ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
31-03-202031-03-2020 18:14:25 IST
2020-03-31T12:44:25.152Z31-03-2020 2020-03-31T12:42:33.995Z - - 16-04-2021

తెలంగాణలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏం మాట్లాడినా సంచలనమే. ఈమధ్యకాలంలో సీఏఏ, ఎన్నార్సీలపై అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు అందరికీ గుర్తుండే వుంటాయి. తాజాగా ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ ఢిల్లీలో మత ప్రార్ధనలలో పాల్గొన్న వారు ప్రభుత్వానికి సహకరించక పోతే వారిని కాల్చి పడేయాలన్నారు. వారి కారణంగా దేశం ప్రమాదం లో పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్ మసీదులో ఈ నెల నిర్వహించిన మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మసీదును అధికారులు మూసివేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి, నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రార్థనల కోసం వారికి అనుమతి ఎవరిచ్చారన్నారు. దీనికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సమాధానం చెప్పాలన్నారు. దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి ముస్లింలు ఢిల్లీలో ప్రార్ధనల కోసం హాజరయ్యారని, వాళ్ళందరికీ కరోనా పాజిటివ్ వస్తే పరిస్థితి వేరేలా ఉంటుందన్నారు. ఒకవైపు ప్రధానమంత్రి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పాటించాలని చెప్తే వేలాదిమంది ముస్లింలు ఢిల్లీ లో ఎలా సమావేశం అవుతారని, వారికి అనుమతి ఎలా వచ్చిందన్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ ప్రార్థనలకు భారీగానే జనం హాజరయ్యారు. తెలంగాణ నుంచి ఢిల్లీ ప్రార్ధనలకు 1030 మంది వెళ్లినట్టు ప్రభుత్వం గుర్తించింది. వారిలో హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధి నుంచి 603 మంది హాజరైనట్టు మంగళవారం వెల్లడించింది. నిజామాబాద్ 80, నల్లగొండ 45, వరంగల్ అర్బన్ 38, ఆదిలాబాద్ 30, ఖమ్మం 27, నిర్మల్ 25, సంగారెడ్డి 22 మంది మర్కజ్ మసీదు ప్రార్థనల్లో పాల్గొన్నారని తెలిపింది. కాగా, ‘ఈ నెల 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్లో మతపరమైన ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో కొందరికి కరోనా వైరస్ సోకింది. అందులో తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. వారిలో ఇప్పటి వరకు ఆరుగురు మరణించారు’ అని ముఖ్యమంత్రి కార్యాలయం సోమవారం రాత్రి ప్రకటించింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం కోరింది.

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
13 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
9 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
11 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
14 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
16 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
18 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
19 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
20 hours ago

భద్రలోక్పై గంపెడాశలు.. బీజేపీ బెంగాల్ కల ఫలించేనా?
21 hours ago

ఇంట్లో కూడా మాస్క్ ధరించండి.. పరిస్థితి విషమం... తెలంగాణ ఆరోగ్య శాఖ
a day ago
ఇంకా