newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏం నడుస్తుంది?.. కేంద్రంతో కేసీఆర్ వార్ మొదలెట్టారా?

22-04-202022-04-2020 12:05:55 IST
Updated On 22-04-2020 13:55:05 ISTUpdated On 22-04-20202020-04-22T06:35:55.258Z22-04-2020 2020-04-22T06:35:53.073Z - 2020-04-22T08:25:05.559Z - 22-04-2020

ఏం నడుస్తుంది?.. కేంద్రంతో కేసీఆర్ వార్ మొదలెట్టారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తెలంగాణలో రాజకీయాలలో ఇప్పుడు ఏం నడుస్తుంది? కేంద్రంతో సీఎం కేసీఆర్ దోస్తీలో ఉన్నారా? లేక ఎప్పటిలానే శత్రువగానే చూస్తున్నారా? ఒకపక్క ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంతో కలిసి.. ప్రధాని సలహాలను తీసుకొనే మనం కరోనాను ఎదుర్కోవాలని చెప్తూనే కేసీఆర్ మరొకపక్క కేంద్రంతో సంబంధం లేకుండానే రాష్ట్రంలో నిర్ణయాలను తీసుకుంటున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది.

ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూకి పిలుపిచ్చిన రోజున సీఎం కేసీఆర్ మాటలు ఇప్పటికీ ప్రజలకు గుర్తే. ప్రధానిలాంటి వ్యక్తి జాతిని ఉద్దేశించి ఐక్యత కోసం చప్పట్లు కొట్టమంటే దానిని కూడా ఎగతాళి చేసే వాళ్ళని ఏమనాలి? అంటూ తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కాదు. కరోనాలాంటి మహమ్మారి రాజకీయ శత్రువులను కూడా కలిపింది. నిజమే ఇలాంటి సమయంలో కేసీఆర్ కేంద్రానికి గట్టిగా సహకరిస్తున్నారని అనిపించింది.

అయితే అదంతా మూన్నాళ్ళ ముచ్చెటనా? అనే అనుమానాలు రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. దానికి కారణం కేంద్రంలో లాక్ డౌన్ పొడగింపు.. కొన్ని నిబంధనల సడలింపు వంటి వాటికి కేసీఆర్ లెక్కచేయకపోవడం.. అదే సమయంలో కేంద్రం లాక్ డౌన్ సమయానికి మించి కేసీఆర్ ముందే మరికాస్త సమయాన్ని పొడిగించడం.. మన రాష్ట్రంలో మన నిర్ణయమే అన్నట్లుగా ఉన్నారని భావిస్తున్నారు.

కేంద్రం విధించిన రెండో విడత లాక్ డౌన్  ఏప్రిల్ 14 తో ముగిసిందనగా ముందే తెలంగాణ లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తర్వాత కేంద్రం కూడా మే 3వరకు లాక్ డౌన్ ను పొడిగిస్థునట్ల్లు ప్రకటించింది. అయితే కొన్ని సడలింపులతో మరుసటి రోజు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. కానీ అవి మన రాష్టంలో అమలు చేయట్లేదని కేసీఆర్ ప్రకటించేశారు.

ఇక కేంద్రం విధించిన లాక్ డౌన్ మే 3 వరకు ఉండగా కేసీఆర్ మాత్రం దానికి మే 7 వరకు పొడిగించారు. మే 3కి ఒక్కరోజు ముందు ప్రకటించే సమయం ఉన్నా ముందే ప్రకటించడంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్రం సడలింపులు వద్దని లాక్ డౌన్ కఠినంగా అమలు చేయడం ఒకే కానీ దాదాపు ఇరవై రోజుల సమయం ఉన్నా కేంద్రాన్ని మించి లాక్ డౌన్ పొడగింపు ఇవ్వడం చూస్తే మా ఇష్టం అన్నట్లే ఉందని చెప్పుకోవాల్సి వస్తుంది.

అయితే, మొన్నటి వరకు కరోనా విషయంలో ప్రధానికి మనమందరం సహకరించాలని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ఇలా తమ రాష్టం తమ ఇష్టం అన్నట్లుగా మారిపోయారన్న చర్చలు కూడా సహజంగానే జరుగుతున్నాయి. ఆర్ధిక పరమైన విషయాలలో రాష్ట్రాల సలహాలను తీసుకోకపోవడంతోనే కేసీఆర్ ఈ వైఖరికి మారినట్లుగా ఒక అభిప్రాయం వినిపిస్తుంది.

సీఎంఓ నుండి ఆదేశాలు వచ్చాయో లేక వారే పెట్టారో కానీ గత రెండు రోజులుగా కొన్ని చానెళ్లు ఆర్ధికపరమైన విషయాలలో కేంద్రం తప్పుడు వైఖరి అవలంభిస్తుంది అనేలా లైవ్ చర్చలు కూడా పెట్టారు. ఇక తాజాగా సీఎం సొంత పత్రికలో కేంద్రంపై రాష్ట్రాల అసంతృప్తి అనేలా.. ఆర్థికపరమైన విషయాలలో కేంద్రం వైఖరి తప్పు అనేలా ఓ భారీ కథనం కూడా ప్రచురించారు. ఇది ప్రభుత్వానికి.. టీఆర్ఎస్ అధిష్టానికి తెలియకుండానే జరిగిందా? అంటే నమ్మే పరిస్థితి లేదు. దీంతో కేసీఆర్ కేంద్రంతో మళ్ళీ వార్ మొదలైనట్లేనా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.

 

బీజేపీకి  70 సీట్లోస్తే గొప్పే : మమత

బీజేపీకి 70 సీట్లోస్తే గొప్పే : మమత

   13 hours ago


బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

బీజేపీపైనా ఈసీ కొరడా.. 48 గంటల నిషేధం.. సువేందుకు వార్నింగ్

   14 hours ago


ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

ష‌ర్మిల దీక్ష‌..ర‌చ్చ ఫిక్స్..ప‌ర్మిష‌న్ ప్రాబ్ల‌మ్

   14 hours ago


మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.

   18 hours ago


ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

ఏపీ, తెలంగాణ‌లో ఉత్కంఠ‌.. ఈ ఒక్క‌రోజు చాలా ఇంపార్టెంట్

   19 hours ago


సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

సై అంటే సై అంటున్న లోకేశ్.. నై అంటే నై అంటున్న జ‌గ‌న్

   17 hours ago


ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ  ఎమ్మెల్యేల లిస్ట్

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్

   20 hours ago


స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత

   20 hours ago


సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

సాగర్ ఎన్నికల ప్రచారం.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద గొడవే..!

   15 hours ago


ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

ఎమ్మెల్యేల డ్ర‌గ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle