newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏపీలో 30 వేలు.. తెలంగాణలో 9 వేలు.. పరీక్షల్లో తేడాపై హైకోర్టు గుస్సా

29-07-202029-07-2020 15:42:07 IST
2020-07-29T10:12:07.706Z29-07-2020 2020-07-29T10:11:58.738Z - - 15-04-2021

ఏపీలో 30 వేలు.. తెలంగాణలో 9 వేలు.. పరీక్షల్లో తేడాపై హైకోర్టు గుస్సా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రతి పది లక్షల జనాభాకు 30 వేలనుంచి 46 వేల కరోనా కేసులను పరీక్షిస్తుండగా తెలంగాణలో పదివేల లోపు పరీక్షలు మాత్రమే చేయడంలోని మతలబు ఏంటని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించింది. రాష్ట్రంలో 54 వేల కరోనా కేసులు నమోదైనప్పటికీ పరీక్షల సంఖ్య ఎందుకు తగ్గుతోందని హైకోర్టు నిలదీసింది. రాజస్తాన్‌లో కరోనా కేసుల సంఖ్య 35,909 ఉండగా ప్రతి 10 లక్షల జనాభాకు 17,833 మందికి పరీక్షలు చేస్తున్నారని, తెలంగాణలో 54,059 కేసులున్నా కేవలం 9,496 టెస్టులే చేస్తున్నారెందుకని ప్రశ్నించింది. ఢిల్లీలో ప్రతి పదిలక్షల జనాభాకు 46 వేలు, ఏపీ, తమిళనాడుల్లో 30 వేల చొప్పున పరీక్షలు చేస్తున్నారని, ఈ తరహాలోనే తెలంగాణలోనూ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. 

కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో రాష్ట్రప్రభుత్వం ఐసీఎంఆర్, డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేయాలని స్పష్టం చేసింది. కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య భారీగా పెంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కరోనా నియంత్రణలో తీసుకోవాల్సిన చర్యలు, డాక్టర్లు ఇతర సిబ్బందికి పీపీఈ కిట్లు ఇవ్వాలని, ప్రైవేటు ఆసుపత్రుల్లో 50 శాతం బెడ్స్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశించాలని దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. 

ధర్మాసనం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, వైద్య ఆరోగ్య శాఖ, మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శులు, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌లు వ్యక్తిగతంగా వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. గత 2 నెలల కాలంలో  తామి చ్చిన ఆదేశాలను అమలు చేయడం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం సోమేష్‌కుమార్‌ను ప్రశ్నించింది. 

ఒక్క హైదరాబాద్‌లోనే 23వ తేదీన 50 కరోనా శవ దహనాలు జరిగినట్లు ఒక పత్రిక కథనంలో పేర్కొన్న విషయం తన దృష్టికి వచ్చిందని,  కానీ, ఆరోజు ఇచ్చిన హెల్త్‌ బులెటిన్‌లో కేవలం 8 మంది మాత్రమే కరోనా రోగులు మరణించినట్లు పేర్కొన్నారని ధర్మాసనం గుర్తు చేసింది.. బహుశా, హైదరాబాద్‌లో మరింతమంది చనిపోతున్నారని, ప్రభుత్వం ప్రకటించే మరణాలు స్వల్పంగా ఉన్నట్లు ఆ కథనాన్ని బట్టి తెలుస్తోందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. 

ఆ వార్తా కథనంలోని అంశాలు నిజమైతే, మరణాలకు సంబంధించి మనం సరైన లెక్కలను బయట పెడుతున్నట్లు భావించొచ్చా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. కరోనా మరణాలకు సంబంధించి ప్రజలకు మనం సరైన గణాంకాలను అందించకపోతే, విధ్వంసం ఏ స్థాయిలో ఉందో తెలిసే అవకాశమే లేదని వ్యాఖ్యానించారు. పత్రికా కథనంలో ప్రస్తావించిన అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్సిని ధర్మాసనం ఆదేశించింది.

తెలుగు దినపత్రికలో వచ్చిన ఈ వార్తను తర్జుమా చేయించుకుని మరీ చదివిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌  మంగళవారం నాటి విచారణలో సీఎస్‌ సోమేష్ కుమార్‌ని నిలదీశారు. 38 మృతదేహాలకు ఈఎస్ఐ శ్మశాన వాటికలో కరోనా ప్రోటోకాల్‌ ప్రకారం దహన సంస్కారాలు చేశారని, మృతదేహాలను తరలించిన అంబులెన్సు డ్రైవర్లు సైతం పీపీఈ కిట్లు వేసుకున్నారని, కుటుంబ సభ్యులు వేరుగా వాహనాల్లో వచ్చారని కథనంలో పేర్కొన్నారని ప్రస్తావించారు. విచారణకు ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారని, దానిపై వారు వివరణ ఇస్తారని వ్యాఖ్యానించారు.

పరీక్షలు, బులెటెన్లపై ఆదేశాలను అమలు చేయరా?

కొవిడ్‌-19 చికిత్స, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, రోజువారీ బులెటిన్లకు సంబంధించి పదే పదే ఆదేశాలు ఇస్తున్నా ఎందుకు అమలు చేయలేకపోతున్నారని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. వైద్యులకు, పారామెడికల్‌ సిబ్బందికి పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు ఇవ్వాలని, మృతదేహాలకు కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని కోరుతూ విశ్రాంత ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, తదితరులు దాఖలు చేసిన 16 ప్రజాహిత వ్యాజ్యాలను ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ వ్యాజ్యంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి దాఖలు చేసిన నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. తాము ఇచ్చిన పలు ఆదేశాలను ఇంకా అమలు చేయడం లేదని తప్పుబట్టింది. 

ఇందుకు, సీఎస్‌ బదులిస్తూ.. కోర్టులపై తమకు అపారమైన గౌరవముందని, కోర్టు ఇచ్చిన అన్ని ఆదేశాలను తప్పక పాటిస్తామని అన్నారు. పూర్తి ఆదేశాలు పాటించేందుకు రెండు వారాలు గడువు కావాలని కోరారు. తప్పక అమలు చేస్తామని హామీ ఇస్తున్నందున కోర్టు ఆదేశాలు పాటిస్తారని భావిస్తున్నామని ధర్మాసనం పేర్కొంటూ విచారణను ఆగస్టు 13కి వాయిదా వేసింది. ఆరోజు కూడా సీఎస్‌ సహా సంబంధిత అధికారులు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఐసీఎంఆర్, కేంద్ర ప్రభుత్వ నిబంధనలను మరింత జాగ్రత్తగా పాటించాలి. అవసరమైతే తప్ప బయటకు రాకూడదు. వచ్చినా మాస్కు పెట్టుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. సానిటైజర్‌ను వెంటపెట్టుకోవాలి. కరోనా మరింత మందికి వ్యాప్తి చెందకుండా అప్రమత్తంగా వ్యవహరించాలి’’అని ధర్మాసనం ఆదేశించింది. 

కరోనా కట్టడికి మానవ సాధ్యమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని సీఎస్‌ సోమేష్‌కుమార్‌ నివేదించారు. ఏ సమాచారాన్ని రహస్యంగా పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం శాయశక్తులా పనిచేస్తోందని తెలిపారు. కొందరు జిల్లా కలెక్టర్లు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, ఇతర సిబ్బంది కరోనా బారినపడినా ఆత్మస్థైర్యం కోల్పోకుండా కరోనా కట్టడికి, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపడతున్నామని వివరించారు. హైకోర్టు ఆదేశాలను రెండు వారాల్లో పూర్తిగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 

 

నా రూటే సెప‌రేటు

నా రూటే సెప‌రేటు

   10 minutes ago


బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   14 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   18 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   16 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle