newssting
BITING NEWS :
* నేను తెలంగాణను కించ పర్చేలా మాట్లాడలేదు.. తెలంగాణలోని ప్రధాన పట్టణాలకు రైల్ కనెక్టివిటీ లేదని చెప్పాలన్నదే నా ఉద్దేశ్యం.. ఆంధ్ర పాలకుల హయాంలో తెలంగాణ నిర్లక్ష్యానికి గురైందని చెప్పా-కేంద్రమంత్రి కిషన్ రెడ్డి *కాంగ్రెస్‌ ఎంపీ అహ్మద్‌పటేల్‌కు ఐటీశాఖ నోటీసులు.. రూ.400 కోట్ల హవాలా మనీ కేసులో సమన్లు.. ఫిబ్రవరి 11నే నోటీసులు జారీ చేసిన ఐటీశాఖ.. హాజరుకాకపోవడంతో మరోసారి నోటీసులు*కోవిడ్‌-19 బారిన పడి వుహాన్‌ వుచాంగ్‌ హాస్పిటల్‌ డైరక్టర్‌ మృతి.. కరోనాపై ఫస్ట్‌ హెచ్చరిక జారీ చేసిన లియూ చిమింగ్‌... ఆయన మృతికి సంతాపం ప్రకటించిన చైనా వాసులు*ధాన్యం కొనుగోలు కోసం నిధులను కేటాయించారా.. లేదా?, కేటాయిస్తే ఆ నిధులు ఎటుపోయాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి-పవన్ కల్యాణ్ *ఎన్నికల వరకే రాజకీయం.. ఆ తర్వాత ప్రభుత్వ పథకాలే ముఖ్యం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు-కేసీఆర్* భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం... ట్రంప్ పర్యటన నేపథ్యంలో కీలక నిర్ణయాలు *పాకిస్థాన్‌లో ముస్లింల సంఖ్య 23 శాతం తగ్గిందట.. మరి వాళ్లంతా ఏమయ్యారు, చనిపోయి ఉండాలి.. ఇస్లామిక్‌లోనైనా కలిసి ఉండాలి లేదా భారత్‌లో చొరబడి స్థిరపడి ఉండాలి!-పీయూష్ గోయల్

ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్...ఎందుకో తెలుసా?

14-01-202014-01-2020 15:01:59 IST
2020-01-14T09:31:59.244Z14-01-2020 2020-01-14T09:31:54.626Z - - 19-02-2020

ఎమ్మెల్యే రాజాసింగ్ హౌస్ అరెస్ట్...ఎందుకో తెలుసా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వివాదాస్పద బీజేపీ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ గృహనిర్భంధంలో వుంచారు పోలీసులు. ఛలో భైంసాకు పిలుపునివ్వడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. ఆయన ఇంటి దగ్గర పెద్దసంఖ్యలో పోలీసులను మోహరించారు. ఆదివారం రాత్రి నిర్మల్ జిల్లా భైంసాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఆందోళనకారులు పలు వాహనాలకు, ఇళ్లకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

నిరసనలను అదుపుచేస్తున్న పలువురు పోలీసు అధికారులకు కూడా గాయాలయ్యాయి. అంతా బాగానే ఉందని భావిస్తున్న వేళ మళ్ళీ సోమవారం మధ్యాహ్నం వదంతులు వ్యాపించాయి.దీంతో పట్టణంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి.. మూడు రోజులపాటు కర్ఫ్యూ విధించారు. ఘటనకు సంబంధించి 25మందిని అదుపులోకి తీసుకున్నారు.

కర్ఫ్యూ సమయంలో పోలీసుల ఆదేశాలు ధిక్కరించి.. ఎవరు బయట తిరిగినా అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ క్రమంలో రాజాసింగ్ ఛలో భైంసాకు పిలుపునిచ్చారు. ఎలాగైనా భైంసాకు వెళ్ళి తీరతానని ఆయన భీష్మించుకు కూర్చున్నారు. శాంతి భద్రతల నేపథ్యంలో రాజాసింగ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle