newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏపీ తెలంగాణల్లో భారీవర్షాలకు అవకాశం

11-06-202011-06-2020 08:40:57 IST
2020-06-11T03:10:57.198Z11-06-2020 2020-06-11T03:10:45.245Z - - 11-04-2021

ఏపీ తెలంగాణల్లో భారీవర్షాలకు అవకాశం
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. తాజాగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రానున్న 48గంటల్లో అది పశ్చిమ వాయవ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఇప్పటికే కోస్తాలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని.. విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా వానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. 

ఇటు రుతు రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తుండటంతో వర్షాలు మొదలయ్యాయి.మంగళవారం కోస్తా, రాయలసీమల్లోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడ్డాయి.విశాఖపట్నం, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు వీచాయి. గుంటూరు, పశ్చిమ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కూడా వర్షాలు కురిశాయి. వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు జరిగాయి. సుచిత్ర, కొంపల్లి, కుత్బుల్లాపూర్, షాపూర్ నగర్, జీడీమెట్ల, సురారం, దూలపల్లి, బహదూర్ పల్లి, బాలానగర్, కూకట్ పల్లి ,ముసాపేట,జేఎన్టీయూ, నిజాంపేట, జూబ్లీహిల్స్ లో భారీ వర్షం కురవడంతో రోడ్లు జలమయం అయ్యాయి. అక్కడక్కడా చెట్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో  క్షేత్రస్థాయి బృందాలను అధికారులు అప్రమత్తం చేశారు 

సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, ఉమ్మడి మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా పొచ్చర్లలో 12సెంటిమీటర్ల వర్షం పడింది. అలాగే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో 7 సెంటిమీటర్లు, ఆదిలాబాద్ జిల్లా సొనాలలో 6 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా పాపన్నపేటలో 6 సెంటీమీటర్లు వర్షం కురిసింది.

హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లిలో 4.5 సెంటిమీటర్ల వర్షం పడింది. బాలానగర్ లో 3.5, కూకట్ పల్లిలో 3 సెంటిమీటర్ల వర్షం పడింది. నైరుతి రుతుపవనాల వల్ల రాష్ట్రంలో వర్షాలు పడతాయంటోంది వాతావరణ శఆఖ.  మహబూబ్ నగర్,  నారాయణపేట,  జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూలు,  వనపర్తి, నల్గొండ, సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు పడొచ్చని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపు ఒకటి, రెండు చోట్ల భారీ వానలు పడతాయని చెప్పారు.పిడుగులు పడే అవకాశం కూడా ఉందని జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది. 

 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   14 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   10 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   13 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   17 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   20 hours ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   21 hours ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle