newssting
BITING NEWS :
*అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటన.. ఘనంగా స్వాగతం..సబర్మతి ఆశ్రమంలో మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా తిప్పిన ట్రంప్ పంపతులు *సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ దంపతులు... గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ట్రంప్, మోడీ *నేడు విజయనగరం జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన.. జగనన్న వసతి దీవేన కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం*సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసుల తనిఖీలు.. ప్లాట్ ఫామ్‌లతో పాటు రైళ్లలోనూ క్షుణ్ణంగా తనిఖీ, పేలుడు పదార్థాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు *చిత్తూరు జిల్లాలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..శ్రీ చౌడేశ్వరి ఆలయం వెనకాల ప్రాంతంలో తవ్వకాలు *ఆదిలాబాద్‌ గుడిహత్నూర్‌లో దారుణం....బాలికపై ఇద్దరు కామాంధుల అత్యాచారం* చైనాలో కొనసాగుతున్న కరోనా మరణమృదంగం....ఇప్పటివరకు 2వేల 460కి చేరిన కొవిడ్-19 మృతుల సంఖ్య*ఒడిశా : పూరీ జిల్లా పిప్పిలి ప్రాంతంలో ఏనుగుల బీభత్సం...ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి.., ఐదుగురికి గాయాలు *గుజరాత్‌లోని వడోదరలో ఘోర రోడ్డు ప్రమాదం..ట్రక్కు- టెంపో ఢీ, 11మంది మృతి *68వ రోజు కొనసాగుతున్న రాజధాని రైతుల ఆందోళన

ఎన్నిక‌ల ఖ‌ర్చును రాబ‌ట్టుకునేప‌నిలో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు..!

06-11-201906-11-2019 13:07:59 IST
2019-11-06T07:37:59.432Z06-11-2019 2019-11-06T07:37:40.377Z - - 24-02-2020

ఎన్నిక‌ల ఖ‌ర్చును రాబ‌ట్టుకునేప‌నిలో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గ‌త ఏడాది జ‌రిగిన ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నిజామాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ తొమ్మిది స్థానాల్లో ఎనిమిది సీట్ల‌ను గెలిచిన సంగతి తెలిసిందే. య‌ల్లారెడ్డిలో కాంగ్రెస్ గెలిచినా ఆ త‌రువాతి కొద్ది రోజుల్లోకే ఆయ‌నా కారెక్కేశారు. దీంతో తొమ్మిది నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలే ఉన్నారు.

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. తొమ్మిది మందిలో ఒక‌రు స్పీక‌ర్‌గా ఉండ‌గా, మ‌రొక‌రు మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. మ‌రొక‌రు ప్ర‌భుత్వ విప్ బాధ్య‌త‌ల్లో ఉన్నారు. ఈ క్ర‌మంలో చాలా మంది ఎమ్మెల్యేలు నియోక‌వ‌ర్గాల వైపు చూడ‌ట‌మే మానేశార‌న్న టాక్ ప్ర‌జల నుంచి వినిపిస్తోంది.

ఎన్నిక‌ల్లో పెట్టిన ఖర్చులు రాబ‌ట్టుకునేందుకు సైడ్ బిజినెస్ మొద‌లు పెట్టేశారని, ఒక‌ప‌క్క అధికారాన్ని అనుభ‌విస్తూనే మ‌రోవైపు కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారంలో, మ‌రికొంద‌రు ఇత‌ర వ్యాపారాల్లో బిజీ అయ్యార‌ని స్థానిక ప్ర‌జ‌లే చెబుతున్నారు. అందులో భాగంగానే నియోజ‌క‌వ‌ర్గాల్లో భూత‌ద్దాలుపెట్టి వెతికినా ఎమ్మెల్యేలు క‌న‌ప‌డ‌టం లేద‌ని ప్ర‌జ‌లు పేర్కొంటున్నారు. మ‌రికొంద‌రు ఎమ్మెల్యేలు అడ‌పా.. ద‌డ‌పా.. చిన్న చిన్న షాపుల ఓపెనింగ్‌కు వ‌స్తూ అలా మెరిసిపోతున్నారు.

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నుంచి ఓ ఎమ్మెల్యే నియోజ‌క‌వ‌ర్గానికి మొఖం చాటేశారు. విదేశాల్లో ఉన్న త‌న వ్యాపారాల్లో స‌ద‌రు ఎమ్మెల్యే బిజీ అయ్యార‌నే టాక్ న‌డుస్తోంది. అభివృద్ధి ప‌నుల‌కు నిధులు లేక ప‌నులు మ‌ధ్య‌లో ఆగిపోవం, నియోజ‌క‌వ‌ర్గ నిధులు త‌గ్గిపోవ‌డంతో ప్ర‌త్యామ్నాయం వైపు దృష్టిపెట్టార‌నే స‌మాచారం విన‌వ‌స్తోంది.

జిల్లా కేంద్రానికి ద‌గ్గర్లో ఉండే మ‌రో ఎమ్మెల్యే వారంలో ఒక్క రోజు మాత్ర‌మే అంటూ నియోజ‌క‌వ‌ర్గానికి వ‌స్తున్నారు. దీంతో కార్య‌క‌ర్త‌లు నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు వారి వారి స‌మ‌స్య‌లు ఎవ‌రికి చెప్పుకోవాలో తెలియ‌క త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఉమ్మ‌డి నిజామాబాద్ జిల్లాలో మెజార్టీ ఎమ్మెల్యేలు రెండోసారి ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గ‌త ఎన్నిక‌ల‌కంటే రెట్టింపు ఖ‌ర్చు పెట్టార‌ని, కొంద‌రు ఇప్ప‌టికీ అప్పులు క‌డుతుంటే.. మ‌రికొంద‌రు ఖ‌ర్చుల‌ను రాబ‌ట్టుకునేందుకు బిజినెస్‌మెన్ అవ‌తార‌మెత్తార‌ని స్థానిక ప్ర‌జ‌లు బాహాటంగానే మీడియాకు చెబుతున్నారు.

ఎమ్మెల్యేగిరిచేస్తే అప్పులు తీర‌వంటూ సైడ్ దందాలు మొద‌లు పెట్టిన‌ట్టు తెలుస్తుంది. గెలిచిన ఎమ్మెల్యేల్లో చాలా మంది కాంట్రాక్ట‌ర్లు, బిల్డ‌ర్లుగా ఉండి రాజ‌కీయ ఆరంగ్రేటం చేసిన‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఆ క్ర‌మంలోనే మొద‌టిసారి సుల‌భంగా గెలిచినా.. రెండోసారి గెలిస్తే మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఇబ్బ‌డి ముబ్బ‌డిగా ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలుస్తుంది.  ఇప్పుడు ఆ ఖ‌ర్చుల‌ను రాబ‌ట్టుకునేందుకు స‌ర్కార్ ప‌నుల‌పై ఆశ‌లేక‌పోవ‌డంతో పాత బిజినెస్‌ల‌పై దృష్టిపెట్టిన‌ట్టు ప్ర‌జ‌లు చెవులు కొరుక్కుంటున్నారు.

ఇందూరులో ఇంకో ఎమ్మెల్యే ఓ అడుగు ముందుకేసి భూక‌బ్జాలు, ల్యాండ్ సెటిల్‌మెంట్‌ల కోసం ఓ గ్యాంగ్‌ను సిద్ధం చేశార‌నే టాక్ న‌డుస్తోంది. ఇంకొక‌రు ఓ కార్పొరేష‌న్ స్థ‌లాన్ని లీజుకు తీసుకుని భారీ షాపింగ్ కాంప్లెక్స్ క‌ట్టేశార‌ట‌.

ఇలా చాలా మంది ఎమ్మెల్యేలు నియోజ‌క‌వ‌ర్గానికి బిజీగా మారిపోయార‌ట‌. ఎమ్మెల్యేల బిజినెస్‌ల విష‌యం అధిష్టానానికి తెలిసినా అయితే ఓకే అంటున్నార‌ట‌. ఎన్నిక‌ల సంవ‌త్స‌రం వ‌ర‌కు త‌మ సొంత వ్యాపారాల‌ను బాగుచేసుకుని చివ‌రి సంవ‌త్స‌రం నియోజ‌క‌వ‌ర్గంలోనే ఉండాల‌న్న ప్లాన్‌తో ఎమ్మెల్యేలు ఉన్న‌ట్టు తెలుస్తుంది.

అయితే, నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌లు మాత్ర ఎమ్మెల్యేల కోసం కార్యాల‌యాల చుట్టూ చెప్పుల‌రిగేలా తిరుగుతున్నా కంటికి క‌నిపించ‌డం లేద‌ని ప్ర‌జ‌లు ఉసూరుమంటున్నారు. ప్ర‌జా ప్ర‌తినిధులుగా గెలిచిన ఎమ్మెల్యేలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేకుండా అజ్ఞాత‌వాసంలో ఉండ‌టంప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు మండిప‌డుతున్నారు. సొంత ప‌నులు చ‌క్క‌బెట్టుకున్నా.. నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు స‌మ‌య‌మివ్వాల‌ని కోరుతున్నారు. 

 

 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle