ఎలుగుబంటి పుణ్యమా అని లాక్డౌన్ గ్రాండ్ సక్సెస్!
24-03-202024-03-2020 12:44:03 IST
Updated On 24-03-2020 13:02:27 ISTUpdated On 24-03-20202020-03-24T07:14:03.211Z24-03-2020 2020-03-24T07:14:00.219Z - 2020-03-24T07:32:27.472Z - 24-03-2020

కరోనా వైరస్ కట్టడికి సోషల్ డిస్టెన్స్ ఒక్కటే మందని.. వ్యాక్సిన్ లేని మాయ రోగానికి నివారణా చర్యలే మూలమని ప్రభుత్వాలు గొంతు చించుకొని చెప్తున్నా కొందరికి అసలు ఎక్కడం లేదు. ప్రధాని మోడీ పిలుపుమేరకు ఆదివారం జనతా కర్ఫ్యూ గ్రాండ్ సక్సెస్ చేసిన ప్రజలు అప్పటికే ఏదో కొంపలు మునిగినట్లుగా సోమవారం ఉదయమే రోడ్ల మీదకి ఉరుకులు పరుగులు తీశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సాయంత్రమే రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించినా సోమవారం యధావిధిగా రోడ్ల మీదకి చేరారు. దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం మధ్యాహ్నానికి లాక్ డౌన్ అమలును మరింత కఠినతరం చేసింది. ఎక్కడిక్కడ పోలీసు బలగాలను దింపి కట్టడి చేస్తున్నారు. దీంతో కొంత మేర ప్రజలు రోడ్ల మీదకి వచ్చేందుకు జంకుతున్నారు. మరికొన్ని చోట్ల అయితే పోలీసులు ప్రైవేట్ వాహనాలను సీజ్ చేస్తున్నారు. మొత్తం మీద ప్రజలను కట్టడి చేసేందుకు పోలీసు శాఖ అవస్థలు పడుతుంది. అది కూడా వంద శాతం లాక్ డౌన్ కానే కాదు. కానీ, తెలంగాణలోని కొమురంభీమ్ అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో మాత్రం ఒక్క ఎలుగుబంటి పుణ్యమా అని వందకు వంద శాతం లాక్ డౌన్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. అక్కడ ఆదివారం జనతా కర్ఫ్యూతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కొన్ని కాలనీల్లో అయితే ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోయి తలుపులు పెట్టేసుకున్నారు. దీంతో పక్కనే ఉన్న అడవి నుండి ఓ ఎలుగుబంటి పట్టణంలోకి వచ్చింది. రాత్రి 7 గంటల సమయంలో కాగజ్ నగర్ లోని సర్ సిల్క్ విజయా బస్తీలో ఎలుగుబంటి ప్రజల కళ్ళలో పడింది. అంతే, ఒక్కసారిగా ప్రజలు కేకలు వేసి ఎక్కడిక్కడ ఇళ్లలోకి వెళ్లి తలుపులు లాక్ చేసుకున్నారు. కొందరు కాలనీ వాసులు ఎలుగుబంటి విషయంపై ఫారెస్ట్ అధికారులకు సమాచారమివ్వడంతో వారు దానిని బంధించేందుకు సామాగ్రితో రంగంలోకి దిగారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని చూసిన ఎలుగుబంటి విజయా బస్తీ నుండి పక్కనే ఉన్న మరో కాలనీలోకి పారిపోయింది. ఫారెస్ట్ అధికారులు ఆ కాలనీ మొత్తం జల్లెడ పట్టినా అది కనిపించకుండాపోయింది. మరోసారి విజయా బస్తీని కూడా శోధించినా ఎలుగుబండి జాడ కనిపించలేదు. దీంతో అది ఇప్పుడు ఎక్కడ ఉందో అధికారులకు కూడా అంతుచిక్కడం లేదు. అయితే, ఎలుగుబండి పుణ్యమా అని రెండు కాలనీల వారు ఇళ్ల నుండి అడుగుబయటపెట్టడం లేదు. భయాందోళనలో ఉన్న కాలనీల ప్రజలు ఫారెస్ట్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నా వాళ్ళు మాత్రం చూస్తున్నాం.. చేస్తున్నాం.. వెతుకుతున్నాం.. కనిపించనేలేదు అంటున్నారు. ఇక ఎలుగుబంటి పుణ్యమా అని రెండు కాలనీలలో వంద శాతం లాక్ డౌన్ అమలవుతుంది. అంతపెద్ద మహమ్మారి కరోనాకు కూడా భయపడని ప్రజలు రోడ్ల మీదకి వస్తుంటే.. ఎలుగుబంటి మాత్రం హడలెత్తించి లాక్ డౌన్ అమలు చేయడం విశేషం!

మా పద్దతి మాకుంది..! టిక్కెట్ల పంపిణీపై ప్రశాంత్ కిషోర్ పాత్ర లేదు.
6 minutes ago

ఏపీ, తెలంగాణలో ఉత్కంఠ.. ఈ ఒక్కరోజు చాలా ఇంపార్టెంట్
an hour ago

ఇరానీ అమ్మాయిల చేతిలో తెలంగాణ ఎమ్మెల్యేల లిస్ట్
2 hours ago

స్ట్రీట్ ఫైటర్ని.. తల వంచను : మమత
3 hours ago

ఎమ్మెల్యేల డ్రగ్స్ కేసు.. చాలామంది ఉన్నారంటోన్న నిందితుడు
4 hours ago

కేటీఆర్ కి అంత సీన్ లేదులే
6 hours ago

పెద్ద నాయకుడికి ఇబ్బందులు అంటూ స్వరూపానందేంద్ర సరస్వతి వ్యాఖ్యలు..!
6 hours ago

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీడీపీ
21 hours ago

వివేకానంద రెడ్డి హత్యపై మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు..!
21 hours ago

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
a day ago
ఇంకా