సభ్యులతో సిట్ *హైదరాబాద్: బంజారాహిల్స్ లో డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు.. విదేశీయుల హల్చల్, పోలీసులతో వాగ్వాదం.. పాస్ పోర్టు, వీసా పత్రాలు చూపకపోవడంతో పోలీసులకు అప్పగింత *అమరావతి: నేడు 29 గ్రామాల్లో బంద్‌కు పిలుపునిచ్చిన రైతుల జేఏసీ.. మందడంలో పోలీసుల లాఠీఛార్జ్‌కి నిరసనగా బంద్, విద్యా, వ్యాపార సంస్థలను బంద్‌ పాటించాలని కోరిన జేఏసీ

ఏపీ దీనపరిస్థితి హైదరాబాద్ రియల్టర్లకు కామెడీ..!

30-12-201930-12-2019 11:56:12 IST
Updated On 30-12-2019 12:19:33 ISTUpdated On 30-12-20192019-12-30T06:26:12.224Z30-12-2019 2019-12-30T06:26:09.863Z - 2019-12-30T06:49:33.896Z - 30-12-2019

ఏపీ దీనపరిస్థితి హైదరాబాద్ రియల్టర్లకు కామెడీ..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ప్రస్తుత పరిస్థితి సగటు తెలుగు ప్రజలందరికీ తెలిసిందే. రాజధాని అమరావతి అని యావత్ ఆంధ్ర ప్రజానీకం మానసికంగా సిద్ధమైపోయారు. రాజధాని ఎప్పటికి పూర్తవుతుంది.. ఎలా ఉంటుందన్నది అంచనా వేయలేకపోయినా ఏపీ రాజధాని అంటే అమరావతి అని ప్రపంచం మొత్తం గుర్తింపు వచ్చేసింది. కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితిలు పూర్తిగా మారిపోయాయి. దీంతో రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది.

ఒకపక్క రాయలసీమ వాసులు ఒక్క హైకోర్టు చాలదు.. రాజధానికి వెళ్లాలంటే మేము వందల కిమీ వెళ్ళాలా? గతంలో రాజధానిని వదులుకున్న మాకే పూర్తిస్థాయి రాజధాని కావాలని డిమాండ్లు చేస్తున్నారు. అమరావతిలో ఆందోళనలు అట్టుడికిపోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రానికి పెట్టుబడులు రావడం కలగానే భావించాలి. ఈ పరిస్థితి ఎప్పటికి చక్కబడుతుంది అన్నది కూడా ఎవరూ చెప్పలేని పరిస్థితి.

ఏపీలో పరిస్థితిలు ఇలా ఉండడం తెలంగాణ రాష్ట్రానికి వరంగా మారింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్తగా స్థిర నివాసం ఏర్పరుచుకోవాలనే తెలుగు వారి చూపు హైదరాబాద్ నగరంపై పడిందని రియల్టర్లు వెల్లడిస్తున్నారు. ఈక్రమంలోనే హైదరాబాద్ నగరంలో రియల్ వ్యాపారం.. నిర్మాణ రంగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. ఏపీలో ఇసుక కొరత కారణంగా ఆర్ధిక మాంద్యంలో కూడా హైదరాబాద్ లో వ్యాపారం ఏం మాత్రం తగ్గుముఖం పట్టలేదు.

ఇక ఏపీలో ఇప్పుడున్న రాజధాని పరిస్థితిలు హైదరాబాద్ రియల్ రంగానికి వరంగా మారిపోయింది. ఈ మాట అన్నది కూడా ఎవరో కాదు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన క్రెడాయ్ తెలంగాణ సమావేశంలో హరీష్ ఈ మాట అన్నారు. అది కూడా కాస్త వెటకారంతో కూడిన స్వరంతో రియల్ వ్యాపారులతో ఏపీలో పరిస్థితిలు చూస్తున్నారుగా అంటూ కళ్ళతో సైగలు చేశారు.

మంత్రి హరీష్ రావు కళ్ళతోనే వెటకారం చేస్తే ఎదురుగా ఉన్న రియల్టర్లంతా ఒక్కసారిగా భళ్ళున నవ్వేశారు. ఏపీలో పరిస్థితి వీళ్ళకి వెటకారంగా మారినా అక్కడ పరిస్థితి మాత్రమే నిజమే అనిపిస్తున్నాయి. బుద్ది ఉన్న వ్యాపారాలు ఎవరైనా ఏపీలో పెట్టుబడులు పెడతారా అని చెప్పకనే చెప్పిన ఈ సంఘటన సారాంశం నిజమే కదా అనే భావన కనిపిస్తుంది.

ప్రస్తుతానికి ఏపీకి ఆదాయం తెచ్చే రాజధాని కానీ.. అవకాశాలను సృష్టించే నగరంకానీ.. ఉపాధి లభించే ప్రాంతం కానీ లేదు. మరో తెలుగు రాష్ట్రం కావడం.. హైదరాబాద్ మొన్నటివరకు ఏపీ ప్రజలకు కూడా సొంతమని భావన కలిగి ఉండడం ఇప్పుడు హైదరాబాద్ నగరానికి వరంగా మారింది. ఈ పరిస్థితిని గమనించే తెలంగాణ ప్రభుత్వం కూడా బిజినెస్ ఫ్రెండ్లీగా ఉండడంతో అడ్డే లేకుండాపోతుంది.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ లోనే వ్యాపార అవకాశం.. ఉపాధి అన్నీ ఇక్కడే వెతుక్కోవడంతో ఇప్పట్లో మళ్ళీ ఏపీలో పెట్టుబడులకు నమ్మకం కలిగించడం అంటే మామూలు విషయం కాదన్నా అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో పరిస్థితిలు హైదరాబాద్ వ్యాపారులకు కామెడీగా మారిపోయింది.

 

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

12 రోజులు గ‌డుస్తున్నా వీడ‌ని మిస్సింగ్ మిస్ట‌రీ..!

   2 hours ago


‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

‘‘ప్రతి మునిసిపాలిటీకి పుష్కలంగా నిధులిస్తాం’’

   2 hours ago


మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

మ‌ళ్లీ ల‌క్ష్మ‌ణ్.. లేదంటే సంజ‌య్‌..?

   3 hours ago


బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

బాబుపై బురద చల్లడం మానుకోండి.. టీడీపీ నేతల హితవు

   4 hours ago


రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక.. కేసీఆర్ మనసులో ఉన్నదెవరు?

   5 hours ago


రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

రష్మికపై కామెంట్లు.. కలెక్టర్‌ అకౌంట్ హ్యాక్.. వివాదం

   5 hours ago


ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న 'సిట్'!

   7 hours ago


మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

మహారాష్ట్రలోనూ దిశ చట్టం.. ఏపీ ప్రభుత్వంపై ప్రశంసలు

   7 hours ago


పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

పీసీసీ పీఠంపై కోమటిరెడ్డి ఆశ.. సోనియా కరుణిస్తారా?

   8 hours ago


కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

కేసీఆర్ అసంతృప్తితో వున్నారా? కేబినెట్లో మార్పులు తథ్యమా?

   9 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle