newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏపీలో కరోనా కలవరం.. రాజమహేంద్రవరంలో హై అలర్ట్

22-03-202022-03-2020 09:29:52 IST
2020-03-22T03:59:52.688Z22-03-2020 2020-03-22T03:56:52.001Z - - 16-04-2021

ఏపీలో కరోనా కలవరం.. రాజమహేంద్రవరంలో హై అలర్ట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఒక్కసారిగా జిల్లా వాసులు లో అలజడి మొదలైంది.రాజమండ్రి విరభద్రపురం కు చెందిన యువకునికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అవ్వడంతో ..యువకుని ఇంటి వద్దకు చేరుకుని రాత్రి నుండి అక్కడే ఉన్న వైద్య శాఖ అధికారులు చుట్టూ పక్కలకు ఎవ్వరు వెళ్లకుండా...రంగం లోకి దిగిన స్పెషల్ టీం కాలనికి నాలుగు ప్రక్కల భారికెట్లు ఏర్పాటు రాజమహేంద్రవరం లో హై అలెర్ట్ ప్రకటించారు. 

జనతా కర్ఫ్యూ కు స్వచ్ఛంద సిద్ధమైన తూర్పుగోదావరి జిల్లా వాసులు. జనతా కర్ఫ్యూ నేపథ్యంలో ముందుగానే నిత్యావసరాలు, కూరగాయలు సమకూర్చుకున్నారు. ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు కొనసాగనుంది జనతా కర్ఫ్యూ. జనతా కర్ఫ్యూ ను విజయవంతం చేసేందుకు యంత్రాంగం ప్రయత్నాలు చేసిది.

ఇప్పటికే కరోనా, జనతా కర్ఫ్యూ లపై ప్రజలకు అవగాహన కల్పించింది జిల్లా యంత్రాంగం.  జనతా కర్ఫ్యూ అమలు కోసం జిల్లా ఎస్పీ నయీమ్ అద్నాన్ హస్మి నేతృత్వం లో ని 18 మంది జిల్లా స్థాయి అధికారులతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేశారు. జనతా కర్ఫ్యూ సందర్భంగా డిపోలకే పరిమితమయ్యాయి  858 ఆర్టీసీ  బస్సులు. జనతా కర్ఫ్యూ తరువాత కూడా వారం రోజుల పాటు కొనసాగనుంది వాణిజ్య సముదాయాల మూసివేత. వారం రోజుల పాటు నిత్యావసరాలు, మెడికల్ షాపులు మినహా మిగిలిన వ్యాపార,వాణిజ్య సముదాయాలు మూసివేయాలని కార్మిక శాఖ అధికారుల ఆదేశాలిచ్చారు, 

విజయవాడలో తొలి పాజిటివ్‌ కేసు శనివారం నమోదైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు ఐదుకు చేరుకున్నాయి. విజయవాడ పాతబస్తీలోని మేకలవారి వీధికి చెందిన ఓ యువకుడు కొన్నేళ్లుగా ప్యారి్‌సలో విద్యాభ్యాసం చేస్తున్నాడు. వారం క్రితం ప్యారిస్‌ నుంచి ఢిల్లీ చేరుకొని అక్కడినుంచి విజయవాడ వచ్చాడు.

స్థానికులు సమాచారం ఇవ్వడంతో గురువారం రాత్రి వైద్యబృందాలు వచ్చి అతడిని క్వారంటైన్‌కు తరలించారు. అతడినుంచి సేకరించిన నమూనాలను పరీక్షలకు పంపగా శనివారం రాత్రి పాజిటివ్‌ అని తేలింది. దీంతో అతను తిరిగిన ప్రాంతాలు, వారి బంధువులకు పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇటు జనతా కర్ఫ్యూలో విశాఖ నగరం నిర్మానుష్యంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే ఎన్ ఏ డి జంక్షన్ జనం లేక వెలవెలబోతోంది. రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. స్వచ్చందంగా వ్యాపారులు జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు. బీచ్ కి కూడా ఎవరూ వెళ్లడం లేదు. 

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   26 minutes ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   12 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   21 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   a day ago


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle