ఎమ్మెల్యే సీతక్క.. ఏజెన్సీ వాసుల పాలిట ఆశాకిరణం
18-08-202018-08-2020 08:00:48 IST
Updated On 28-08-2020 14:39:20 ISTUpdated On 28-08-20202020-08-18T02:30:48.205Z18-08-2020 2020-08-18T02:28:26.187Z - 2020-08-28T09:09:20.424Z - 28-08-2020

పేరు అనసూయ ఎలియాస్ సీతక్క... కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా ఆమె అందరిలో కలిసిపోతారు. కరోనా లాక్ డౌన్ వేళ కొండలు, గుట్టలు తిరిగారు. అందరిలో కలిసిపోయి, వారితోనే వంటావార్పు చేశారు. ప్రభుత్వం వస్తుందని ఏదో చేస్తుందని ఆమె భావించలేదు. గిరిజన గూడేల్లో ట్రాక్టర్లపై వెళ్లారు. వారికి అండగా నిలిచారు.మళ్లీ కష్టమొచ్చింది భారీ వర్షాల వల్ల తెలంగాణలోని గిరిజన గ్రామాలు వరదనీటి బారిన పడ్డాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. చాలా గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భద్రాచలంలో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత 60 అడుగులకు చేరింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజల బాధలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గ్రామాల్లో వరద నీటితో గిరిజనులు పడుతున్న ఇక్కట్లను తెలుసుకోవడానికి వినూత్న మార్గం ఎంచుకున్నారు. నేతలు కొందరు హెలికాప్టర్లలో తిరిగితే ఎమ్మెల్యే ‘ఆటో ఏరియల్ సర్వే’ ద్వారా ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. ఇళ్లలోకి నీరు చేరింది. గోదావరి బ్యాక్ వాటర్ పలు గ్రామాలను ముంచేస్తోంది. మేడారంలో జంపన్నవాగు పొంగి పొర్లుతోంది. సమ్మక్క, సారలక్క గద్దెలను కూడా వరద నీరు ముంచెత్తింది. లక్నవరం, రామప్ప చెరువులు మత్తడి దుంకుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రాంతాల్లో ఆమె పర్యటించింది. ఎమ్మెల్యే సీతక్క కొంత మంది అనుచరులతో ఆటోలో తిరుగుతూ ఆయా ప్రాంతాలను పరిశీలించడంతో బాధితులు ఊరట చెందారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. కష్టాల బారిన పడిన గిరిజనులను, పేద ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు చూస్తే ఎవరికైనా కళ్ళు తడిబారక మానవు. ఎటుచూసినా నీరే. పంటపొలాలన్నీ నీట మునిగిపోయాయి. బోరుబావులు, స్టాటర్లు, ట్రాన్స్ఫార్మర్లు నీటిలో మునిగిపోయాయి. వాటిని తాకవద్దని ఆమె జాగ్రత్తలు చెప్పారు. వరదల వల్ల భారీగా నష్టపోయిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఆమె సీఎం కేసీయార్ ను కోరారు. అసలే కరోనా వీరవిహారం చేస్తున్న వేళ ముఖ్యమైనది శానిటేషన్, వైద్య సదుపాయాలు అందించడానికి వెంటనే ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ ఎమ్మెల్యే సీతక్క పోస్టు చేశారు. ఈమె పోస్టుకి సోషల్ మీడియాలో అనూహ్య స్పందన లభిస్తోంది. ఎమ్మెల్యే అంటే ఇలాగే వుండాలని నెటిజన్లు అభినందిస్తున్నారు.

జగన్ తిరుపతి పర్యటన రద్దు.. అచ్చెన్నాయుడు సెటైర్లు..!
6 hours ago

షర్మిల దీక్షలతో ఏం ఒరుగుతుంది
10 hours ago

కన్నుమూసిన హిందూపురం మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి
13 hours ago

వాలంటీర్లపై పాత ప్రేమే కొత్తగా చూపించిన జగన్
3 hours ago

బెంగాల్ ఎన్నికల్లో హింస.. కాల్పుల్లో ఐదుగురి మృతి
13 hours ago

జనం ప్రేమ కాదు.. జడ్జిల దయతోనే జగన్ సీఎం అట
11 hours ago

పవన్ కి చంద్రబాబు సపోర్ట్
13 hours ago

కొత్తగా సెకండ్ డోస్ భయం.. తూర్పుకి తిరిగి దండం పెట్టాలా
14 hours ago

దేవినేని ఉమ.. చిక్కుల్లో పడ్డట్టేనా..?
8 hours ago

రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ ఈ తన్నుడు కామెంట్లు ఏంటో..?
16 hours ago
ఇంకా