newssting
BITING NEWS :
*విషమంగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ఆరోగ్యం.. వెంటిలేటర్ పై చికిత్స *వనపర్తి జిల్లా నాగపూర్ లో విషాదం ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య *హైద‌రాబాద్‌: పంచాయతీ,మండల, జిల్లాప్రజా పరిషత్‌లకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ.. ఆరేళ్ల క్రితం నిలిపివేసిన ఆర్థికసంఘం.. ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరు*ఢిల్లీ: ప్ర‌శాంత్ భూష‌ణ్ కోర్టు ధిక్క‌ర‌ణ సుమోటో కేసులో సుప్రీంకోర్టు తీర్పు... ప్ర‌శాంత్ భూష‌ణ్‌ను దోషిగా తేల్చిన జ‌స్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం.. శిక్ష‌పై ఈ నెల 20న వాద‌న‌లు వింటాం-సుప్రీం*హైద‌రాబాద్‌: కోవిడ్ కి ఉచిత చికిత్స చేయాలి.. కరోనాతో ఆదాయ మార్గం పోయింది కాబట్టి పేదలకు ఆరు నెలల పాటు రూ. 7500 చొప్పున‌ ఇవ్వాలి-ప్రొఫెస‌ర్ కోదండరాం*భార‌త్‌లో రికార్డు స్థాయిలో పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు.. గడచిన 24 గంటల్లో 64,553 కరోనా కేసులు నమోదు, 1007 మంది మృతి.. 24,61,191కు చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు, ఇప్ప‌టి వ‌ర‌కు 48,040 మంది మృతి*తెలంగాణ‌లో 1921 పాజిటివ్ కేసులు నమోదు, 9 మంది మృతి.. 88396కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య‌, ఇప్పటి వరకు 674 మంది మృతి

ఎన్ని డెడ్ లైన్లు పెట్టిన వెనక్కి తగ్గేది లేదు ..సమ్మె విరమణకు ససేమిరా

05-11-201905-11-2019 15:33:44 IST
Updated On 05-11-2019 16:19:59 ISTUpdated On 05-11-20192019-11-05T10:03:44.438Z05-11-2019 2019-11-05T10:03:42.561Z - 2019-11-05T10:49:59.424Z - 05-11-2019

ఎన్ని డెడ్ లైన్లు పెట్టిన వెనక్కి తగ్గేది లేదు ..సమ్మె విరమణకు ససేమిరా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నవంబర్ 5వ తేదీ అర్థరాత్రి 12 గంటలు.. తెలంగాణ సీఎం కేసీఆర్ సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ఆఖరి డెడ్ లైన్. 5వ తేదీ అర్థరాత్రిలోపు కార్మికులు భేషరతుగా విధుల్లో చేరాలని అల్టిమేటం ఇచ్చారు కేసీఆర్. అయితే తాము ఎన్ని డెడ్ లైన్లు పెట్టిన వెనక్కి తగ్గేది లేదంటున్నారు ఆర్టీసీ జేఏసీ నేతలు. ఈమేరకు మీడియా సమావేశంలో ప్రకటించారు.

కార్మికులను బెదిరిస్తున్న తీరుని ఆర్టీసీ జేఏసీ తీవ్రంగా ఖండించింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఎలాంటి తీర్పు వచ్చినా సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం కేసీఆర్‌ బెదిరిస్తున్నారని, కార్మికులను భయబ్రాంతులకు గురిచేయడంపై జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి  మండిపడ్డారు.

తమను చర్చలకు పిలిస్తే మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆర్టీసీ ప్రైవేటీకరణ రాష్ట్ర ప్రభుత్వ ఇష్టప్రకారం చేసేది కాదన్నారు. ఆర్టీసీలో 31శాతం కేంద్రానికి వాటా ఉంటుంది. కేంద్రం అనుమతి లేకుండా సంస్థను ఎలా మారుస్తారని ఆయన ప్రశ్నించారు. చట్టం ద్వారా కార్మికులకు ఉద్యోగ భద్రత ఉంటుంది. సీఎం కేసీఆర్ హెచ్చరికలకు ఎవరూ భయపడవదన్నారు. భారీ ఎత్తున కార్మికులు విధులకు వెళుతున్నారని తప్పుడు సమాచారం ఇస్తున్నారని విమర్శించారు. 

భైన్సాలో తాత్కాలిక ఉద్యోగులు డీఎంపై దాడి చేయడాన్ని జేఏసీ నేతలు ఖండించారు. ఇంతమంది కార్మికులు చనిపోతే ప్రభుత్వం తరఫున కనీసం సానుభూతి చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో తాము ఈ ఘటనను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా 7న పెన్‌డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థి సంఘాలతో మాట్లాడుతామని, ఛలో ట్యాంక్ బండ్ విజయవంతం చేసేందుకు అంతా సహకరించాలన్నారు.

ఒకవైపు నెలరోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే.. సీఎం కేసీఆర్ కామెంట్లు, వత్తిడితో డ్రైవర్లు, కండక్టర్లు చనిపోతున్నారు. తాజాగా దేవరకొండ డిపోలో గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతిచెందడంతో దేవరకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్రైవర్‌ మృతదేహంతో ఆర్టీసీ కార్మికులు డిపో ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యులకు అఖిలపక్ష పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పట్టణంలోని దుకాణాలను మూసి వేయించారు. 

గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ మృతిచెందడంతో సోమవారం దేవరకొండలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. డ్రైవర్‌ మృతదేహంతో ఆర్టీసీ కార్మికులు డి పో ఎదుట ఆందోళన చేపట్టి మృతుడి కుటుం బానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వీరికి అఖిలపక్ష పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో పట్టణంలోని దుకా ణాలను మూసి వేయించారు. 

ఆర్టీసీ కార్మికులు యూనియన్‌ నాయకుల ఉచ్చులో పడవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఆర్టీసీ బాగోగుల కోసం ఏం చేయాలో సీఎం కేసీఆర్ కు బాగా తెలుసన్నారు. కార్మికులు సమ్మె విరమించాలని ఆమె కోరారు. ఇదిలా ఉంటే ఆర్టీసీపై సీఎం కేసీఆర్ మరోసారి సమీక్ష చేపట్టారు. సీఎం పిలుపుమేరకు  రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పాల్గొన్నారు. 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle