newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏడు నుంచే మెట్రో సర్వీసులు షురూ.. అక్కడ మెట్రో బంద్

04-09-202004-09-2020 07:28:40 IST
Updated On 04-09-2020 07:39:06 ISTUpdated On 04-09-20202020-09-04T01:58:40.759Z04-09-2020 2020-09-04T01:58:36.757Z - 2020-09-04T02:09:06.739Z - 04-09-2020

ఏడు నుంచే మెట్రో సర్వీసులు షురూ.. అక్కడ మెట్రో బంద్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
అన్ లాక్ నిబంధనల్లో భాగంగా హైదరాబాద్‌లో దశల వారీగా నడవనున్నాయి మెట్రో రైళ్ళు. కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల 7 నుంచి మెట్రో సర్వీసులు పునః ప్రారంభం కానున్నాయి. దీంతో దశల వారిగా మెట్రోను నడపాలని హైదరాబాద్ మెట్రో నిర్ణయించింది. ఈ క్రమంలో సర్వీసులను మూడు ఫేజ్‌లుగా విభజించారు. 7న మొదటి ఫేజ్‌లో భాగంగా మియపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రో ఓపెన్‌లో ఉండనుంది. అలాగే ఉదయం 7 గంటల నుండి 12 గంటల వరకు తిరిగి 4 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే మెట్రోలు తిరగనున్నాయి. 

ఇక 8వ తేదీన సెకండ్ ఫేజ్‌లో భాగంగా నాగోల్ నుంచి రాయదుర్గం వరకు మెట్రో సర్వీసులు నడవనున్నాయి. 9వ తేదీన థర్డ్ ఫేజ్ అన్ని మార్గాల్లో మెట్రో సర్వీసులు నడవనున్నాయి. అయితే కంటైన్మెంట్ జోన్లలో మెట్రో క్లోజ్ అవ్వనుంది. ఆ లిస్ట్‌లో గాంధీ హాస్పిటల్, భరత్ నగర్, మూసాపేట్‌, ముషీరాబాద్, యూసుఫ్ గూడలో మెట్రో సర్వీసులు బంద్ కానున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో 10 ఏళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు మెట్రో రైలులోకి ప్రవేశాన్ని కల్పించడాన్ని తాత్కాలికంగా నిషేధించనున్నారు. అన్ని మెట్రో స్టేషన్లలో లిఫ్టులను పూర్తిగా ఆపేయనున్నారు. అంతేకాక, టికెట్లను కూడా కౌంటర్ల నుంచి నేరుగా కొనుక్కోవడానికి స్వస్తి పలకనున్నారు. ప్రయాణానికి స్మార్ట్ కార్డులు లేదా డిజిటల్ టికెట్లకు మాత్రమే అనుమతి ఉందని హెచ్ఎంఆర్ సంస్థ వెల్లడించింది. 

గత 6 నెలలుగా సర్వీసులు నిలిపివేయడంతో 3 కారిడార్లు, 57 మెట్రో స్టేషన్లలో క్లీనింగ్‌, శానిటేషన్‌ పనులను అధికారులు చేస్తున్నారు. రెండు రోజుల్లో హెచ్‌ఎంఆర్‌ పూర్తి గైడ్‌లైన్స్ విడుదల చేసే అవకాశం ఉంది. కరోనా ధాటికి గత మార్చి 22 నుంచి మెట్రో సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి.

దేశంలోని రెండో అతి పొడవైన మెట్రో వ్యవస్థ కలిగిన హెచ్ఎంఆర్ సంస్థ రోజుకు 55 రైళ్లతో రాకపోకలు సాగిస్తోంది. 4.5 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతోంది. కొవిడ్‌తో గత ఆర్నెల్లుగా రైళ్లు డిపోలకే పరిమితం కావడంతో సంస్థకు కోట్ల కొద్దీ నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలని మెట్రో లేఖ కూడా రాసింది. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

మెట్రో సర్వీసులు ప్రారంభం అయితే ఆటోలలో వెళ్లాల్సిన వారికి ఉపశమనం లభించనుంది. ఉదాహరణకు ఎల్ బి నగర్ నుంచి ఇప్పుడు హైటెక్ సిటీ, లింగంపల్లి వెళ్ళేవారు రోజుకి 200 రూపాయలు పైగానే ఖర్చుచేస్తున్నారు. ఇప్పుడు ఖర్చులు తగ్గనున్నాయి. మెట్రోలో ఒకేచోట వివిధ జాగ్రత్తలు పాటిస్తారు కాబట్టి కరోనా రిస్క్ కూడా కొంచెం తక్కువే అని భావిస్తున్నారు. మెట్రోకి ఎలాంటి ఆదరణ లభిస్తుందో వారం ఆగితే గానీ తెలీదు. రాత్రి 9గంటల వరకే మెట్రో తిరుగుతుంది కాబట్టి మీ జర్నీని ప్లాన్ చేసుకోండి. 

 

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

   6 hours ago


ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

ఖాళీ అవుతున్న హైదరాబాద్.. పాపం వలస కూలీలు..!

   9 hours ago


నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

నిరాహార దీక్ష‌ల‌పై షర్మిల‌క్క‌య్య నిర్ణ‌యం

   12 hours ago


మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

మ‌న గుంటూరులోనే.. జాగ్ర‌త్త ప‌డ‌దామా వ‌ద్దా.. అంతా మ‌నిష్టం

   12 hours ago


ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

ఏంద‌య్యా కేసీఆరూ.. ఏం సీఎం వి సామే

   13 hours ago


ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

ఫ్రీ టీకాపై కేంద్రం చేతులెత్తేసింది.. మ‌రి రాష్ట్రాల మాటేంటి

   11 hours ago


ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

ఏపీకి కోవిషిల్డ్ వచ్చేసింది..

   21-04-2021


తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఎటువంటి ఇబ్బందులు లేవట..!

   a day ago


కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

కాంగ్రెస్ కి ఇంకా ఆశ‌లు ఉన్న‌ట్లున్న‌య్

   21-04-2021


తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

తిరుప‌తి రిగ్గింగ్.. కోర్టు ఏం చెబుతుంది.. రీ పోలింగ్ త‌ప్ప‌దా

   21-04-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle