newssting
BITING NEWS :
* భారత్-అమెరికా మధ్య కుదిరిన ఐదు ఒప్పందాలు.. ట్రంప్‌తో నాకు ఇది ఐదో సమావేశం, ట్రంప్ సకుటుంబంగా భారత్‌కు రావడం సంతోషంగా ఉంది-ప్రధాని మోడీ*మూడు బిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది, సహజవాయురంగంలో ఒప్పందం చేసుకున్నాం-డొనాల్డ్ ట్రంప్ *ఇండియాతో మాకు ప్రత్యేక అనుబంధం, ఈ టూర్ ఎప్పటికీ మర్చిపోలేను, రెండు దేశాలకు ఇది ఉపయోగకరమైన పర్యటన, ఇస్లాం తీవ్రవాదంపై కూడా చర్చించాం-ట్రంప్ * నిర్భయ దోషుల ఉరి శిక్షలో మరో ట్విస్ట్..! విచారణ 5వ తేదీకి వాయిదా *ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్‌ సస్పెన్షన్ రద్దుచేసిన క్యాట్.. కృష్ణకిషోర్‌ కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ట్రైబ్యునల్‌ అనుమతి, కృష్ణకిషోర్‌పై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం పరిశీలించుకోవచ్చన్న క్యాట్ *ఢిల్లీ సర్వోదయ స్కూల్‌లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్... హ్యాపిసెన్ క్లాస్‌లను పరిశీలించిన మెలానియా*రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. నోటిఫికేషన్‌ మార్చి 6, నామినేషన్లకు చివరి తేది మార్చి 13, నామినేషన్ల పరిశీలన మార్చి 16, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది మార్చి 18, మార్చి 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. సాయంత్రం 5 గంటలకు కౌంటింగ్ * సాయంత్రం మోడీ-ట్రంప్ విందుకు హాజరుకానున్న ప్రముఖులు. రాలేనని సందేశం పంపిన మాజీ పీఎం మన్మోహన్ సింగ్

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!

18-01-202018-01-2020 12:28:55 IST
2020-01-18T06:58:55.788Z18-01-2020 2020-01-18T06:58:53.496Z - - 26-02-2020

ఏపీకి వెళ్లొద్దు.. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ మంత్రి విజ్ఞప్తి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో తలెత్తిన పరిస్థితులు తెలంగాణకు వరంగా మారాయన్నది స్పష్టంగా కళ్ళకు కనిపిస్తున్న నిజం. వైసీపీ సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు రాష్ట్రం నుండి పెట్టుబడిదారులను రాష్ట్రం నుండి వెళ్లిపోయేలా చేస్తుంటే వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం రెడ్ కార్పెట్ వేసి పలు రాయతీలు ఇచ్చి వెల్కమ్ చెప్తుంది. వరంగల్ లో ఐటీ టవర్స్ లో పలుకంపెనీలు ఈక్రమంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

మరోవైపు సింగపూర్ కన్సార్టియం.. లులూ గ్రూప్ ఏపీ నుండి వచ్చి తెలంగాణతో ఎంఓయూ చేసుకున్నాయి. పక్కా వ్యాపార సంబంధాలు కలిగిన ఏ సంస్థ కూడా ఇప్పుడు ఏపీకి వెళ్లి పెట్టుబడులు పెట్టే రిస్క్ చేయడం లేదు. ఇది ఎక్కడినుండో వచ్చే వాళ్లే కాదు ఏపీలో పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలు సైతం తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేకుండా చేశారు.

ఈక్రమంలో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం మెరుపు వేగంతో పుంజుకుంది. ఇక్కడి మంత్రులు కూడా ఆయా రంగంలో వాళ్ళకి ఏపీలో పరిస్థితిలను వివరించి ఏపీకి వెళ్తే నష్టపోతారని స్వయంగా చెప్తున్నారు. ఇక ఇప్పుడు సినిమా వాళ్ళ వంతు వచ్చింది. సినిమా వాళ్ళు అప్పుడప్పుడు గోదావరి జిల్లాలు, విశాఖ, రాయలసీమలోని కర్నూలు జిల్లాలలో షూటింగ్ చేస్తారు.

గోదావరి అందాలకు సినిమా రంగంలో చాలా చరిత్రే ఉన్న సంగతి తెలిసిందే. ఇక బీచ్ తో పాటు సాగరతీరం.. డైమండ్ సిటీగా వైజాగ్ సినిమా వాళ్ళని ఆకర్షిస్తుంది. పలు కథా కథనాల దృష్ట్యా కర్నూలుకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ఈక్రమంలోనే పలువురు అక్కడ చిత్రికరణకి మొగ్గుచూపుతారు. అయితే ఇకపై సినిమా వాళ్ళని కూడా ఏపీ వైపు చూడకుండా తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తులు మొదలుపెట్టింది.

తాజాగా మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా టీమ్ వరంగల్‌లో విజయోత్సవ సభ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, రష్మిక, విజయశాంతి, రాజేంద్రప్రసాద్, దిల్ రాజు, అనిల్ రావిపూడి సహా పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా హాజరు కాగా ఇకపై హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని టాలీవుడ్ అడ్డాగా ఎంచుకోవాలని కోరారు.

కాళేశ్వరంతో వరంగల్ జిల్లా కోనసీమలా మారింది ఇక ఇక్కడే మీకు సౌకర్యంగా ఉంటుంది. అనిల్ రావిపూడికి విజయవాడ, వైజాగ్ అంటే ప్రేమ ఎక్కువ. మీరు అటు లాగొద్దు. మా వంశీ, దిల్ రాజు ఇటే గుంజుకొస్తారు. మీరు అటు గుంజొద్దు. సీఎం కేసీఆర్, కేటీఆర్ సహకారంతో సినీ ప్రముఖులకు ఎలాంటి సాయం కావాలన్నా అందిస్తాం.  విజయవాడ.. వైజాగ్ కాదు. వరంగల్‌లో సినిమాలు తీయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే సినిమా వాళ్ళు హైదరాబాద్ ను విడిచిపెట్టే పరిస్థితి లేదు. మరి ప్రభుత్వం ఇంత హామీలు ఇస్తుంటే వాళ్ళు మాత్రం ఎలా కాదనగలరు!

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle