newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏపీతోనే పోటీ.. తెలంగాణలో మరో 55 పాజిటివ్‌ కేసులు..

17-05-202017-05-2020 15:37:35 IST
Updated On 17-05-2020 16:43:41 ISTUpdated On 17-05-20202020-05-17T10:07:35.012Z17-05-2020 2020-05-17T10:07:32.718Z - 2020-05-17T11:13:41.287Z - 17-05-2020

ఏపీతోనే పోటీ.. తెలంగాణలో మరో 55 పాజిటివ్‌ కేసులు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెడ్ జోన్లు ఉన్నది మూడు జిల్లా కేంద్రాల్లో మాత్రమే అయినా తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కేసుల పెరుగుదల విషయంలో ఏపీతో పోటీ పడుతున్నట్లుగా తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 55 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 44 నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. మరో 8 కేసులు వలసదారులకు సంబంధించినవని కాగా.. సంగారెడ్డిలో రెండు, రంగారెడ్డి జిల్లాలో ఒక్క కేసు నమోదైనట్లు ప్రజారోగ్య డైరెక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. 

దీనిపై ఆయన శనివారం బులెటిన్‌ విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,509కు చేరుకుందని పేర్కొన్నారు. శనివారం 12 మంది కోలుకున్నారు. ఈ 12 మందితో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 971 మంది డిశ్చార్జి అయ్యారని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 34 మంది చనిపోగా, ప్రస్తుతం 504 మంది చికిత్స పొందుతున్నారన్నారు. 

కరోనా: టెస్టులు చేయకుండానే డిశ్చార్జి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో యాక్టివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని నోడల్‌ అధికారులు, డాక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఒకే కుటుంబానికి సంబంధించి అనేక మందికి కరోనా వ్యాప్తి చెందుతుండడంతోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్లో అందరికీ కూడా ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారమే చికిత్స అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

ఐసీఎంఆర్‌ తాజాగా అనేక మార్పులతో పలు కీలక సూచనలు చేస్తూ గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. వాటి ప్రకారమే డిశ్చార్జ్ పాలసీ, హోమ్ ఐసోలేషన్, డెత్ గైడ్ లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని మంత్రి ప్రకటించారు. ప్రైమరీ, సెకండరీ, టెర్శరీ కాంటాక్ట్స్‌ను లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలని ఐసీఎంఆర్ మార్గదర్శకాలు విడుదల చేసింది. వీరికి ఇంట్లో ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేసి అందులో ఉంచాలని, వారి సహాయం కోసం ఒక​ వ్యక్తిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని.. సహాయం అందిస్తున్న వ్యక్తికి హెచ్‌సీక్యూ టాబ్లెట్స్‌ అందించాలని సూచించింది.

గై​డ్‌లైన్స్‌ ప్రకారం.. 17 రోజుల పాటు వారిని పర్యవేక్షణలో ఉంచాలని పేర్కొంది. కరోనా సోకిన వ్యక్తులకు పది రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఎలాంటి చికిత్స అవసరం లేకుండా డిశ్చార్జి చేయవచ్చని తెలిపింది. ఈ విధంగా డిశ్చార్జ్ అయిన వారిని మరో ఏడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉంచాలి. ఒకవేళ మళ్లీ లక్షణాలు కనిపించినా, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని మాత్రం హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందించాలని ఐసీఎంఆర్ నిర్దేశించింది. 

ఇలా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారిని ఉదయం సాయంత్రం మెడికల్ టీమ్‌లు పరీక్షలు చేస్తారని, అవసరం అయిన నిత్యావసర వస్తువులు అన్నీ కూడా జీహెచ్‌ఎంసీ ద్వారా అందిస్తామని మంత్రి ఈటల తెలియజేశారు. సమన్వయం కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్‌ను కూడా నియమించామన్నారు.

కాన్సర్, గుండెజబ్బులు, లేదా ఇతర జబ్బులతో  చనిపోయిన వారికి కరోనా పాజిటివ్ ఉన్న కూడా దీర్ఘ కాలిక వ్యాదులతో చనిపోయినట్టుగానే పరిగణించాలని కొత్త నిబంధనల్లో పేర్కొంది. ఈ మరణాల కారణాలను విశ్లేషించడానికి ప్రొఫెసర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేస్తుంది. వారిచ్చిన డెత్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారమే మరణాలను ప్రకటించాలని ఐసీఎంఆర్‌ తెలిపింది.

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   12 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   8 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   10 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   13 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   15 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   17 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   18 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   19 hours ago


భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

భద్రలోక్‌పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?

   20 hours ago


ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ

   21 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle