newssting
BITING NEWS :
*న్యూస్ స్టింగ్ వీక్షకులకు, శ్రేయోభిలాషులకు మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు *మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు *నేడు మహాశివరాత్రి... శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివనామస్మరణతో మర్మోగుతున్న ఆలయాలు *వేములవాడ రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు *శ్రీశైలంలో రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, అమ్మవార్ల కల్యాణోత్సవం *పంచాయితీరాజ్ చట్టంలో సవరణలపై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ. గత కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వ్యవధిని తగ్గించిన ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఆర్డినెన్స్ *వైఎస్ వివేకా హత్యకేసు విచారణను సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్ పై విచారణ. సిట్ విచారణను సీల్డ్ కవర్ లో అందజేసిన ఏజీ. సిట్ విచారణ దాదాపుగా పూర్తి కాబోతుందని, ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదన్న ఏజీ.కేసు జనరల్ డైరీ, కేసు డైరీ ఫైల్స్ ను సోమవారానికి సమర్పించాలని ఏజీని ఆదేశించిన ఏపీ హైకోర్టు*అమరావతి: చంద్రబాబు, లోకేష్ అత్యంత అవినీతిపరులు. సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఆస్తుల ప్రకటన-ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి *తిరుపతి: రుయా హాస్పిటల్ లో ఆవరణలో సైకోల వీరంగం. రుయా సెక్యూరిటీ సిబ్బందితో సైకోల వాగ్వాదం. బ్లేడులతో గాయపరుచుకున్న నలుగురు సైకోలు. భయంతో పరుగులు తీసిన నర్సులు *నేతలపై దాడులు చేస్తే ఎవరైనా వస్తారా..? పెట్టుబడులు వస్తాయా..? రైతుల ముసుగులో టీడీపీ గుండాలు నాపై దాడి చేసే ప్రయత్నం చేశారు-వైసీపీ ఎమ్మెల్యే రోజా

ఏపీని చూసైనా...తెలంగాణ ఆర్టీసీ విషయంలో కేసీఆర్ పప్పులో కాలేశారా?

19-10-201919-10-2019 19:07:33 IST
Updated On 21-10-2019 13:10:16 ISTUpdated On 21-10-20192019-10-19T13:37:33.088Z19-10-2019 2019-10-19T13:35:53.372Z - 2019-10-21T07:40:16.280Z - 21-10-2019

ఏపీని చూసైనా...తెలంగాణ ఆర్టీసీ విషయంలో కేసీఆర్  పప్పులో కాలేశారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు సర్వ జనుల మద్దతూ లభించినట్లుగా కనిపిస్తున్నది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈ రోజు జరిగిన సమ్మె సంపూర్ణంగా విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనం. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నా సాయంత్రం వరకూ బంద్ ఉధృతి తగ్గలేదు. తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో కూడా బంద్ ప్రభావం మధ్యాహ్నానికి కనిపించేది కాదు. అటువంటిది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈ రోజు జరిగిన సమ్మె జనజీవనాన్ని దాదాపు స్తంభింప చేసింది. సమ్మెకు మద్దతుగా రోడ్ల మీదకు వచ్చిన వారిని అరెస్టులు చేయండని ఆదేశించడం తప్ప ప్రభుత్వం ప్రజా జీవనం స్తంభించకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు కనిపించలేదు.

మామూలుగా అయితే సమ్మెకు మద్దతు ప్రకటించేసి ఉరుకునే రాజకీయ పార్టీలూ, ప్రజా సంఘాలు ఆర్టీసీకి మద్దతుగా కార్యరగంలోనికి దిగాయి. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు, తెలంగాణ జనసమితి, విద్యార్థి సంఘాలూ అన్నీ కూడా ఆర్టీసీ సమ్మెను తమ సొంత విషయంగా భావించి సమ్మెలో చురుకుగా పాల్గొన్నాయి. ఇటువంటి ఐద్యత, సమష్టి తత్వం తెలంగాణ ఉద్యమ సాధనలో కనిపించింది. మళ్లీ ఇఫ్పుడు కనిపించింది.

సమ్మెలో ఉన్న కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన ఆర్మీసీ కార్మికుల పట్ల సామాన్య జనంలో కూడా సానుభూతి కలిగేందుకు దోహదం చేసింది.  సమస్యల పరిష్కారం కోసం గొంతెత్తితే గొంతు నొక్కేయడమేనా? అన్న భావన జనబాహుల్యంలో కలగడమే...ఆర్టీసీ సమ్మె పట్ల జన బాహుల్యంలో సానుకూలత వ్యక్తం కావడానికి కారణం.  ఈ రోజు ఆర్టీసీ, రేపు మనం, ఎల్లుండి అందరూ అన్న భావన ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరు కారణంగా అందరిలో ఏర్పడింది.

అందుకే ఈ సమ్మె విఫలమైతే తెలంగాణలో పౌర హక్కులన్నవే ఉండకుండా పోతాయనీ, కార్మికుల ఉద్యోగ భద్రత గాలిలో దీపంగా మారక తప్పదన్న భావనతో అన్ని వర్గాలూ సమష్టిగా సమ్మెకు సంఘీభావం పలికారు. ఆరంభంలో టీఎన్జీవోలు కొంత ముందు వెనుకలాడినా, తరువాత ముందుకు వచ్చి సమ్మెకు సంఘీభావం తెలపడమే కాకుండా ఈ రోజు బంద్ లో పాల్గొన్నారు.

అసలు ఆర్టీసీ విలీనం అంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు. ఆర్థిక భారమనా? ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్లోనే ఆర్టీసీని విలీనం చేయడానికి ఇసుమంతైనా జాప్యం చేయలేదు అక్కడ అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం.  అటువంటిది మిగులు బడ్జెట్ రాష్ట్రంగా, ధనిక రాష్ట్రంగా స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించుకుంటూ కూడా ఆర్టీసీ విలీనానికి ఎందుకు ఇష్టపడటం లేదు. ఈ ప్రశ్నలకు కార్మికులు, సంఘాలూ డిమాండ్ చేయడమే కారణమా అన్న సమాధానం మాత్రమే వస్తుంది. 

ఎందుకంటే నెల రోజుల ముందే సమ్మె నోటీసు ఇచ్చినా కార్మిక నాయకులను చర్చలకు పిలవక పోడం ద్వారా వారు సమ్మెకు దిగక తప్పని అనివార్య పరిస్థితులను ప్రభుత్వమే సృష్టించిందని చెప్పాలి. ఇక హైకోర్టు విస్పష్టంగా చర్చలు జరపాలని ఆదేశించినా...కేసీఆర్ మాత్రం ప్రభుత్వం సూచన మాత్రమే చేసింది...ఆదేశాలివ్వలేదనడం ఎంత మాత్రం సరికాదు.  కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ చేసుకున్నారని ప్రకటించడం ద్వారా, వారికి ఆర్టీసీ ఆసుపత్రిలో వైద్యం అందకుండా చేయడం ద్వారా కేసీఆర్ ఇప్పుడు కార్మిక వ్యతిరేక ముఖ్యమంత్రిగా ముద్రపడ్డారు.  

Image result for Telangana Rtc Strike

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

భారత్ ధర్మ సత్రం కాదు.. పౌరసత్వం అంగడి సరుకుకాదు: స్వామి

   5 hours ago


గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

గ్రామాలతోనే అభివృద్ధి.. సిరిసిల్ల రోల్ మోడల్

   6 hours ago


చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

చేను మేసిన కంచె.. చిత్తూరు కో ఆపరేటివ్ బ్యాంకులో భారీ స్కాం

   8 hours ago


వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

వైఎస్ వివేకా కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. విచారణ వాయిదా

   9 hours ago


గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముందస్తు ఎన్నికలు?

   9 hours ago


ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

ఉగాదికే ముహూర్తం.. రాజధాని తరలింపు ఖాయం

   10 hours ago


‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

‘‘రామ మందిరానికి ట్రస్ట్.. మరి మసీదు నిర్మాణం సంగతేంటి?’’

   13 hours ago


ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

ట్రంప్ కోసం యమునా నదికి సొగసులు

   13 hours ago


శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు

   14 hours ago


వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

వేములవాడకు హెలికాప్టర్‌ సేవలు.. భక్తుల్లో ఆనందం

   15 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle