newssting
BITING NEWS :
* భారత్ లో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులు 1, 45, 380.. మరణాలు 4167*ఏపీలో 2719 మృతులు 57, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1920 * కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భారత్ కు చైనా సహకారం యథాతథం * మహారాష్ట్రలో 1695 కోవిడ్ మరణాలు.. కేసులు 17,082*భారత్ లో వారం రోజుల్లో 45 వేల కేసులు *ఏపీలో భారీగా పట్టుబడుతున్న తెలంగాణా మద్యం*హైకోర్టుకు చేరిన ఏపీ వికేంద్రీకరణ, సీఆర్డీఏ సవరణ బిల్లు వ్యవహారం*సిద్దిపేట:కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం ముహూర్తం ఖరారు..ఈనెల 29న ఉ. 11:30 గంటలకు ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ *జార్ఖండ్ లో ఘోర ప్రమాదం ఐదుగురి మృతి

ఏపీ, తెలంగాణల్లో కేసుల రెట్టింపు సమయం పెరుగుతోంది.. కేంద్రం వెల్లడి

21-04-202021-04-2020 08:10:58 IST
Updated On 21-04-2020 09:22:04 ISTUpdated On 21-04-20202020-04-21T02:40:58.664Z21-04-2020 2020-04-21T02:40:56.577Z - 2020-04-21T03:52:04.575Z - 21-04-2020

ఏపీ, తెలంగాణల్లో కేసుల రెట్టింపు సమయం పెరుగుతోంది.. కేంద్రం వెల్లడి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు రెట్టింపు కావడానికి పడుతున్న సమయం జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంటోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా నివారణ, నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటూ వాటిని అమలు చేసేందుకు ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. జాతీయ సగటు కంటే ఎక్కువ సమయాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకోవడం రెండు రాష్ట్రాల కృషికి సంకేతమనే చెప్పాలి.

కరోనా కేసుల సంఖ్య రెట్టింపు అయ్యేందుకు పడుతున్న సమయం క్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. జాతీయ సగటు 7.5 రోజులు ఉండగా.. తెలంగాణలో 9.4 రోజులు, ఏపీలో 10.6 రోజులు ఉందని వివరించింది. జాతీయ సగటు కంటే ఎగువన 18 రాష్ట్రాలు ఉన్నాయని తెలిపింది. కరోనా నివారణ, నియంత్రణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటూ వాటిని అమలు చేసేందుకు ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నట్లు తెలిపింది.

దేశంలో లాక్‌ డౌన్‌కు ముందు కేసుల రెట్టింపునకు అతి తక్కువగా 3.4 రోజులు పట్టేదని, ఏప్రిల్‌ 19 నాటికి అది 7.5కి చేరిందని తెలిపింది. రెట్టింపు రేటు 20 రోజుల కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ– 8.5 రోజులు, కర్ణాటక– 9.2 రోజులు, తెలంగాణ– 9.4 రోజులు, ఆంధ్రప్రదేశ్‌– 10.6 రోజులు, జమ్మూ కశ్మీర్‌– 11.5 రోజులు, పంజాబ్‌– 13.1 రోజులు, ఛత్తీస్‌గఢ్‌ – 13.3 రోజులు, తమిళనాడు– 14 రోజులు, బిహార్‌– 16.4 రోజులుగా ఉంది. 

రెట్టింపు రేటు 20 రోజుల నుంచి 30 రోజుల మధ్య ఉన్న వాటిలో అండమాన్‌ నికోబార్‌– 20.1 రోజులు, హరియాణా– 21 రోజులు, హిమాచల్‌ ప్రదేశ్‌– 24.5 రోజులు, చండీగఢ్‌– 25.4 రోజులు, అస్సాం– 25.8 రోజులు, ఉత్తరాఖండ్‌– 26.6 రోజులు, లడఖ్‌– 26.6 రోజులుగా ఉంది. 

రెట్టింపు రేటు 30 రోజుల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒడిశా– 39.8 రోజులు, కేరళ– 72.2 రోజులుగా ఉంది. గోవాలో కరోనా రోగులందరూ కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని తెలిపింది. మహే (పుదుచ్చేరి), కొడగు (కర్ణాటక) – పౌడిగర్వాల్‌ (ఉత్తరాఖండ్‌)ల్లో గత 28 రోజులలో కేసులు నమోదు కాలేదు.  

ఇకపోతే గోవా, మణిపూర్ జీరో కేసులను నమోదు చేసి దేశం మొత్తంలో తొలి స్థానాల్లో నిలిచాయని కేంద్రం ప్రకటించింది,

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

ఏపీలో మాల్స్, జ్యూయలరీ, ఫుడ్ టేక్ అవేలకు అనుమతి

   an hour ago


రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

   an hour ago


ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

ఆన్ లైన్లో మహానాడు.. జూమ్ యాప్ ద్వారా 14వేలమందికి అవకాశం

   an hour ago


కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

కరువు సీమకు నీటిని ఇస్తామంటే ఇంతవివాదమా.. జగన్ ప్రశ్న

   2 hours ago


లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

లాక్ డౌన్‌పై కేసీయార్ కీలక నిర్ణయం

   2 hours ago


కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

కన్నాపై మంత్రి వెల్లంపల్లి హాట్ కామెంట్స్

   3 hours ago


ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై బండి సంజ‌య్ ఆశ‌లు నెర‌వేరేనా..?

   3 hours ago


హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

హైకోర్టు ఆగ్రహం.. 49 మంది వైసీపీ నేతలకు నోటీసులు!

   4 hours ago


తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

తెలంగాణలో వైరస్ ఉధృతి.. టెస్టులు తక్కువ.. కేసులు ఎక్కువ!

   4 hours ago


ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

ఎల్జీ పాలిమర్స్‌‌కు షాక్.. ప్లాంట్‌‌లోకి ఎంట్రీకి సుప్రీం నో

   17 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle