ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిపై కేసు ఏది? కాంగ్రెస్ నేత మదన్ మోహన్ డిమాండ్
22-05-202022-05-2020 13:15:10 IST
Updated On 22-05-2020 16:37:34 ISTUpdated On 22-05-20202020-05-22T07:45:10.937Z22-05-2020 2020-05-22T07:44:32.567Z - 2020-05-22T11:07:34.392Z - 22-05-2020

తెలంగాణ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా వుంటాయి. నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పై జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జ్ మదన్ మోహన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ 19 నిబంధనలను ఉల్లంఘించి 60 ఏండ్ల వయస్సులో జనం సమూహం మధ్యలో బర్త్ డే పార్టీ చేరుకున్న నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పై క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చెయ్యలేదంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని అవసరమైతే పదేళ్లు జైల్లో ఉండడానికి అయినా సిద్ధమేనని అధికార పార్టీకి సవాల్ విసిరారు మదన్ మోహన్ రావు. కరోనా వైరస్ అరికట్టడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం జోగిపేటలో కొవీడ్ 19 దరిచేరకుండా నిరంతర వ్యాక్సిన్ హైపో క్లోరైడ్ ద్రావణాన్ని మదన్మోహన్ ట్రస్టు ద్వారా సొంత డబ్బులతో స్ప్రే చేస్తున్నట్టు మదన్ మోహన్ రావు అన్నారు. ప్రపంచ దేశాలను ఈ వైరస్ అతలాకుతలం చేస్తోందని, అందోల్ నియోజకవర్గం పరిధిలోని జోగిపేటలో హైపో క్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నట్టు పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ నివారణ లో భాగంగా ప్రజల సంక్షేమం కోసం నారాయణఖేడ్ పురవీధుల గుండా హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేస్తే మా పై కేసులు నమోదు చేసిన సిగ్గుమాలిన చర్య ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కె చెందుతోందన్నారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా తాను ప్రజల మనిషిని అని ఇలాంటి వాటికి నేనెప్పుడూ భయపడను అంటూ మదన్ మోహన్ రావు గట్టి కౌంటర్ విసిరారు. కొవీడ్ 19 నిబంధనలను ఉల్లంఘించి ప్రజల సమూహంలో బర్త్డే పార్టీలు జరుపుకున్నది ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. భూపాల్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ని తిడుతుంటే పట్టించుకోవడం లేదన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ బీబీ పాటిల్ ప్రజలకు అందుబాటులో లేరని. కరోనా వైరస్ తో సతమతమవుతూ, ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఎంపీ బీబీ పాటిల్ ముఖంచాటేశారనీ ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తి పై పోలీస్ స్టేషన్లో కనిపించడం లేదంటూ కేసు నమోదు చేయాలని కోరారు.

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
17 minutes ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
15 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
11 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
18 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
21 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago
ఇంకా